ఓం శ్రీ సాయినాథాయ నమః.
అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. మాది కర్నూల్. నేను నా జీవితంలో ఎన్నో సాయి లీలలు చూసాను. వాటిలో నుండి 2018లో మా వదినగారి విషయంలో జరిగిన, నేను చూసిన సాయిబాబా లీలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను శ్రీసాయి సచ్చరిత్ర పారాయణతోపాటు, శ్రీసాయి దివ్యపూజ కూడా చేస్తుంటాను. మా వదినగారి అబ్బాయి అభిలాష్ ఎంతో తెలివైనవాడు, బుద్దిమంతుడు. వాడు 3 సంవత్సరాల ముందు అంటే సుమారు 2015లో MBBS పూర్తి చేసాడు. తనకి MD చదవాలని ఎంతో ఇష్టం. ప్రవేశ పరీక్షకోసం ఢిల్లీలో కోచింగ్ కూడా తీసుకున్నాడు. కానీ రెండుసార్లు ఒక్క మార్క్ తేడాతో అపజయం పొందాడు. మా వదినగారు అతని భవిష్యత్తు గురించి ఎంతో ఒత్తిడికి గురయ్యారు. ఇది చూసిన నేను మా వదినగారికి సాయిబాబా వారి దివ్యపూజ గురించి తెలియచేశాను. తాను నియమనిష్ఠలతో బాబాకి ఐదు వారాలు పూజా చేసింది. దయామయుడైన సాయిబాబా వారి దయా వర్షం ఆ కుటుంబం పై కురిసింది. 3 సంవత్సరాల నుండి అందని ద్రాక్ష పండులా ఉన్న సీట్ ను బాబా సునాయాసంగా వచ్చేలా చేసారు. పాండిచ్చేరి (తమిళనాడు) లో MD సీట్ వచ్చింది. ఇప్పుడు మా వదినగారు బాబా వారి అనన్య భక్తురాలు. మనస్సు పెట్టి ప్రార్థిస్తే మన కోరికలు తీర్చే కల్పతరువు మన సాయిబాబా.
No comments:
Post a Comment