సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఊదీతో నా భార్య కష్టం దాటింది




నా పేరు పద్మరామస్వామి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ K.గోపాలకృష్ణగారిని బాబా ఎలా తన భక్తునిగా మార్చుకున్నారో ఆయన మాటలలో విందాము. 

2015 జూన్ 10న నేను మాములుగా ఆఫీసుకు వెళ్లాను. నా భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో హఠాత్తుగా తలనొప్పి, రెండు భుజాలలో భరించలేని నొప్పి వచ్చి మంచం మీద కూడా కూర్చోలేకపోయింది. కాసేపటికి ఆ నొప్పి కాళ్ళకు కూడా వచ్చేసింది. మా ఇంటికి దగ్గరలో ఉన్న తన స్నేహితురాలికి ఫోన్ చేసి రమ్మని పిలిచింది. వెంటనే ఆవిడ వచ్చి చూసేసరికి నా భార్య డ్రాయింగ్ రూమ్ లోనే చెమటలతో తడిసిపోయి క్రిందపడివుంది. కాని స్పృహ కోల్పోలేదు. తనకు వచ్చిన బాధ గురించి ఆవిడకు చెప్పి, డాక్టరైన నా తమ్ముని భార్య డ్యూటీ నుండి వచ్చుంటే ఆమెను వెంటనే రమ్మని చెప్పండి అని చెప్పింది. ఆమె డ్యూటీ నుండి వచ్చి, ఫస్ట్ BP చెక్ చేసింది. BP 170/130 మరియు నాడి (pulse rate) 108 గా వుంది. ఇంతలో నా భార్యకు వాంతులు కూడా మొదలయ్యాయి. ఆ డాక్టర్ first aid tablets ఇచ్చి హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకుంది. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఇంకా ఆఫీసులోనే ఉన్నాను. నేను, నా కొడుకు ఆఫీసు నుంచి సుమారు 7.00 గంటలకు తాపీగా ఇంటికి చేరాము. జరిగినదంతా విని మేము ఆశ్చర్యపోయాము. ముందురోజు కూడా BP 130/80 వుంది. వెంటనే మేము నా భార్యను హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. ECG నార్మల్ గా వచ్చినా, హార్ట్ ఎటాక్ కాకపోయినా డాక్టర్ నా భార్యను ICUలో ఉంచారు. రాత్రి 10.00 గంటలకు డాక్టర్ CT స్కాన్ చేసారు. అప్పుడు తెలిసింది, ఆవిడకు బ్రెయిన్ హేమరేజ్  అని. అప్పుడు డాక్టర్ చెప్పినట్లు వేరే హాస్పిటల్ కు వెళ్ళాము. అక్కడ cerebral angiography చేసారు. జూన్ 11న ఒక సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చెయ్యాలి, చాలా ఖర్చు అవుతుందని డాక్టర్ అన్నారు. అయినా మా దగ్గర మెడికల్ పాలసీలు ఉన్నందువలన సర్జరీ చేయించగలిగాము. మరుసటి రోజు అంటే జూన్ 12న మొదటిసారి సాయిబాబా మా జీవితంలోకి వచ్చారు. 

గత 35సంవత్సరాల నుండి నేను హనుమంతుడి భక్తుడిని. ఆరోజు హనుమంతుడిని దర్శించుకొని హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఎందుకో కొన్ని అడుగుల దూరంలో సాయిబాబా నాతో వస్తున్నారని నాకు అనిపించింది. సాయిబాబా నాతో, “నీ భార్య ఆరోగ్యం బాగుంది, నా సంరక్షణలోనే ఉంది. త్వరలోనే ఇంటికి వస్తుంది. భయపడకు” అన్నట్లు అనిపించింది. అప్పుడు నాకళ్లలో నీళ్ళు, మనసులో భక్తి భావం, ధైర్యం అన్నీ కలిసి సంతోషంగా హాస్పిటల్ కి వెళ్లాను. అక్కడ మొదటిసారి పెద్ద సాయిబాబా ఫోటో చూశాను. ఆయన ఆశీర్వాదం ఇస్తున్న చేయి చూడగానే అనిపించింది, బాబా నా జీవితంలోకి వచ్చేశారు అని. ఇదంతా నేను నా భార్య స్నేహితురాలికి తెలియజేసాను. అప్పుడు ఆమె, "మీ భార్యకు మొదటిరోజే అంటే జూన్ 10న నేను ఊదీ పెట్టాను" అని చెప్పింది. అది విని, "జూన్ 10నే బాబా మా ఇంటికి వచ్చారన్నమాట" అనుకున్నాను. ఆవిడ ఒక ఊదీ ప్యాకెట్, సాయి సచ్చరిత్ర బుక్ నాకు యిచ్చి, రోజూ పారాయణ చెయ్యమని చెప్పింది. నా భార్యకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రెండు, మూడుసార్లు క్రిటికల్ అయినప్పటికీ ఊదీతో ఆమె ఆ కష్టాన్ని దాటింది. అప్పటినుంచి నేను బాబా భక్తుడిని అయ్యాను. బాబా టెంపుల్ కు వెళ్ళడం, భజనలు, పాటలు పాడటం మొదలుపెట్టాను. నా భార్యను డిశ్చార్జ్ చేసాక ఇంటికి వచ్చాము. మలయాళం మా మాతృభాష. హఠాత్తుగా ఆమె మలయాళం మాట్లాడడం మానేసి, హిందీ మాట్లాడడం మొదలుపెట్టింది. డాక్టర్ ని సంప్రదిస్తే ఆయన, "బ్రెయిన్ హేమరేజ్ వలన భాష మర్చిపోయింది, కొన్నిరోజుల తరువాత రావచ్చు" అన్నారు. మళ్ళీ 2015 జూలై చివరివారంలో నిదానంగా మలయాళం కూడా ఆమెకు వచ్చేసింది. 3 నెలలు సెలవు పెట్టి నా భార్యకు తోడుగా ఉన్నాను. అప్పటినుండి కంటిన్యూగా పారాయణ, హారతులు చేస్తున్నాం. నా భార్య కూడా బాబా పారాయణ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంట్లో అందరం బాబా భక్తులం అయ్యాం.

నేను ఒక భజన మండలితో షిరిడీ వెళ్లాను. ఆగష్టు 15న సమాధి మందిరంలో ఒక పూజారి నాకు బాబా ఫోటో ఇచ్చారు. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గురుస్థాన్ దగ్గర ఒక పూజారి వేపచెట్టు ఆకులు తెచ్చి ఇచ్చి‌, "బాబా ఫోటో దగ్గర ఇంట్లో పెట్టుకో" అన్నారు. అలా రోజూ బాబా ఆశీస్సులు నాకు అందుతూ ఉన్నాయి. నేను పూర్తిగా బాబాకు శరణాగతి చెందాను. ఆ హనుమంతుడే సాయిబాబా రూపములో వచ్చారని నాకు అనిపిస్తుంది.

తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo