సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ సాయిబాబా వారి లీలావిలాసం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

బద్వేల్ నుండి సాయి కార్తీక్ గారు తమ మరో అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2011వ సంవత్సరంలో ఆధార్ కార్డ్స్ తీసే పనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేరాను. మేము ఉన్న ప్రాంతంలో అయిన తరువాత అక్కడికి దగ్గరగా ఉన్న వేరే ఊర్ల వారిని పిలిచాం. చాలామంది జనం వచ్చారు. మధ్యాహ్నానికల్లా 70% అయిపోయారు. తరువాత సిస్టం పని చేయక, పని ఆపివేసి మిగతా వాళ్ళను భోజనానికి వెళ్ళిరమ్మని చెప్పాము. మేము భోజనాలు అక్కడికే తెప్పించుకుని తినాలి. భోజనాలు వచ్చిన తరువాత తినడానికి వెళ్తూ ఉండగా గేటు దగ్గర ఒక ముసలాయన పడుకొని ఉండటం చూసాను. అప్పుడు సమయం 2గంటలు అవుతుంది. నేను అతనితో, "అన్నం తినిరా పో పెద్దాయనా!" అని చెప్పాను. అందుకు అతను, "మాది పక్క ఊరు, నా దగ్గర డబ్బులు లేవు, ఆకలి అవుతోంది. మీరు ఆధార్ కార్డు తీస్తే వెళ్తాను" అన్నారు. ఇప్పుడు సిస్టం పని చేయడం లేదని అంటే, నేను పోయి మరల రాలేను అన్నాడతను. మా దగ్గర ఉన్న భోజనం ప్యాకెట్స్ మాకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి, అదనంగా లేవు. సరే అని నా దగ్గర 150 రూపాయలు ఉంటే హోటల్ కు వెళ్లి 30రూపాయలు పెట్టి ఒక ఫుల్ మీల్స్ పార్సెల్ తెచ్చి పెద్దాయనకు ఇచ్చాను. ఆయన సంతోషంగా తిన్నాడు. తరువాత కొంతసేపటికి సిస్టం పని చేయడంతో పెద్దాయన ఆధార్ కార్డుకు ఫోటో తీసుకుని వెళ్లిపోయారు.

మరుసటి రోజు ఉదయం నేను వేరే పని మీద డబ్బులు చూసుకుంటే 300 రూపాయలు ఎక్కువగా వున్నాయి. ఎవరన్నా ఇచ్చారా? అని బాగా ఆలోచించాను. కాని ఎవ్వరూ ఇవ్వలేదు. మాకు భోజనాలు అన్నీ ఉచితంగా ఉంటాయి. అందువలన మాకు డబ్బుతో అంతగా పని ఉండదు కాబట్టి ఇంటి దగ్గర నుంచి 200రూపాయలు మాత్రమే తెచ్చుకున్నాను. అందులో 50 రూపాయలు ఛార్జీలకు పోగా 150 రూపాయలు నా జేబులో ఉన్నాయి. అందులో నుండి 30 రూపాయలు పెద్దాయన భోజనానికి పోతే, ఇక 120 రూపాయలే ఉండాలి. కానీ 420 రూపాయలు ఉన్నాయి. ఎంత ఆలోచించినా ఆ 300 రూపాయలు ఎలా వచ్చాయో అర్ధం కాలేదు.

ఆరోజు రాత్రి శ్రీ సాయి సచ్చరిత్రలో బాబాగారు చెప్పిన సంఘటన గుర్తొచ్చింది.
"ఆకలితో ఉన్న ఏ ప్రాణికి అన్నం పెట్టినా అది నాకు అన్నం పెట్టినట్లే!" అని బాబాగారు అన్నారు.
"మీరు నాకు ఒక రూపాయి ఇస్తే నేను మీకు పది రెట్లు ఇవ్వవలసి ఉంటుంది" అని బాబాగారు అన్నారు.

నా విషయంలో ఆకలితో ఉన్న పెద్దాయనకు పెట్టిన భోజనం బాబాగారికి పెట్టిన దానితో సమానం.
అప్పుడు అయిన ఖర్చు 30 రూపాయలు. దానికి 10 రెట్లు అంటే 300 రూపాయలు నాకు తెలియకుండానే బాబా ఇచ్చారు.

ఇది శ్రీ సాయిబాబా వారి లీలావిలాసం.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo