సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రైలు ప్రమాదం నుండి రక్షించిన సాయినాధుడు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

 నెల్లూరు వాస్తవ్యులు బాలాజీ గారి అనుభవం:-
                                                 
నేను వృత్తి రీత్యా రైల్వేలో బిట్రగుంట స్టేషన్ కి 2016వ సంవత్సరంలో వచ్చాను. పిల్లల చదువులు కోసం మేము నెల్లూరులో ఉంటున్నాము. ఒక రోజు డ్యూటీ ముగించుకుని నెల్లూరు రావాలి. సమయం ఉదయం 07:40 అవుతుంది. నేను రైల్వే ట్రాక్ దాటుతున్నాను. అది కేవలం ఇంజన్లేదా ఒక ఆఫీసర్ సెలూన్ కోచ్ పెట్టే సైడింగ్ లైన్లో  నడుస్తున్నాననుకుంటున్నాను, కానీ నిజానికి అది ట్రైన్స్ నడిచే రన్నింగ్ లైన్. ఏదో కొంచెం శబ్దం వస్తే వెనక్కి తిరిగి చూసా, అంతే నా గుండె లయ తప్పింది. వంద మీటర్ల దూరంలో విజయవాడ వెళ్లే పాసింజర్ ట్రయిన్ వస్తుంది. ఆలోచించే సమయం లేదు. ఆసమయంలో బిట్రగుంట ఆగాలి కనుక 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వస్తుంది. డ్రైవర్సహాయ డ్రైవర్లు బిట్రగుంటలో మారాలి కాబట్టి ఇద్దరూ తమ సామానులు సర్దుకుంటున్నారు. నేను అదే ట్రాక్ మీద నడుస్తున్నానన్న విషయం వాళ్లు గమనించడం లేదు. హారన్ కొట్టడం లేదు. నాకు ట్రాక్ నుంచి ప్రక్కకు తప్పుకోవాలన్న ఆలోచన రాలేదు. అంత సమయం లేదు.  కానీ ఎవరో నెట్టి వేసినట్లు ఫ్రేక్షన్ అఫ్ సెకండ్ లో మృత్యవు నుంచి బయిట పడ్డాను. మెదడు మొద్దు బారింది. అక్కడే ఓ అరగంట కూర్చున్నాను. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. కానీ ఎలా బయిటపడ్డానో... కేవలం నా తండ్రి బాబా కృపతో మాత్రమే అని నాకు తెలుసు. అందుకే నా ఈ  మిగిలిన జీవితం సాయి సమర్దుని భిక్షే.

నాచేత ఇంకా కొన్ని చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయేమో, బాబా నన్ను మీ అందరితో కలిసి ఆయన తత్వాన్ని పంచుకోవాల్సిన ఋణం ఉన్నది కాబట్టి, ఇంతమంది సాయి బంధువులతో పరిచయ భాగ్యం కలిగి, మీ అందరి ఆశీర్వాద బలంతో సాయి పధం వైపు అడుగులు వేస్తున్నాము. ఇంతకంటే ఈ జీవితానికేం కావాలి చెప్పండి?

 సాయి సఛ్ఛరిత 8వ.అ.ఓవీ.6లో
"ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచి పోయాయి. సగం జన్మ నిద్రావస్తలో గడచి పోతుంది. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు".

 అదే అధ్యాయం లో 40వ ఓవీ

"మహా భాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి ఘఢియా సద్వినియోగం చేసుకోండి"
ఎందుకంటే ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టవశాత్తు అనుకోకుండా చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయాకండి.
సాయి బంధువులందరూ నా అనుభవాన్ని చదివారు కదా! సాయినాథుని లీలలు అగాధాలు. మీ జీవితంలో మీ అనుభవాలను మన సాయి బంధువులందరితో పంచుకోండి.

జై సాయి సమర్దా.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo