నా పేరు నిరుపమ. సాయిబంధువులందరికీ సాయిరాం.
ప్రియమైన సాయిబంధువులతో కలలో బాబా దర్శనం గురించిన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
రెండు రోజుల క్రితం శనివారంనాడు, అంటే 2018, 16వ తేదీ ఉదయాన నాకు ఒక కల వచ్చింది. కల పూర్తిగా గుర్తులేదుగానీ, కలలో నేను కొందరు స్నేహితులను కలుసుకున్నాను. మేము అందరం కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళాము. మేము వెళ్లిన ఒకచోట కొన్ని చట్టవిరుద్ధమైన విషయాలు జరుగుతున్నాయి. మేము అక్కడ నుండి తప్పించుకొని సముద్రతీరానికి చేరుకున్నాము. అకస్మాత్తుగా అక్కడ వరదలు రావడంతో మేము భయపడి పోయాము. అందువలన మేము అక్కడ నుండి పరుగుతీసాం. అదే సమయంలో నేను బాబా గురించి ఆలోచిస్తూ ఆయన సహాయం కోరాను. మరుక్షణంలో ఆకాశంలో వెలుగు రూపంలో బాబాను చూసాను. బాబా ముఖం మూడు వేర్వేరు రూపాల్లో స్పష్టంగా చూడగలిగాను. అలా బాబా దర్శనం ఇవ్వడంతో ఆనందంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాబాని చూస్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను ఆకాశంలో బాబాని చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అకస్మాత్తుగా బాబా నాలో విలీనమయిపోయారు(ఇది కాస్త సిల్లీగా అనిపించినప్పటికీ నా కలలో ఇదంతా నిజం). నేను బాబా దీవెనలు పొందినట్లుగా ఫీల్ అయ్యాను. వెంటనే నేను నా స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పాను. కానీ వారు వినడానికి ఆసక్తి చూపలేదు(నా నిజ జీవితంలో కూడా బాబాపై నాకున్న విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు నిజంగా చాలామంది అర్థం చేసుకోలేరు). కానీ ఆ సమయంలో బాబా ఆ వరదల నుండి మాకు రక్షణ కల్పించారు. అంతటితో కల ముగిసింది. చాలా ఆనందంతో నేను మేల్కొన్నాను. ఈ కల ద్వారా, "ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయినా రక్షణ కల్పించడానికి నేనున్నాను, నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు" అని బాబా హామీ ఇచ్చారు. బాబా నాకు తోడుగా ఉన్నానని నిరూపించారు. బాబా నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.
ఆరోజు ఉదయం నేను ఒక సాయి బంధువు ద్వారా షిర్డీ ప్రసాదం మరియు బాబా ఫోటోను అందుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రసాదం తీసుకొని ఆఫీసుకు బయలుదేరాను. నా అలవాటు ప్రకారం మధ్య దారిలో వాట్సాప్ గ్రూప్ సందేశాలను చూస్తున్నాను. అందులో క్రింద ఉన్న సందేశాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.
"లక్షలాది జనులు నా దర్శనం కోసం చాలా దూరాల నుండి షిర్డీకి వస్తారు. కానీ ఎవరైతే షిర్డీకి రాలేరో వారిని ఆశీర్వదించడానికి నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. నేను మిమ్మల్ని షిర్డీకి పిలవడం లేదని చెడుగా తలవకండి. ఇది కేవలం సమయానికి సంబంధించిన విషయం. నా పిల్లలందరూ నాకు సమానమే." - సాయిబాబా
నాకు ఆశీస్సులు ఇవ్వాలని బాబా నా దగ్గరకు వచ్చారు. "ఓ దేవా! నేను చాలా అదృష్టవంతురాలిని. మీ ఆశీస్సులు పొందాను. నా తప్పులను క్షమించు బాబా! నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకండి. నాకు ఇప్పుడు బాధలు, ఆందోళనలు ఏమీ కనిపించడం లేదు బాబా. మీరు తోడుగా ఉన్నప్పుడు నాకు ఇంక దిగులెందుకు?
ప్రియమైన సాయిబంధువులతో కలలో బాబా దర్శనం గురించిన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
రెండు రోజుల క్రితం శనివారంనాడు, అంటే 2018, 16వ తేదీ ఉదయాన నాకు ఒక కల వచ్చింది. కల పూర్తిగా గుర్తులేదుగానీ, కలలో నేను కొందరు స్నేహితులను కలుసుకున్నాను. మేము అందరం కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళాము. మేము వెళ్లిన ఒకచోట కొన్ని చట్టవిరుద్ధమైన విషయాలు జరుగుతున్నాయి. మేము అక్కడ నుండి తప్పించుకొని సముద్రతీరానికి చేరుకున్నాము. అకస్మాత్తుగా అక్కడ వరదలు రావడంతో మేము భయపడి పోయాము. అందువలన మేము అక్కడ నుండి పరుగుతీసాం. అదే సమయంలో నేను బాబా గురించి ఆలోచిస్తూ ఆయన సహాయం కోరాను. మరుక్షణంలో ఆకాశంలో వెలుగు రూపంలో బాబాను చూసాను. బాబా ముఖం మూడు వేర్వేరు రూపాల్లో స్పష్టంగా చూడగలిగాను. అలా బాబా దర్శనం ఇవ్వడంతో ఆనందంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాబాని చూస్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను ఆకాశంలో బాబాని చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అకస్మాత్తుగా బాబా నాలో విలీనమయిపోయారు(ఇది కాస్త సిల్లీగా అనిపించినప్పటికీ నా కలలో ఇదంతా నిజం). నేను బాబా దీవెనలు పొందినట్లుగా ఫీల్ అయ్యాను. వెంటనే నేను నా స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పాను. కానీ వారు వినడానికి ఆసక్తి చూపలేదు(నా నిజ జీవితంలో కూడా బాబాపై నాకున్న విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు నిజంగా చాలామంది అర్థం చేసుకోలేరు). కానీ ఆ సమయంలో బాబా ఆ వరదల నుండి మాకు రక్షణ కల్పించారు. అంతటితో కల ముగిసింది. చాలా ఆనందంతో నేను మేల్కొన్నాను. ఈ కల ద్వారా, "ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయినా రక్షణ కల్పించడానికి నేనున్నాను, నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు" అని బాబా హామీ ఇచ్చారు. బాబా నాకు తోడుగా ఉన్నానని నిరూపించారు. బాబా నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.
మరో అనుభవం:
2018, 18 ఉదయం నాకు చాలా సంతోషాన్నిచ్చిన మరో అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను. బాబా నాతో ఉండి, నాకు దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.ఆరోజు ఉదయం నేను ఒక సాయి బంధువు ద్వారా షిర్డీ ప్రసాదం మరియు బాబా ఫోటోను అందుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రసాదం తీసుకొని ఆఫీసుకు బయలుదేరాను. నా అలవాటు ప్రకారం మధ్య దారిలో వాట్సాప్ గ్రూప్ సందేశాలను చూస్తున్నాను. అందులో క్రింద ఉన్న సందేశాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.
"లక్షలాది జనులు నా దర్శనం కోసం చాలా దూరాల నుండి షిర్డీకి వస్తారు. కానీ ఎవరైతే షిర్డీకి రాలేరో వారిని ఆశీర్వదించడానికి నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. నేను మిమ్మల్ని షిర్డీకి పిలవడం లేదని చెడుగా తలవకండి. ఇది కేవలం సమయానికి సంబంధించిన విషయం. నా పిల్లలందరూ నాకు సమానమే." - సాయిబాబా
నాకు ఆశీస్సులు ఇవ్వాలని బాబా నా దగ్గరకు వచ్చారు. "ఓ దేవా! నేను చాలా అదృష్టవంతురాలిని. మీ ఆశీస్సులు పొందాను. నా తప్పులను క్షమించు బాబా! నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకండి. నాకు ఇప్పుడు బాధలు, ఆందోళనలు ఏమీ కనిపించడం లేదు బాబా. మీరు తోడుగా ఉన్నప్పుడు నాకు ఇంక దిగులెందుకు?
🕉 సాయి రామ్
ReplyDelete