షిర్డీ సాయిబాబా వాట్సప్ గ్రూపులోని సాయిబంధువు జగన్ గారి అనుభవం.
2017, సెప్టెంబర్ 17వ తేదీన బాబాగారు చూపిన ఒక లీలను సాయిబంధువులతో పంచుకోవాలనే కోరికతో ఈ అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను.
17వ తేదీన మా చిన్న అమ్మాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. టెంపరేచర్ 103-104 డిగ్రీలు ఉంది. శరీరం ఎర్రగా కమిలిపోయినట్లు అయిపోయింది. మరుసటి రోజు హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాము. డాక్టర్ గారు మందులు ఇచ్చి, జ్వరం తగ్గకపోతే రెండు రోజుల తరువాత రమ్మన్నారు. మూడు రోజులు గడిచినా జ్వరం కాస్తయినా తగ్గలేదు.
20వ తేది అర్థరాత్రి బాబా ఫోటో ముందు కూర్చుని 30 నిమిషాలు సాయినామం చేసి, పాపకు జ్వరం తగ్గించమని బాబాని ప్రార్ధించాను. రాత్రి 12 గంటల 40 నిమషాల సమయంలో నా శరీరమంతా రోమాంచితమై ఆనందభాష్పాలు వచ్చాయి. అది బాబా అనుగ్రహమని తలచి బాబా పటం ముందు నిల్చున్నాను. మళ్ళీ అదే అనుభూతి కలుగసాగింది. మనస్సులో బాబా ఆజ్ఞగా స్ఫురించి బాబా విభూతిని మా అమ్మాయి శరీరానికి పూసి, నుదుటన పెట్టి, నోట్లో కొంచెం వేశాను. చిత్రంగా జ్వరం తగ్గటం ప్రారంభమైంది. కొద్ది క్షణాలలో 104 డిగ్రీల నుండి 100 డిగ్రీలకు వచ్చింది. తరువాత హాస్పిటల్ లో బ్లడ్ టెస్ట్ చేయిస్తే మాములు జ్వరం అని చెప్పారు. మా అమ్మాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. కేవలం బాబా దయవల్ల మాత్రమే జ్వరం తగ్గింది. నిజానికి ఆ లక్షణాలు డెంగ్యూకు సంబంధించినవట. బాబాగారు రక్షణగా నిలిచారు.
జై సాయిబాబా!
🕉 sai ram
ReplyDeleteసాయినాథ మీకు ఇవి మా సాష్టాంగ దండ ప్రణామములు కరుణించి కాపాడు ఆశీర్వదించి షిరిడి సాయినాథ
ReplyDelete