సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2119వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సంపూర్ణ విశ్వాసముంటే అన్ని అనుగ్రహిస్తారు బాబా

నా పేరు మాధవి. మేము అమెరికాలో ఉంటాము. నేను నా భర్తకోసం ఈ సంవత్సరం(2026) ఒక సర్‌ప్రైజ్ పుట్టినరోజు పార్టీ ప్లాన్ చేయాలని సంకల్పించి మొట్టమొదట బాబాను ఆహ్వానించి, 'అంతా సజావుగా జరిగేలా చూడమని, అలాగే చివరి క్షణం వరకు సర్‌ప్రైజ్‌నా భర్తకి తెలియకుండా రహస్యంగా ఉంచమని' ఆయనను కోరాను. తర్వాత అన్నీ ప్రణాళిక చేసి, నా భర్త స్నేహితులను ఆహ్వానించాను. వాళ్ళు మావారి పుట్టినరోజు రేపనగా ముందురోజు సర్ప్రైజ్ బయటపెట్టడానికి ప్రయత్నించారు కానీ, బాబా దయవల్ల బయటపడలేదు. అయితే మావారు మర్నాడు బయటకు వెళ్లాలని అన్నారు. నేను ఆయన్ని వెళ్లోద్దని చెప్పినా, ఆయన వినలేదు. చివరికి నేను అంతా బాబా పాదాల చెంత వదిలేశాను. బాబా దయవల్ల మావారు ఇంట్లోనే ఉండటానికి ఒప్పుకున్నారు. ఒకవేళ ఆయన బయటకు వెళ్లి ఉంటే, నా ప్రణాళిక మొత్తం దెబ్బతిని ఉండేది. మర్నాడు సాయంత్రం నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. ఆ సర్‌ప్రైజ్‌ను చూసినప్పుడు నా భర్త ముఖంలోని హావభావాలను చూసి నాకు చాలా సంతోషమేసింది. పార్టీ మొత్తం చాలా బాగా జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత నా భర్త చాలా సంతోషంగా, "నాకు ఈ పార్టీ గురించి ఏమాత్రం తెలీదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేద"ని నాతో చెప్పారు. "బాబా! మీ అనుగ్రహం లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదని నాకు తెలుసు. మీరు ఏదో ఒక రూపంలో నా భర్తని ఆశీర్వదించడానికి, అంతా చక్కగా జరిగేలా చూడటానికి వచ్చారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బాబా. చాలా చాలా ధన్యవాదాలు బాబా".

మేము మా అమ్మ, నాన్నలను అమెరికాకు తీసుకొని రావాలని ప్రణాళిక చేసాము. కానీ మొదట మా నాన్నకి తన ఆఫీసులో అనుమతి లభించలేదు. నేను ఆశలన్నీ వదులుకున్నప్పటికీ సమస్యను బాబా పాదాల చెంత పెట్టాను. బాబా దయవల్ల ఆశ్చర్యకరంగా ఒక నెల సెలవు నాన్నకి మంజూరైంది. నేను సంతోషంగా చాలా ధన్యవాదాలు బాబాకి చెప్పుకొని, "మా అమ్మానాన్నలు సంతోషంగా ఇక్కడికి వచ్చి, ప్రశాంతంగా ఇక్కడంతా ఆస్వాదించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాల"ని బాబాను ప్రార్థించాను. వాళ్ళు ఇక్కడున్న నెల రోజుల్లో మేము అనేక చోట్లకి పర్యటించాలని ప్రణాళిక చేసాము. ఆ క్రమంలో మేము న్యూయార్క్ వెళ్ళినప్పుడు, నా భర్త సెక్యూరిటీ చెక్ చేస్తున్న సమయంలో తన గాగుల్స్‌ అక్కడెక్కడో పొరపాటున పెట్టేసారు. ఆ సమయంలో ఆయన ఆఫీస్ కాల్‌లో మాట్లాడుతున్నందువల్ల వాటిని అక్కడే వదిలేశానని గమనించుకోకుండా వచ్చేసారు. తర్వాత ఆయన అవి ఎక్కడో పోయాయని గుర్తించారు. ఆ గాగుల్స్ చాలా ఖరీదైనవి, మరీ ముఖ్యంగా అవి పుట్టినరోజు బహుమతిగా తన స్నేహితులు తనకి ఇచ్చినవి. అందువల్ల నాకు చాలా బాధగా అనిపించి, 'బహుశా నేను ఆయన పుట్టినరోజున ఏదైనా తప్పు చేశానేమో! లేదంటే మనస్ఫూర్తిగా ఆ బహుమతి ఇవ్వలేదేమో!' అని ఎన్నో ఆలోచనలు నా మనసులో మెదిలాయి. చివరకి నేను, “బాబా! ఆయన స్నేహితులు ఆ కానుకను మనస్ఫూర్తిగా ఇవ్వకపోయుంటే, ఆ గాగుల్స్ పోయినా ఫర్వాలేదు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చి ఉంటే, దయచేసి ఎలాగైనా ఆ గాగుల్స్ మావారి దగ్గరకి తిరిగి వచ్చేలా చేయండి” అని బాబాను ప్రార్థించి సర్వం వారి పాదాల చెంత ఉంచి, పూర్తిగా శరణాగతి చేశాను. ఆ తర్వాత బాబా చేసిన అద్భుతం చూడండి! నా భర్త వెనక్కి వెళ్లి భద్రతా సిబ్బందిని ఆ గాగుల్స్ గురించి అడిగితే, 'వాళ్ళకి అవి దొరికితే, భద్రంగా పక్కన పెట్టి, ఎవరైనా వచ్చి వాటిని తీసుకెళ్తారా అని ఎదురుచూస్తున్నామని' చెప్పి మావారికి ఇచ్చారు. మనం సంపూర్ణ విశ్వాసంతో ప్రతిదీ బాబా పాదాల చెంత ఉంచినప్పుడు, ఆయన తనదైన రీతిలో అన్నింటినీ చూసుకుంటారు. "మీకు చాలా ధన్యవాదాలు బాబా".

మేము న్యూయార్క్‌ పర్యటనలో భాగంగా ఒక చోటకి వెళ్లి, అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు ఏ రైలు ఎక్కాలో తెలుసుకోవడానికి రద్దీగా ఉండే అంత పెద్ద నగరంలో రైళ్ల గురించి సరైన సమాచారం తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాము. అదే సమయంలో మా నాన్నకి అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం వచ్చింది. ఆయన షుగర్ వ్యాధిగ్రస్తులైనందున తరచుగా బాత్రూంకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ దాదాపు గంటసేపు వెతికినా ఒక్క టాయిలెట్ కూడా కనపడలేదు. నాన్న నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన్ని నేను అంతకు ముందెన్నడూ ఆ స్థితిలో చూడని నేను  ఆయన అంతలా ఇబ్బందిపడటం చూడలేకపోయాను. ఆయన విలవిలలాడటం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు చాలా నిస్సహాయంగా అనిపించి, "బాబా! నాన్న ఇలా బాధపడటం నేను చూడలేకపోతున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల 15 నిమిషాల తర్వాత మాకు ఒక టాయిలెట్ కనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా. నేను ఎప్పుడూ మా అమ్మానాన్నల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటాను. దయచేసి వారిని జాగ్రత్తగా చూసుకోండి బాబా. దయచేసి వారిని ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి".

నేను ఈ అనుభవాలన్నిటి ద్వారా బాబాకు సంపూర్ణంగా శరణాగతి చెందడం వల్ల ఎంత మేలు జరుగుతుందో, శరణాగతి మహిమ ఏమిటో అర్థం చేసుకున్నాను.  ఇంకా ఈ అనుభవాలు నా విశ్వాసాన్ని బలపరిచి, బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని నాకు బోధించాయి. బాబా మన ప్రార్థనలను ఆలకిస్తారు, మన చింతలను అర్థం చేసుకుంటారు, మనం ఊహించని రీతులలో మనల్ని ఆదుకుంటారు. ప్రియ భక్తులారా, మనం మన సర్వస్వాన్ని బాబా పాదాల చెంత మనస్ఫూర్తిగా సమర్పించినప్పుడు, మనం ప్రగాఢమైన శాంతిని అనుభూతి చెందగలము. "ధన్యవాదాలు బాబా. దయచేసి మీ భక్తులందరిపై మీ ఆశీర్వాద హస్తాన్ని ఎల్లప్పుడూ ఉంచండి. మీకు పూర్తిగా శరణాగతి చెందేందుకు, మీపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేందుకు మాకు శక్తిని ప్రసాదించండి".

2 comments:

  1. Baba me daya valana Kalyan ki marriage ipoindi variddarini kalipi unchu swamy house kosam kattina money vapasu ippinchu thandri meku sathakoti vandanalu 🙏🙏

    ReplyDelete
  2. Sai Sai 🙏🙏🙏❤️❤️❤️😘😘🥰😍😍❤️

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo