సాయి వచనం:-
'ఆకలిదప్పులు మరచి, నా పంచప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను. వారి సన్నిధి నుండి ఎవరూ రిక్తహస్తములతో బయటకు పోరు. నా ప్రతిభకంతటికీ కర్త నా గురువే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే.'

'మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన చేరగలిగినా అది బాబా చూపిన పవిత్రమార్గం కానప్పుడు అది నిష్ఫలమే అవుతుంది. ఆ అపవిత్రపు మార్గం, బాబా చేర్చాలనుకున్న గమ్యానికి చేరువ కానీయక, మనమే ఏర్పరచుకున్న అడ్డంకియై గమ్యానికి మరింతగా దూరం చేస్తుంది' - శ్రీబాబూజీ.

సాధువు మరియు కూలీ రూపాలలో సీతాకాంత్ గారిని రక్షించిన బాబా

రైలు ప్రమాదం నుండి తన భక్తుని రక్షించిన బాబా లీల. 'తన భక్తులను కాపాడటానికి బాబా అనేక రూపాలను ధరిస్తారు' అని శ్రీసాయిసచ్చరిత్రలో మనం చదువుకున్నాము. అటువంటి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీరు చదవబోతున్నారు. ఈ లీలలో, రైలు ప్రమాదం నుండి తమ భక్తుడైన సీతాకాంత్ కామత్‌ని కాపాడటానికి బాబా ఒక సాధువు మరియు కూలీ రూపాలను ధరించారు. సీతాకాంత్ కామత్ మిజోరంలో పనిచేస్తూ...

కదిలే ట్రైన్ నుండి పడిపోతున్న భక్తుని కాపాడిన బాబా

కదిలే ట్రైన్ నుండి పడిపోతున్న తనని బాబా ఎలా రక్షించారో శ్రీR.మెర్‌వాలా ఇలా చెప్తున్నారు... నేను ముంబాయిలో వకీలుగా పనిచేసేవాడిని. నేను దేవీ, దేవుళ్ళను అంతగా నమ్మేవాణ్ణికాదు. కానీ నాకు సాయిబాబాపై నమ్మకం వుండేది. అది 1963వ సంవత్సరం. ఒకరోజు నేను లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్‌లో చాలా రద్దీగా ఉండటం వలన నేను ఎంట్రన్స్ దగ్గరే...

అమాయక భక్తులను సాయిబాబా ఎంతో ప్రేమిస్తారు

సాయిబాబా గొప్ప లీల. కొన్ని నెలల క్రితం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ని కలుసుకున్నాను. ఆమె పేరు విక్కీ. నేను ఆమెని 'విక్కీదీదీ' (దీదీ అంటే అక్క) అని పిలుస్తుంటాను. ఆమె ఒక సంవత్సర కాలంగా టచ్‌లో లేరు. అనుకోకుండా ఆరోజు కలుసుకున్నాను. మేము తనని లంచ్‌కి రమ్మని ఆహ్వానించాము. ఆమె ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని సమస్యల కారణంగా ఆమె తన భర్తనుండి విడిగా ఉందని తెలిసింది....

బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు

సాయిబాబా దేవుడు. నేను 'శ్రీసాయిబాబా దేవుని కంటే ఎక్కువ' అని చెప్తాను. సాయిబాబా ఇప్పటికీ ఈ విశ్వంలో ఉన్నారని నా అభిప్రాయం.  ప్రాచీనకాలంలో నిజమైన భక్తులు దేవుణ్ణి చూశారని అంటారు. వారు దేవుని దర్శనం కోసం తపస్సులు చేశారు. కానీ శ్రీసాయిబాబా శిరిడీలో కొన్ని సంవత్సరాలపాటు సత్పురుషులుగా ఉన్నారు. ఎంతోమంది వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందారు....

రండి బండ్లకొద్దీ ఊదీని తీసుకొని పోండి.

పిలిస్తే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శిరిడీ సాయినాథునికి పాదాభివందనం. నా పేరు విజయరాణి సురేష్. మేము L.B.నగర్‌ (హైదరాబాద్)లో ఉంటాము. "నా మనసులో ఉన్న కోరికను బాబా ఎలా తీర్చారో అన్న అనుభవాన్ని, నా సంతోషాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు బాబా. ఎల్లప్పుడూ...

బాబా నా భర్తకి పునర్జన్మనిచ్చారు

నా పేరు అనూరాధ. నా వయస్సు 56 సంవత్సరాలు. మేము చెన్నై నివాసస్థులం. నేను నా జీవితంలో మర్చిపోలేని సాయిలీల ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అనుభవంతో నేను బాబా యొక్క అమితమైన ప్రేమను చవిచూశాను. నమ్మకమే లేని నేను ఈ అనుభవంతో సాయికి అంకిత భక్తురాలిని అయిపోయాను. కేవలం నేనే కాదు, మా కుటుంబమంతా సాయిభక్తులం అయిపోయాం. 1997వ సంవత్సరం, ఫిబ్రవరి నెల 8వ తేదీన...

నీవు చింతించకు, ప్రతిదీ జాగ్రత్త తీసుకోబడుతుంది

వాట్సాప్ గ్రూపులోని ఒక సాయిబంధువు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. 2018, జూన్ 18 నాటి ఒక కల మీతో పంచుకుంటాను. కొన్నిరోజుల క్రితం నేను, ఒక సాయిబంధువు బాబా పేరు మీద జరుగుతున్న మోసాల గురించి చాలా బాధగా చర్చించుకున్నాం. "ఏదైనా ఈ విషయంలో బాబాయే చేయాలి, మనము చేయగలిగింది ఏమీ లేదు" అని అనుకున్నాము. 2018, జూన్ 16 శనివారం సాయంత్రం ఒక సాయిభక్తుడు ఇలా చెప్పారు: "రెండు సంవత్సరాల క్రితం ఒకతను  విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నా వద్ద నుండి డబ్బు తీసుకొని మోసం చేసాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి 'గురువు'గా అవతారమెత్తి కనిపించాడు. ప్రజలు గుడ్డిగా అతనిని అనుసరిస్తున్నారు. అతను బాబా పేరు చెప్పుకొని ప్రజల వద్ద నుండి డబ్బు గుంజుతున్నాడు". ఇటువంటి సంఘటనే 2015లో నాకు కూడా జరిగింది. ఢిల్లీలోని ఒకచోట సాయి మందిర నిర్మాణం చేస్తామంటే, నేను ఆ చోటుకు సమీపంలో ఉన్న రెండు కమ్యూనిటీల నుండి నిధులను సేకరించి ఇచ్చాను. ఆ వ్యక్తి కూడా డబ్బంతా తీసుకొని పారిపోయాడు. ఇప్పటివరకు అతని గురించి ఏ సమాచారం లేదు. నిన్న రాత్రి నేను ఇటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేకపోయాను. నా మనస్సులో ఎన్నెన్నో ప్రశ్నలు. వేటికీ సమాధానాలు లేవు. చివరికి నేను బాబాని, "బాబా, ఏం జరుగుతుంది? వాళ్ళు అలా తప్పులు చేయడానికి మీ పేరును ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు మీరే కావాలని(ప్రతి ఒక్కళ్ళు బాబాలే అయిపోవాలని) ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్నే దోచుకుంటున్నారు. ఏమిటిదంతా?" అని అడిగాను. తరువాత సుమారు 2 గంటల సమయంలో నేను నిద్రపోయాను,...

బాబా పెట్టిచ్చిన వ్యాపారం - నిజదర్శనం.

సాయిబంధువులందరికీ నమస్కారం! బాబా ఆశీస్సులు తన పిల్లలమైన మన అందరిపై ఉండాలని ఆ సాయి మహరాజ్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  నా పేరు సురేష్‌ గౌడ్. నేను L.B.నగర్‌లో ఉంటాను. నా జీవితంలో ఒక అద్భుతమైన లీల జరిగింది. దానిని "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా మీతో పంచుకోవడానికి బాబా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.  20 సంవత్సరాల...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo