సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రానున్న కష్టాన్ని కలలో ముందుగానే సూచించారు బాబా


సాయి బంధువు నిరుపమ గారికి బాబా మరో చక్కటి అనుభవాన్ని ప్రసాదించారు. ఈ లీలలో భక్తురాలికి మూడు రోజుల తరవాత రానున్న సమస్యను సూచించారు అంటే బాబా తన భక్తులపట్ల ఎంత శ్రద్ధ వహిస్తూ ఉంటారో మనకు అర్ధం అవుతుంది. ఇక నిరుపమ గారి మాటలలోనే ఆమె అనుభవాన్ని చదవండి.

సాయిబంధువులందరికీ సాయిరామ్.

నా పేరు నిరుపమ. మీకు గుర్తుండే ఉంటాను. నాకు బాబా ఇంకో అద్భుతమైన అనుభవం ఇచ్చారు. రెండు రోజుల క్రితం, అంటే బుధవారంనాడు ఈ బ్లాగ్ ద్వారా శనివారంనాడు అంటే 2018, 16వ తేదీ ఉదయాన నాకు వచ్చిన కల గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు దాని తరువాత అదే రోజు లేదా ఆదివారం నాడు వచ్చిన మరో కల గురించి చెప్తాను. అందులో బాబా నాకు రానున్న సమస్య గురించి సూచించారు. అంతేకాక, ఆ సమస్య నుండి ఎలా బయటపడేశారో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను.

నేను ఉద్యోగస్తురాలిని కనుక వీక్ డేస్ లో, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు నాకు రెస్ట్ ఉండదు. అందుకని నేను శని, ఆది వారాలలో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాను. ఒక్కోసారి తెలీకుండా రోజంతా పడుకుంటాను. అలా పడుకున్నప్పుడు, మధ్యాహ్నమో లేదా ఏ టైంలోనో సరిగా గుర్తులేదు, ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు 5 లక్షల రూపాయలు ఎలాగో చేరింది. నేను దానిని నా ఇంటి లోన్ తీర్చడం కోసం వాడుకున్నాను. నిద్ర నుండి లేచాక కల గుర్తుకు తెచ్చుకున్నాను. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. "అసలు నాకు 5 లక్షల రూపాయలు ఎవరిస్తారు? ఎందుకిస్తారు?" అనుకున్నాను. పైగా ఆ మొత్తాన్ని ఇంటి లోన్ తీర్చడానికి వాడుకోవడమేమిటో నాకు అర్థం కాలేదు. నాకు అసలు లోన్ తీర్చాలన్న ఆలోచనే లేదు. ఇలా అనుకుని కల గురించి మర్చిపోయాను. సోమవారం నుండి యధావిధిగా బిజీ లైఫ్ లో పడిపోయాను.

మొన్న బుధవారంనాడు అంటే 2018, 20న ఉదయాన నేను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను. మేము చెయ్యని తప్పు వల్ల ఒక సమస్య వచ్చి‌ పడింది. చాలా డబ్బు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఉన్నపళంగా అంత డబ్బు ఎవరైనా ఎక్కడి నుండి సర్దుబాటు చేయగలరు? అందువలన చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యాను. ఆ సమయంలో మా ఫ్రెండ్ తో మాములుగా చాట్ చేస్తూ మాటలలో మాకొచ్చిన సమస్య గురించి చెప్పాను. తాను ఈవెనింగ్ నాకు కాల్ చేసి, 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది. అది కూడా ఇంటరెస్ట్ ఏమీ లేకుండా. బాబా ముందర చాలాసేపు ఏడ్చి, కృతజ్ఞతలు  చెప్పుకున్నాను. నాకు 5 లక్షలు చేరుతాయని బాబా ముందే సూచించారు, కానీ నాకు అర్థం కాలేదు. ఆ రోజంతా నాకు అసలు ఆ కల గుర్తుకు రాలేదు. గురువారం ఉదయం హఠాత్తుగా నాకు ఆ కల గుర్తొచ్చింది. అప్పుడు నాకు అంతా అర్థం అయ్యింది. 

బాబా ఎంతటి కరుణామయుడు! ఆపద్బాంధవుడు! నాకు ఒక కలలో ఆపదలో ఆదుకుంటానని అభయాన్ని ఇచ్చారు. ఎలా ఆదుకుంటారన్నది మరో కలలో చెప్పారు. బాబా లీలలు మనకు అర్థం కావు. బాబా నా చెయ్యి ఎప్పుడూ వదలలేదు. అసలు నేను బాబాకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియటంలేదు. సదా ఆయనని గుర్తుపెట్టుకుని, ఆయన చెప్పినవి పాటిస్తూ, చేతనైనంత మంచి చేస్తుండడం తప్ప నేను ఏమీ  చెయ్యలేను. సదా బాబాకు ఋణపడి ఉంటాను.

1 comment:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo