సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆత్రుతగా ఉంటూ మనం బాబా సామర్థ్యాన్ని అనుమానిస్తున్నాం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

విజయనగరం జిల్లా, పూసపాటి రేగకి చెందిన పతివాడ దినేష్ గారు తమ ఆనందాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ సాయిరామ్.

నా పేరు దినేష్. కరుణామూర్తి, మన తండ్రి సాయిబాబా నాపై ప్రేమతో చూపిన ఒక చిన్న అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

నేను పంజాబ్ లో అగ్రికల్చరల్ B.Sc చదువుతున్నాను. మంచి మార్కులతో నా డిగ్రీ పూర్తి చేస్తానని నేను ఎంతగానో ఆశించాను. అయితే ఒక వారం క్రిందట నా చివరి సంవత్సరం పరీక్షలు వ్రాసాను. ఒక సబ్జెక్టు విషయంలో నేను ఆందోళన పడ్డాను. ఆ సబ్జెక్టు నేను సరిగా వ్రాయలేకపోయాను కూడా. దానితో ఆ సబ్జెక్టు మళ్ళీ వ్రాయాల్సి వస్తుందని, కెరియర్ పైన కూడా ఆ ప్రభావం పడుతుందని నేను చాలా ఒత్తిడికి లోనై, తర్వాత పరీక్షల పైన కూడా సరిగా దృష్టి పెట్టలేకపోయాను. "బాబా! నా యందు దయవుంచి నన్ను పాస్ చేసి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నా డిగ్రీ పూర్తి అయ్యేలా అనుగ్రహించండి" అని నిరంతరం బాబాకు ప్రార్థన చేశాను. నేను ప్రతిక్షణం ఫెయిల్ అవుతాననే అనుమానంతో దిగులుగా ఉండేవాడిని. కనపడిన ప్రతి ఒక్కరికీ, 'నేను పాస్ కాను, ఫెయిల్ అవుతాన'నే చెప్పాను. నేను నా రిజల్ట్స్ పై ఉన్న ఆందోళన, అత్రుతలతో క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాను. ఈ సమయంలో నేను బాబాకు హృదయపూర్వకంగా ప్రార్ధన కూడా చేయలేకపోయాను.

మొన్న (జూన్ 2, 2018) పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆశ్చర్యం! నేను ఆ పరీక్షలో ఎప్పుడూ ఊహించని విధంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాను. అంతటికీ సాయిబాబాయే కారణం. ఆయనే దయతో నన్ను మంచి మార్కులతో పాస్ చేయించారు. ఆయన అనుగ్రహం లేకుంటే నేను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేవాడిని. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, ఫలితం కోసం ఎదురుచూస్తూ ఆత్రుత పడకుండా, సహనంతో ఉండండి. బాబా ఎన్నడూ మన ప్రార్థనలకు స్పందించకుండా ఉండరు. 

నేను మీపై పూర్తి విశ్వాసం చూపకుండా చాలా ఆత్రుతగా ఉన్నందుకు నన్ను క్షమించండి బాబా! ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకుంటాను బాబా! ఎల్లవేళలా మీ భక్తులపై మీ చల్లని దీవెనలు కురిపిస్తూ ఉండండి బాబా!

నాకోసం ప్రార్ధన చేసిన సాయి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

ఓం శ్రీ సాయి రక్షక్ శరణం

నిన్న (జూన్ 3, 2018) జరిగిన మరో అద్భుతం:

4 సంవత్సరాల నుండి నా దగ్గర బాబా ఊదీ లేకపోవడంతో చాలా బాధపడ్డాను. షిర్డీ సంస్థాన్ నుండి ఊదీ తెప్పించుకోవడానికి ఆర్డర్ కూడా పెట్టాను, అయినా రాలేదు. ఇంకో రెండు రోజులలో ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒకతను తన బ్యాగ్ ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ఆ బ్యాగ్ నన్ను తీసుకుని వెళ్ళమని చెప్పాడు.
నేను ఆ బ్యాగ్ లోని వస్తువులు తీస్తూ ఉండగా అందులో చిన్న డబ్బాలు దొరికాయి. ఆశ్చర్యం! చూస్తే అందులో నేను ఎంతగానో తపించిపోతున్న బాబా ఊదీ ఉంది. ప్రక్కన ఉన్న ఫోటో ఆ ఊదీ ఉన్న డబ్బాకి సంబందించినది. చూసారా! నేను ఎదురు చూస్తున్న ఊదీతోపాటు తమ ఆశీస్సులు నాకు ఇస్తూ ఎలా ప్రత్యక్షమయ్యరో బాబా? ఇక నా ఆనందం మాటల్లో చెప్పలేను. నేను ఇంటికి వెళ్తుంటే బాబా నాకు తోడుగా వస్తున్నట్లుంది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo