సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అన్నదాన - మహిమ


సాయి బంధువులందరికీ నమస్కారం.


    నా  పేరు సాయి వీణ. నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను.  నాకు జరిగిన ఒక లీలను "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్"లో  పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకి పాదాభివందనాలు. నా బి.టెక్ బోజిరెడ్డి కాలేజీలో కంప్లీట్ అయింది. బాబా దయ వలన MS చేయడానికి అమెరికా వెళ్ళాను. అక్కడ నాకు మంచి జాబ్ చూపించు బాబా అని ప్రార్ధించాను. నేను అడిగిన వెంటనే బాబా నాకు జాబ్ కూడా చూపించారు. దానితో చాలా సంతోషంగానే ఉన్నాను. కానీ, కొన్ని అనారోగ్య కారణాల వలన నాకు జాబ్ పోతుందని తెలిసింది. దేశం కానీ దేశంలో ఉన్నాను. ఏం చేయాలో అర్ధం కాలేదు. నా తల్లితండ్రులు బాబా భక్తులే. మా అమ్మకి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితి అంతా చెప్పాను. మా అమ్మ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదిబాబాకు కూడా అన్నదానం అంటే చాలా ఇష్టం కావున అన్నదానం చేయిస్తాను, నా జాబ్ నాకు ఉండేలా చేయి అని బాబాను ప్రార్ధించుఅని చెప్పింది. మా అమ్మ 9 సంఖ్య అంటే ఎంతో అదృష్టంగా భావిస్తుంది. అందుకే బాబాతో  బాబా 9 నెలలుపాటు అన్నదానం కోసం డబ్బులు పంపుతానుఅని చెప్పుకున్నాను. భక్తులు తమ కోరికలు కోరడమే ఆలస్యం, తక్షణం వాటిని తీర్చడమే బాబా తన కర్తవ్యంగా భావిస్తారు కదా! బాబా నా మాటనా తల్లితండ్రుల మాట విన్నారు. అందుకే బాబా మా కోరికను మన్నించి, ఆశీర్వదించి నా ఉద్యోగం నాకు తిరిగి వచ్చేలాగా చేసారు. ఒకవేళ ఆ ఉద్యోగమే కనుక రాకుంటే నేను ఆ అమెరికాలో ఎన్ని కష్టాలు పడేదాన్నో కనీసం ఊహించుకోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు. బాబా బిక్ష వలన వచ్చిన జాబ్ అది కావున, నేను మనస్ఫూర్తిగా నా జీతం నుండి 108 డాలర్లు ఇండియాకి పంపిస్తున్నాను. 108లో సంఖ్యలు కలిపితే తొమ్మిది అవుతుందిగా (1 +0+8). మా అమ్మ సెంటిమెంట్ తో ప్రతి నెల 108 డాలర్లు పంపుతూ ఉన్నాను. బాబా భిక్ష వల్లే నాకు ఉద్యోగం దొరికింది. నా చేత అన్నదాన కార్యక్రమం ప్రతి నెల నిర్వహించేలా చేస్తున్నందుకు బాబాకు  ఋణగ్రస్తురాలిని. బాబా మీ ఆశీర్వాదం, ప్రేమ ఎల్లప్పుడూ నా మీద, అందరి మీద ఉండేలాగా చూడు తండ్రి.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo