ప్రస్తుతం USAలో ఉంటున్న హైదరాబాదు నివాసి చైతన్య klrsp గారి అనుభవం:-
2014వ సంవత్సరంలో నా
జీవితంలో శ్రీ సాయిబాబా మరియు శ్రీ సాయి మాస్టర్ (ఎక్కిరాల భరద్వాజ)గార్లు చాలా ముఖ్య
భూమికను పోషించారు. వారు నన్ను మరణ శయ్య నుండి కాపాడి, తమను నమ్ముకొని
ఉన్న భక్తులపై వారికీ గల ప్రేమ వలన భక్తులని ఎప్పుడు ఒంటరిగా విదిచిపెట్టారని నిరూపించారు.
శ్రీ దత్తుని
అవతార పరంపరలో ఐదవ అవతారంగా సాయిబాబా షిర్డీలో భౌతిక దేహంతో వెలసారు. సుమారు 64 సంవత్సరములు నాటి షిర్డీ
ప్రజలతో కలిసి ఉంటూ గురు తత్వాన్ని, భక్తీ తత్వాన్ని బోదించారు. సమాధి చెందిన
తర్వాత కూడా తన ఉనికిని చాటుతూ వేలకొద్ది జనాన్ని ఆపదలందు ఆదుకుంటూ సన్మార్గంలో
నడిపిస్తున్నారు.
పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు 1963వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదిన షిర్డీ సమాధి మందిరంలో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన దివ్య అనుభూతిని పొంది బాబాకి అంకిత భక్తులైనారు. వచ్చిన IAS అప్పాయింట్మెంట్ వదులుకొని సాయి సేవకు అంకితమైనారు. సాయి సంత్సంగాలు చేస్తూ, బాబాపై, ఇతర మహాత్ములపై ఏన్నో పుస్తకాలు రచించారు. దేశమంతా తిరిగి నాటి మహాత్ముల ఆశీస్సులు పొందారు.
పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు 1963వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదిన షిర్డీ సమాధి మందిరంలో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన దివ్య అనుభూతిని పొంది బాబాకి అంకిత భక్తులైనారు. వచ్చిన IAS అప్పాయింట్మెంట్ వదులుకొని సాయి సేవకు అంకితమైనారు. సాయి సంత్సంగాలు చేస్తూ, బాబాపై, ఇతర మహాత్ములపై ఏన్నో పుస్తకాలు రచించారు. దేశమంతా తిరిగి నాటి మహాత్ముల ఆశీస్సులు పొందారు.
2013, డిసెంబర్14న సాయి మాస్టర్
నాకు స్వప్న దర్శనం ఇచ్చి “నీ జీవితంలో నీవు
అత్యంత కష్ట కాలం ఎదుర్కోబోతున్నావు. సాయి పాదాలను విడిచిపెట్టకు, సాయి నిన్ను
రక్షిస్తారు” అని చెప్పారు. సాయి మాస్టర్ గారు చెప్పినట్లుగానే జనవరి 2014లో నా ఆరోగ్యం దెబ్బ తిని మార్చ్ నెల
వరకు కేవలం ద్రవ హారం పైన ఉన్నాను. నా తల్లిదండ్రులు
ఫిబ్రవరి 8వ తేదిన మా కజిన్ పెళ్లికి వెళ్తూ, నన్ను కూకటపల్లిలోనే వేరొక కజిన్ ఇంట్లో నన్ను
ఉంచారు. నేను మరవకుండా
సాయి నామ స్మరణ చేస్తూ ఉన్నాను.
ఫిబ్రవరి 9వ తేది మధ్యాహ్నం
నాకేదో చెడు జరుగుతున్నట్లు అనిపించింది కానీ నేను కదలలేక పోతున్నాను మరియు
సహాయానికి ఎవరిని పిలవలేకపోయాను. ఆసమయంలో ఉన్నట్లుండి ఒక రకమైన కాంతి కనిపించింది తర్వాత ఇద్దరు యమ బాటులు
నన్ను తీసుకు వెళ్ళడానికి వస్తున్నారు. అప్పుడు నాలో నుండి సాయి
మాస్టర్ వచ్చి వారిని ఆగమని సైగ చేసి, వారి దగ్గరగా వెళ్లి, "దూరంగా పొమ్మని" వారికీ చెప్పారు. కానీ వారు మాస్టరు గారి మాటలు పట్టించుకోకుండా నా దగ్గరకు
వస్తున్నారు. అప్పుడు నాలో నుండి చేతిలో సటకా పట్టుకొని సాయిబాబా వచ్చి, వెళ్ళిపొండి
వెళ్ళిపొండి అని అరుస్తూ యమ బాటుల మీదకి పరుగు పెట్టి, ఆ యమబాటులను దూరంగా తోసివేసారు. తర్వాత ‘అల్లా మాలిక్’ అని చెపుతూ సాయి
నా హృదయం లోనికి వెళ్ళిపోయారు. సాయిని వెంబడిస్తూ సాయి మాస్టరు హృదయంలోనికి
వెళ్తూ "దిగులు పడకు, మేము ఎప్పటికి నీ
హృదయంలో ఉంటూ నీకు రక్షణనిస్తాం" అని చెప్పారు. ఆవిధంగా మృత్యు ముఖంలో ఉన్న నన్ను
కాపాడారు. దేవుడిని నమ్ముకున్న వారికీ ఆ దేవుడు రక్షిస్తాడు అని నమ్మకాన్ని
కలిగించారు. నా ఈ స్వంత అనుభవంతో సాయిబాబా మరియు సాయి మాస్టర్ పై నా విశ్వాసం
అనంతమైనది.
ఫిబ్రవరి 9వ తేది మాస్టారి
గారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, నా జీవితంలో కూడా చాలా ముఖ్యమైన రోజుగా మిగిలింది. ఎందుకంటే ఆ రోజే నా జీవితంలో చాల చాల సాయి లీలలు జరిగాయి. నా గ్రాడ్యుయేషన్ usa లో ప్రేవేశ
పరీక్షా, వీసా రోజు కూడా. మా అమ్మ గారు బాబా
ప్రేమ అందరి మీద ఉంటుదని, బాబా లీలలు అందరికి తెలియాలని చెప్పారు. అందుకే
బాబా యొక్క అనంత శక్తి మరియు ప్రేమ అందరికి తెలియాలని ఈ అనుభవాన్న్ని అందరితో
పంచుకుంటున్నాను.
నమ్మిన వారిని బాబా గారు, మాస్టర్ గారు ఎప్పుడు వదిలి పెట్టారు.
🕉 sairam
ReplyDelete