సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి నేను కోరుకున్న జాబ్ నాకు వచ్చేలా చేసారు


సాయి బంధువు ఒకరు అమెరికా నుండి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయి భక్తులు అందరూ తమ అనుభవాలు పంచుకుంటూ ఒకే గొడుగు క్రింద ఉండేలా చేస్తున్నారు ముందుగా మీకు ధన్యవాదాలు. సాయి సదా మీకు అందరికి సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నేను 2012-13 సంవత్సరంలో ఒక IT కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. ఆ కంపెనీ వాళ్ళు నాకు గత 10 నెలలుగా ఇంటి నుండి వర్క్ చేసుకునేలా అవకాశం ఇచ్చారు. కానీ అనుకోకుండా 2013 సెప్టెంబర్ 30న ఆ కంపెనీకి వచ్చే కాంట్రాక్టు రానందుకు నన్ను ఉద్యోగం నుండి తిసివేసినట్టు చెప్పారు. నేను చాలా షాక్ అయ్యి బాగా క్రుంగిపోయాను. ఎందుకంటే అది టెలికమ్యునికేషన్ కి సంబందించిన జాబ్ అయినందున నాపై ఒత్తిడి ఉండేది కాదు, పైగా చాలా మంచి టీం. నాకు చాలా సౌకర్యవంతంగా ఉండేది. ఇంక చేసేది లేక మరో జాబు వెతకడం మొదలు పెట్టాను.

త్వరలోనే ఒక జాబు దొరికింది, ఆ కంపెనీ మా ఇంటి నుండి 15కిలోమీటర్ల దూరంలో ఉంది. 2013 నవంబర్ లో కొత్త ఉద్యోగంలో చేరాను. కంపెనీ ఇంటికి దగ్గరలోనే ఉన్నా నాకు వెళ్ళడానికి గంట సమయం పట్టేది. నా భర్త ఉద్యోగం వేరే సిటీలో ఉండటం వలన ఆయన సోమవారం నుండి శుక్రవారం వరకు రోజు ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి నేను ఒక్కదాన్నే నా పనులు చూసుకుంటూ, మా పాపని చూసుకోవాలి. తనని' డే కేర్' లో వదలడం, మళ్ళీ తీసుకోని రావడం, ఇంకా 8 గంటలు ఆఫీస్ వర్క్ అన్నిచూసుకునే సరికి చాలా ఒత్తిడికి లోనయ్యేదాన్ని. ఇంకా ఆ కంపెనీ వాతావరణం కూడా నాకు నచ్చేది కాదు. అలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో నేను ఇదే మొదటిసారి పని చేయడం. ఇంక అక్కడ పని చేయడం ఇష్టం లేక వేరే జాబ్స్ కి ప్రయత్నం చేశాను.

లక్కీగా ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు కొద్దిరోజులు అయినా తర్వాత వారంలో 1 లేక 2 రోజులు టెలి కమ్యునికేషన్ వర్క్ చెయ్యడానికి ఇస్తాం అన్నారు. కొత్త కంపెనీ ఇంటి నుండి 36కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేను ప్రతిరోజు ఉదయం 6.30 లోపల ఇంటి నుండి బయల్దేరేదాన్ని. కొద్దిరోజులు గడిచాక నా కొత్త ఉద్యోగంలో క్లయింట్ బోర్డు వాళ్ళు రిమోట్(ఒకటి లేక రెండు రోజులు ఇంటి నుండి పని చేసే) పని విదానం రద్దు చేసారు. మళ్ళీ చీకటిలోకి నెట్టినట్లు అయ్యింది నా పరిస్థితి. రోజుకి 4 గంటలు పైన ఉద్యోగం కోసం రోడ్ ఫై తిరిగే పరిస్థితితో నా శరీరం బాగా అలసిపోయేది. ఒకరోజు నా దుఃఖాన్ని ఆపుకోలేక సాయి దగ్గర చాలా సేపు ఏడ్చి Question & Answer సైట్ లో బాబాని “ఎందుకు నాకు ఇలా జరుగుతుంది. నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి. ఇంకా కనీసం 1 లేదా 2 రోజులు టెలి కమ్యునికేషన్ వర్క్ చేయడానికి అనుమతించే ఉద్యోగం పొందడానికి నేను ఏమి చేయాలి?” అని అడిగాను. వెంటనే సాయిబాబా నాకు ఇలా జవాబు ఇలా ఇచ్చారు “మజ్జిగ దానము చేయుము. నీ కోరిక తప్పక తీరుతుంది“ అని. కొద్ది రోజులు ఆలోచించి బాబా చెప్పినట్లు మజ్జిగ దానం చేయడానికి సిద్దం అయ్యాను. ఒక గురువారం రోజున మజ్జిగ తయరు చేసుకొని మా ఆఫీసుకి తీసుకుని వెళ్ళి నాతోటి నలుగురు సహా ఉద్యోగులకు పంచాను. గురువారం నాడు మజ్జిగ ఇవ్వగలిగినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

తరువాత నా అలవాటు ప్రకారం 9.40amకి నా పర్సనల్ ఇమెయిల్ ఓపెన్ చేసాను. ఆ మెయిల్ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయిను. నా పాత కంపెని ప్రాజెక్ట్ మేనేజర్ నుండి వచ్చిన మెయిల్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఆ మెయిల్ ద్వారా వాళ్ళు ఆ కంపెనీలో  టెలి కమ్యునికేషన్ జాబు ఒకటి ఖాళీగా ఉందని, అందులో నన్ను చేరమని అడుగుతున్నారు. బాబా పలుకులు ఎప్పుడూ వృధా కాలేదు, అవి ఎప్పుడూ సత్యమై తీరుతాయి. మజ్జిగ పంచిన వెంటనే నాకు ఇమెయిల్ వచ్చింది. బాబాకి శత కోటి ప్రణామాలు తెలుపుకొని మేనేజర్ కి రిప్లై పంపాను. కాని నన్ను మళ్ళి జాబులో తీసుకుంటారా లేదా అని టెన్షన్ ఫీల్ అవుతూ అంతా బాబా మీరే చూసుకోండి అని బాబాకు చెప్పుకొని మౌనంగా ఉన్నాను. సాయంత్రం 5.45కి ఒక కాల్ వచ్చింది. కాని అప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్నాను. బహుశ నా ఫ్రెండ్ చేసి  ఉంటుంది అనుకోని తరువాత తనకి కాల్ చేయవచ్చు అని కాల్ లిఫ్ట్ చెయ్యలేదు. ఇంటికి వచ్చాక  చూస్తే రిక్రుటర్ కాల్ మరియు వాయిస్ మెయిల్ ఉన్నాయి. నేను వెంటనే ఆవిడకి కాల్ చేస్తే తను ఒక వారం తరువాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసారు. బాబా దయతో అంతా సవ్యంగా జరిగి 4 వారాలలో నాకు జాబులో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వచ్చింది. వెంటనే నేను జాబులో చేరిపోయాను. ఇప్పుడు నేను సంతోషంగా ఇంటి నుండే వర్క్ చేసుకుంటున్నాను.

ఇది అంతా బాబా కృప వల్లే సాధ్యం అయ్యింది. బాబాకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఈ లోకంలో అందరిని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదల వలనే ఈరోజు నేను ఇలా ఉన్నాను. నా ఉద్యోగం నువ్వు ఇచ్చిన భిక్ష. నువ్వు సదా ప్రతిక్షణం నాకు సహాయం చేస్తూనే ఉన్నావు. మీకు నా చాలా చాలా కృతఙ్ఞతలు.

ఓం సాయిరాం!!!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo