నాపేరు జగదీష్. సాయినాథుల వారు గజదొంగల బారి నుండి మమ్మల్ని రక్షించారు, నా ఆరోగ్యం బాగు చేసారు మరియు ప్రాణం తీసే జబ్బు నుండి మా పాపను కాపాడారు. ఆ అనుభవాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను.
ఒకసారి నేను, నా ధర్మపత్ని ముంబాయి నుంచి ఫస్ట్ క్లాస్ కోచ్ లో కూర్చొని యాత్రకి వెళ్తున్నాము. ఒక ముసలి దంపతులు, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మేము 8 మందిమే ఆ కోచ్ లో ఉన్నాము. నేను, నా భార్య కార్డ్స్ ఆడుకుంటున్నాము. మాతో ఉన్న ముసలాయన ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతూ వుంది. ప్రార్థన చేసుకునే ముందు ఆ వృద్ధ వ్యక్తి నాతో, ఈమార్గంలో ఎప్పుడూ ప్రయాణం చేయకూడదు, గజదొంగల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నాడు. నేను అంతగా పట్టించుకోలేదు, వినలేదు ముందు. మా ట్రైన్ హైదరాబాదు దాటి షోలాపూర్ కు చేరువలో ఉంది. ఇంతలో కొందరు గజదొంగలు మా ట్రైన్ ను బలవంతంగా ఆపేశారు. ఆ గజదొంగలు కట్టెలు, కత్తులు అన్నీ తీసుకొని ట్రైన్ ఎక్కేసారు. "ముస్లింలు అందరూ దిగిపొండి, హిందువులనందరినీ చంపేస్తాము" అని అరుస్తున్నారు.
ఇంతలో ఆ వృద్ధుడు ప్రార్థన చేసుకుంటూనే, "కోచ్ డోర్స్ అన్నీ వేసేయండి" అని ఆదేశమిచ్చాడు. అలాగే మేము అన్ని డోర్స్ మూసేసాము. వేరే కోచ్ లలో వున్న అందరినీ కొట్టి, డబ్బులన్నీ తీసేసుకొని, విలువైన వస్తువులను అపహరించి, అందరినీ క్రిందికి తోసేసారు. తరువాత మా కోచ్ వైపు వచ్చారు. చాలా భీకరంగా ప్రయత్నం చేసారు, కానీ కారణమేమో తెలీదు, మా డోర్స్ మాత్రం తెరుచుకోలేదు. ఆ వృద్ధ వ్యక్తి ఇంత కష్ట సమయంలో కూడా కదలకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ సంఘర్షణ 5 గంటలపాటు సాగింది.
ట్రైన్ షోలాపూర్ చేరేసరికి మా కోచ్ సురక్షితంగా ఉంది. ఆ గజదొంగలు మాకోచ్ ని ఏమీ చేయలేకపోయారు. కొన్నిరోజుల తరువాత ఆ వృద్ధ వ్యక్తి న్యూస్ పేపర్ లో, "ఆరోజు గజదొంగల బారినుండి మమ్మల్ని రక్షించింది మరెవరో కాదు, సాయిబాబానే!" అని రాసాడు. అంటే అతను ఆరోజు బాబాను స్మరిస్తున్నాడన్నమాట. అప్పుడు నాకు షిర్డీ సాయిబాబా గురించి తెలిసింది.
తరువాత మాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు, సాయిబాబా ఫోటో తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాం. ఆ ఫోటో పైన “If u look at me, I look at you(నీవు నాపై దృష్టి పెట్టు, నేను నీపై దృష్టి పెడతాను)” అని వ్రాసి ఉంది. ఇంట్లో బాబా ఫోటో పెట్టుకున్నాక నా ఆరోగ్యం బాగు అయింది. నాకు బ్లాడర్ లో స్టోన్ ఉండేది. బాబా దయవలన అది మందులతోనే నయమయ్యింది.
ఇంతలో మాకు ఒక పాప పుట్టింది. ఒక నెల తరువాత పాప జబ్బుపడితే హాస్పిటల్ లో అడ్మిట్ చేసాం. "బాబా! నిజంగా నువ్వు వుంటే నా పాపను బాగుచేయి తండ్రీ!" అని వేడుకున్నాను. పాప బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. అపుడు నేను బాబా దగ్గర, "నా పాపను బాగుచేయకుంటే నేను ఇంక నీ పూజ చేయను" అని నిర్ణయం తీసుకున్నాను. కాని ఆ పరాత్పరుడు, దీనజనవత్సలుడు, శరణాగత రక్షకుడు అయిన సాయి నా పాపను ప్రాణం తీసే జబ్బు నుండి రక్షించాడు. అప్పుడు మేము మా 5 నెలల పాపతో షిర్డీ వెళ్లాం. పాపను బాబా సమాధికి తాకించాము. ఇప్పుడు పాప స్కూల్ చదువు కూడా అయిపోయి కాలేజీకి వచ్చింది. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ఇన్ని కష్టాలు మేము గట్టెక్కాము.
జగదీష్ k.
మున్షి
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.
🕉 సాయి ram
ReplyDelete