సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

" ప్రార్ధనని -- ప్రేమతో మన్నించిన సాయి మహారాజ్"


సాయి బంధువు శోభన ప్రతాప్ గారు తనకి రీసెంట్ గా బాబా ఇచ్చిన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. నాకు "మహాపారాయణ", "మహాజప" గ్రూపుల్లో స్థానం ఇచ్చినందుకు బాబాకి నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరిఫై ఉండాలి. ఇప్పుడు నా తండ్రి సాయి నాకు ఇచ్చిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

2011 నుండి నేను బాబా తన దగ్గరకి లాక్కున్న పిచ్చుకల్లో ఒకదాన్ని. అప్పటినుండి ప్రతి గురువారం బాబాకి పూజ చేయడం ప్రారంభించాను. అలా నా అలవాటు ప్రకారం 2018 ఫిబ్రవరి 15న ఉదయాన్నే పూజకి ఏర్పాట్లు చేసుకున్నాను. మల్లెపువ్వులు, గులాబి పువ్వులతో బాబాని అలంకరించి నెయ్యి దీపం బాబా ముందు వెలిగించాను.

మహాపారాయణ గ్రూపులో ఆరోజు నాకు 45, 46 ఆద్యాయాలు కేటాయించారు. నేను ఎప్పుడూ అష్టోత్తరం చదువుతూ బాబాకి పువ్వులు సమర్పిస్తాను. ఆతర్వాత మహాపారాయణలోని నేను చదవవలిసిన అధ్యాయాలు చదడవడం ప్రారంభిస్తాను. పూజ మొదలు పెట్టినప్పటి నుండి నా మదిలో ఒక ఆలోచన మెదులుతూ ఉంది. అదేమిటంటే బాబా ఫోటో నుండి పువ్వు దాని అంతట అదే కింద పడాలని. అది నేను ఒక టీవీ ఛానల్లో బాబా అద్భుతాల గురించి ఒక స్త్రీ చెప్తుంటే విన్నాను. అందువలన అదే ఆశిస్తూ, “బాబా నీ ఫోటో నుండి పువ్వు కింద పడేలా చేయి. అది నీ ఆశీర్వాదంగా బావిస్తాను” అని బాబాని ప్రార్ధించాను. తరువాత అన్ని బాబా ఫోటోలకు పెట్టిన పువ్వులన్నింటిని తీక్షణంగా గమనించాను. పువ్వులన్నీ కింద పడకుండా ఉండేలా అమర్చబడి ఉన్నాయి. తరువాత కొద్ది క్షణాలలో 45వ ఆద్యాయం చదవడం మొదలుపెట్టాను. ఆ అధ్యాయం నవనాధుల యొక్క భక్తి మార్గం గురించి వివరిస్తుంది. ఇంకా అధ్యాయం చివరిలో బాబా “ఈ లోకంలో అనేకమంది యోగులు ఉన్నారు. కాని మన తండ్రే మనకు అసలైన తండ్రి. ఇతరులు మనకి అనేక మంచి విషయాలు చెప్పావచ్చును కాని, మనము మన గురువు యొక్క వచనాలను(పలుకులను) మరువరాదు. నువ్వు హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించి వారికి సర్వస్యశరాణాగతి చేయుము. వారి పాదాలకు వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి వేడుకునుము” అని చెప్పారు.

ఇది చదివిన వెంటనే బాబా వైపు చూసి ”నేను ఇప్పటికే జీవితంలో చాలా క్రుంగిపోయి ఉన్నాను. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులలో ఉన్నాను. ఇవన్నీ మీకు కూడా తెలుసు బాబా. మీరు నా ప్రార్ధనలు అన్ని వింటున్నారు అని తెలిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ బాబా నాకు ఆ సంతోషాన్ని ఇవ్వండి” అని ప్రార్ధించాను. నిజానికి నేను బాబా యొక్క ఉనికిని అయన ఫోటో నుండి పువ్వు పడటం ద్వారా గుర్తించాలని ఆశిస్తున్నాను. అలా బాబాతో చెప్పుకున్న తరువాత తల తిప్పి మరల చదవడం ప్రారంభించిన ఒక సెకండ్ లోపు ఎరుపు రంగు గులాబి పువ్వు బాబా ఫోటో నుండి కింద పడింది. నేను ఆశ్చర్యపోయాను. బాబా చూపిన లీలకు నా కళ్ళ నిండ ఆనందబాష్పాలు నిండిపోయాయి. బాబా నా జీవితంలో ఇంత మంచి అనుభవం నాకు ఎప్పుడు ఎదురు అవ్వలేదు అని ఆయనకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా ఆనందానికి అవధులు లేవు. బాబా నా ప్రార్ధనలు వింటున్నానని, నన్ను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నానని ఋజువు చేసారు. దీనితో నాలో బాబా పట్ల చాలా విశ్వాసం పెరిగింది. ఇక నా జీవితంపై నాకు ఎలాంటి దిగులు లేదు. ఆయన నాకు ఏది మంచిది అయితే అదే ఇస్తారు. లవ్ యూ బాబా.

ఓం సాయిరాం !!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo