ఇండియా నుండి పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇలా చెప్తున్నారు.
వెబ్ సైట్ లో భక్తుల అనుభవాలను చదువుతూ సాయి ఉనికిని నిరంతరం స్మరించుకుంటున్నాం. బాబా లీలలు అపారమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆ ఆనందాన్ని మాటలు ఏవీ వ్యక్తపరచలేవు.
ఓం సాయిరామ్!
ఒకరోజు నేను నా డెబిట్ కార్డు కోసం సాధారణంగా నేను పెట్టే చోట చూసాను, కానీ అది అక్కడ కనిపించలేదు. నేను నా హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా పెట్టలేదు, అయినప్పటికీ అందులో కూడా వెతికాను, అక్కడ కూడా కన్పించలేదు. నా తల్లిదండ్రులు మరియు నేను దాని కోసం ఇల్లంతా వెతికాము. కానీ ఎక్కడా కనుగొనలేకపోయాము. నేను నా యోగా క్లాసుకి టైం అవుతుండటంతో, "కార్డు దొరికేలా చూడండి బాబా!" అని బాబాకు ప్రార్థన చేసి, నిదానంగా వెతకమని మా అమ్మకి చెప్పి వెళ్ళిపోయాను. క్లాసుకు వెళ్తూ, చాలా ఆందోళనగా అనిపించి, కార్డు దొరకాలని బాబాని ప్రార్ధించాను. నేను అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నందువల్ల, నా ఫోన్లో సిగ్నల్ లేక, మా అమ్మకి కాల్ చేయలేకపోయాను. రైలు దిగిన వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. ఆమె, "ఎప్పుడూ పెట్టే స్థలంలోనే కార్డు దొరికింది" అని చెప్పారు. ఆశ్చర్యం! అంతకుముందు మేము ఆ చోట వెతికాం, కాని అప్పుడు మాలో ఎవరికీ కార్డు అక్కడ కనిపించనే లేదు. "ధన్యవాదాలు బాబా! ఈ విషయంలో మీరే మాకు సహాయం చేసారు. మళ్ళీ మీరు మీ ఉనికిని చాటుకున్నారు."

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"
ReplyDelete