సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శిరిడి ప్రవేశమే సంతోషదాయకం


హైదరాబాదు నుండి అనిత గారు తమ షిర్డీ ప్రయాణంలోని మధురానుభుతులు ఇలా తెలియజేస్తున్నారు.

2016 మార్చ్ లో నేను, మా బ్రదర్ మరియు మా కజిన్ సిస్టర్ ముగ్గురం కలసి షిరిడీ వెళ్ళాం. ఉదయం 7గంటలకి బస్సు షిర్డీ చేరుకుంది. అప్పటికి ఏ షాప్స్ ఓపెన్ అవలేదు. బస్సు దిగి షిర్డీ పుణ్య భూమిపై అడుగుపెట్టిపెట్టగానే చక్కటి సాంబ్రాణి సువాసన మొదలు అయ్యింది. బాబా ఆవిధంగా వెల్కమ్ చెప్పారు. ఎక్కడ నుండి సాంబ్రాణి సువాసన వస్తుంది అని అటు ఇటు అంత చూసాను. ఎక్కడ దరిదాపుల్లో షాపులు లేవు. ఎక్కడ ఏమి కనిపించలేదు. ఆశ్చర్యం అనిపించింది. మా అన్నయ్య మరియు మా కజిన్ సిస్టర్ ని అడిగాను మీకు సాంబ్రాణి వాసన వస్తుందా అని, వాళ్ళు మాకు ఏ వాసన రావడం లేదు అని చెప్పారు. ఆటో కొరకు మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. దారి పొడవునా అదే సాంబ్రాణి వాసన. ఆటో ఎక్కాము, ఆటో లో కూడా అదే సాంబ్రాణి వాసన, అన్నని మళ్ళి అడిగాను, తాను నాకు ఏ వాసన రావడం లేదు అని అన్నాడు. కజిన్ కూడా ఆలానే అన్నది. దారి పొడవునా అదే సాంబ్రాణి వాసన. బాబా ఇలా వెల్కమ్ చెప్పారు నేను అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ద్వారకామాయి దగ్గర లక్ష్మి భాయ్ లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాం. రూమ్ లోకి వెళ్ళేదాకా అదే సాంబ్రాణి వాసన వస్తుంది. బస్సు దిగిన దగ్గర నుండి , రూమ్ చేరే వరకు నాకు బాబా తన లీల చూపి, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

దర్శనం చేసుకొని రాత్రి 9 గంటలకు బస్ ఎక్కాము అప్పుడు మరో గ్రేట్ లీల బాబా చూపారు:

షిర్డీ రావడానికి ఒక సంవత్సరం ముందు మా ఇల్లును డిపాజిట్ పై అద్దెకు ఇచ్చాము. 2 సంవత్సరాల కొరకు అగ్రిమెంట్ వ్రాయించుకొని డిపాజిట్ తీసుకున్నాము. కాని ఒక సంవత్సరం అయినా తర్వాత అద్దెకు ఉండే అతను, నేను వేరే చోట ఇల్లు కొనుక్కున్నాను. మీరు ఒక సంవత్సరం డిపాజిట్ పైసలు తిరిగి ఇచ్చేయండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం మేము ఒక నెల గడువులో డబ్బులు రిటర్న్ చెయ్యాలి. అప్పుడు కొంచం పరిస్టితి క్లిష్టంగా ఉంది. ఒక లక్ష రూపాయలు అప్పటికి అప్పుడు సర్దుబాటు చేయడం ఎలా అని కొంచం టెన్షన్ లో ఉన్నాము. ఈ పరిస్తితిలో మేము షిర్డీ వచ్చాము. దర్శనం అన్ని బాగా చేసుకున్నాము. మళ్ళి రాత్రి 9 గంటలకి రిటర్న్ బస్సు ఉంది ఇంటికి వెళ్ళడానికి. రాత్రి గంటలకి బస్సు ఎక్కాము, జస్ట్ ఇలా సీట్ లో కూర్చున్నాము అంతే, అన్నయ్య కు కాల్ వచ్చింది. చూస్తే అద్దెకు ఉన్న అతను కాల్ చేస్తున్నారు. అన్నయ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. అతను ఏమన్నారో తెలుసా? సార్ మీరు డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఒక సంవత్సరం వరకు మీ ఇల్లు ఖాళీ చేయను, రెండు సంవత్సరాల  అగ్రిమెంట్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పారు. అన్నయ్య ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. సంతోషంతో  వెనుక సీట్ లో కూర్చున్న మాకు హ్యాపీగా ఈ వార్తా చెప్పాడు. మేము కూడా సంతోషించాము. తర్వాత  బస్సు స్టార్ట్ అయ్యింది. ఈ విదంగా బాబా మాకు హెల్ప్ చేసారు. షిర్డీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని బాబా ఇచ్చిన వాగ్దానం నిజం చేసారు. మేము షిర్డీ దర్శనం చేసుకోగానే బాబా మా సమస్య పరిష్కారం చేసారు. సాయి నాథునికి కోటి కోటి ధన్యవాదాలు.

మేము షిర్డీ నుండి ఇంటికి వచ్చిన తరువాత జరిగిన మరో అనుభవం:


మా ఇంటి దగ్గర సాయి మందిరం ఉన్నది. ఆ మందిరంలో పంతులు గారు రోజు సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం పారాయణం చేస్తుంటారు. నేను, మా కజిన్ సిస్టర్ షిర్డీ వెళ్లే ముందు దగ్గర్లో ఉన్న ఆ టెంపుల్ కి వెళ్ళాము. పంతులు గారితో  రేపు షిర్డీ వెళ్తున్నాము అని చెప్పాము. ఆయన సంతోషపడి నాకు అక్కడి విభూది ప్యాకెట్లు తీసుకురా అమ్మ అని చెప్పారు. నేను సరే అన్నాను. మేము షిర్డీ వెళ్లొచ్చాక ఒక వారం వరకు ఆ దగ్గర్లో ఉన్న టెంపుల్ కి వెళ్ళలేదు. సడన్ గా ఒక రోజు మా కజిన్ సిస్టర్(అక్క) టెంపుల్ కి వెళ్దాము అని అంటే నేను రెడీ అయ్యాను. పంతులు గారికి ఇవ్వడానికి విబూది ప్యాకెట్ తీసుకున్నాను. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి పంతులు గారు సాయి సచ్చరిత్ర విభూది మహిమకు సంబందించిన అధ్యాయం చదవడం విని ఇద్దరం ఆశ్చర్య పోయాము. గుడి లోపలికి వెళ్లి పంతులు గారు సాయి సచ్చరిత్ర చదవడం అయిపోయాక విబూది ప్యాకెట్లు ఇచ్చాను. ఆయన చాలా సంతోష పడ్డారు. ఎందుకంటే ఆరోజే తాను విబూది అధ్యాయం చదివారు కనుక. ఇంకా ఏమి చెప్పారో తెలుసా? అమ్మ ఒక వారం నుండి నేను సాయి సచ్చరిత్ర చదవలేదు, ఎందుకో చదవాలి అని అనిపించలేదు. మళ్ళి ఈ రోజే స్టార్ట్ చేశాను. బాబానే నేను సాయి సచ్చరిత్ర చదువకుండా చేసారు, ఎందుకంటే, విబూది ఈరోజు వచ్చేది ఉండే కనుక ఈరోజు వరకు చదువకుండా ఆపేసారు నన్ను. విబూది మహత్యం చదవడం, విబూది ఈ రోజే రావడం బాబా చేసిన లీలయే అని, ఆ టెంపుల్ ఇంచార్జి ని పిలచి అందరికి ఈ లీలను చెప్పాడు. అందరికి పంతులు గారు విబూది పంచి ప్రసాదం కూడా పెట్టారు. అంతా బాబా అనుగ్రహం.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo