“ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ, నన్నే వారి రక్షకుడిగా భావిస్తారో, వారికి నేను ఋణపడి ఉంటాను. వారిని రక్షించడానికి నా శిరస్సునైనా ఇస్తాను. నా సలహాగాని సహాయాన్నిగానికోరిన ఒసంగ సంసిద్ధుడను”. ఇవి సాయిమహరాజ్ నోటి నుండి జాలువారిన ఆణిముత్యాలు... అక్షరసత్యాలు... సజీవసూత్రాలు.... తన భక్తులను సదా రక్షించడానికి సాయి ఎప్పుడూ సంసిద్ధుడై ఉంటాడనటానికి ఈ లీల నిదర్శనం.
నాపేరు సునీత. మా వారి పేరు మధుసూదన్. మేము విజయవాడ వాస్తవ్యులం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను పూజించినది సాయిబాబానే. ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయనపై నాకు ప్రగాఢమైన నమ్మకం. నా జీవితాన్ని నిలబెట్టిన ఒక సంఘటనను నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఆ మధురానుభూతిని "సాయిమహరాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను చదువుకుంటూ ఉండగా, అనుకోకుండా నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. చదువు ఇంకా పూర్తి కాలేదు, కానీ మన కోసం వెతుక్కుంటూ వచ్చిన మంచి సంబంధాన్ని కాదనకూడదని మా నాన్నగారు పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేసారు. అప్పుడు నా వయస్సు 19 సంవత్సరములే. నాకు ఒక చెల్లెలు కూడా ఉంది. తన కోసం, నా కుటుంబసభ్యుల కోసం తలవంచవలసిన పరిస్థితి. అందువలన నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు కదా! అలానే అన్నీ తొందర తొందరగా జరిగిపోతున్నాయి. లగ్నపత్రిక వ్రాయించి, ఒక నెల లోపల ముహూర్తం నిశ్చయించేసారు. పత్రికలు ప్రింటు అయిపోయినాయి. మా బంధువులందరికీ శుభలేఖలు పంచడం కూడా జరిగింది. అంత తొందరగా ఈ పనులన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మావారి తాతగారి పరిస్థితి కొంచెం విషమంగా ఉండి హాస్పిటల్ లో మంచంమీద ఉన్నారు. మనవడి పెళ్లి చూడాలన్న తాతగారి కోరిక నెరవేర్చి, ఆయన ఆశీస్సులు పొందాలని వాళ్ళ కోరిక.
నాకు నెలకి రెండుసార్లు సాయి సచ్చరిత్ర మరియు గురుచరిత్ర పారాయణ చేయడం అలవాటు. నా పెళ్లి కుదిరిన తర్వాత సాయి వేయి నామాలు పుస్తకం వ్రాయడం కూడా నియమం పెట్టుకున్నాను. అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో, అంటే మా వివాహానికి 20
రోజుల ముందు మావారి తాతగారు మరణించారు. మా అందరికీ షాకింగ్ న్యూస్. మా కుటుంబ సభ్యులందరం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాం. మా ఇంట్లో మొదటి పెళ్లి ఇది. ఎంతో ఘనంగా చేయాలనుకోని అన్నీ సిద్ధం చేసుకున్నాక, అందరికీ శుభలేఖలు పంచుకున్నాక ఇలా జరిగిందేమిటని, ఇప్పుడు అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోతే నా పరిస్థితి ఏమిటి అని మా నాన్నగారు ఆలోచిస్తూ చాలా డీలా పడిపోయారు. ఇంట్లో అందరి పరిస్థితీ ఇదే. నాకైతే ఆ వయస్సులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తీరని దుఃఖం, ఏమి చేయాలో తెలియని పరిస్థితి. భారం అంతా బాబా మీద వేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలిని. 'బాబానే నాకు అన్నీ' అని నమ్మిన దాన్ని. సదా ఆయన పారాయణ, స్మరణతో ఉన్న నాకు ఇలాంటి కష్టం వచ్చిందేంటి? "బాబా, నాకు అండగా ఉంటూ సహాయం చేయమ"ని వేడుకున్నాను బాబాని. ఇంతకన్నా ఏం చేయగలను?
మా పెళ్ళైన తర్వాత మొదటిసారి మా ఇంట్లో అడుగుపెట్టాము. మా ఇద్దరినీ పూజామందిరంలోకి తీసుకెళ్లి దీపారాధన చేయమన్నారు. అక్కడ ఉన్న సాయిబాబా ఫోటోని చూసి, 'ఈయన ఎవరు?' అని మావారు అడిగారు. నేను, ఆయన 'షిరిడీ సాయిబాబా' అని, మా కులదైవం అని, మా ఇంటి ఇలవేల్పు అని చెప్పాను. మావారు అది వినగానే ఒక్కసారిగా వణికిపోతూ కుర్చీలో కూలబడ్డారు. మాకు అందరికీ చాలా కంగారుగా అనిపించింది. కొంతసమయం వరకు తనకు ఏమి జరుగుతుందో మాకు అర్ధం కాలేదు. అతను కొంత తేరుకున్నాక ఏమి జరిగిందని అడిగితే, తనకు వచ్చిన కల గురించి చెప్పారు. “ఆ కలలో కనపడిన ముసలాయన ఈ బాబానే, కానీ ఈయన గురించి నాకప్పటికి తెలియకపోవడం వల్ల మా తాతగారని అనుకొని పొరబడ్డాను. నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది, నా తలని ప్రేమగా నిమురుతూ, ‘నా బిడ్డకి అన్యాయం చేయకు. తను నీ అదృష్టం’ అని చెప్పింది ఈయనే. అప్పటివరకూ ఏమి చేయాలో తెలియక గందరగోళంగా ఉంది నా పరిస్థితి. ఈయన తల నిమిరిన తరువాత నాకు కలిగిన ప్రశాంతంత చెప్పలేనిది” అని తన అనుభూతిని చెప్పారు. ఇదంతా విన్నాక నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఆయన నాపై చూపిన ఈ ప్రేమకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పటినుండి మావారు బాబాని 'తాతయ్యా' అని పిలుచుకుంటూ, నాకన్నా ఎక్కువగా బాబాకు పూజలు చేసుకుంటున్నారు. “పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను నా వద్దకు లాగుతాను" అని బాబా చెప్పినట్లుగా మా వారిని తన పాదాల చెంతకు లాక్కున్నారు.
నా కన్నీళ్ళని ఆపడానికి బాబా నా భర్తకు స్వప్న దర్శనం ఇచ్చి కథ అంతా నడిపించారు. అర్ధాంతరంగా ఆగిపోతుందనుకున్న పెళ్లి జరిపించి, నవ్వులపాలు కాకుండా నా జీవితాన్ని నిలబెట్టారు. అలా తన బాధ్యతను నెరవేర్చారు బాబా. అలా బాబా ఆశీస్సులతో మొదలైన నా వైవాహిక జీవితం సంతోషదాయకంగా సాగుతూ వస్తుంది
🕉 sai ram sri sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me