సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా నైవేద్యం - భక్తునికి ప్రసాదం


కొన్ని సంవత్సరాల క్రితం రాజు అనే కుర్రవాడు శ్రీషిరిడీ సాయిబాబా సంస్థాన్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. సమాధి మందిరం ఊడ్చి శుభ్రపరచడం అతని పని. ఒకసారి బాబా దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వలన అతను మధ్యాహ్నం భోజనం చేయడం కూడా మర్చిపోయి రోజంతా పని చేస్తూనే ఉన్నాడు. అతను తీరిక లేకుండా పనిచేస్తూ బాగా అలిసిపోయి ఉన్నందువల్లఇంకాసేపట్లో షిఫ్ట్ ముగుస్తున్నదనగాకాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకొని సమాధి మందిరం మొదటి అంతస్తు పైకి వెళ్లి కాసేపు నడుం వాల్చాడు. శరీరం బాగా అలసి ఉండటంతో అతనికి తెలియకుండానే కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకున్నాడు. అతడు అలా గాఢనిద్రలో ఉండగానేశేజ్ ఆరతి పూర్తి కావడంతో సమాధి మందిరానికి తాళాలు వేసి అందరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి ఒక్కసారిగా అతనికి మెలకువ వచ్చిచుట్టూ చూసేసరికి జరిగింది ఏమిటో అర్థం అయింది. ఆ సమయంలో అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంది. బాల్కనీలో నుండి క్రిందకు చూసేసరికి బాబా సమాధికి దోమతెర కప్పబడి ఉంది. క్రిందకు వచ్చిబాబా ముందు నిల్చొనిబాబాకు జరిగిన విషయమంతా విన్నవించితనను క్షమించమని కన్నీళ్లతో ఆర్తిగా ప్రార్థించాడు.
          
ఒక్కసారిగా దోమతెర లోపల కదలిక వచ్చింది. అతడు అలాగే నిలబడి తదేకంగా అలా చూస్తూ ఉండగా బాబా నెమ్మదిగా దోమతెర తొలగించుకుంటూ బయటకు వచ్చారు. బాబాను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. బాబా మృదువైన స్వరంతో, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా! పైకి రా! అక్కడ చూడుపళ్ళెంలో శీరా పూరీలు నాకోసం పెట్టి ఉన్నాయి. వెళ్లి కూర్చొని నిదానంగా తిను. నీకు ఏమీ కాదని నేను మాట ఇస్తున్నాను అని అతనితో చెప్పిఅదృశ్యులయ్యారు. రాజు సంతృప్తిగా భోజనం చేసిక్రిందకు వచ్చిఆనందపారవశ్యంతో బాబా సమాధి ప్రక్కనే కూర్చుండిపోయాడు.
           
మరునాడు ఉదయం కాకడ ఆరతి ఇవ్వడం కోసం సమాధి మందిరం తలుపులు తెరిచేసరికి, అక్కడ ఉన్న రాజుని చూసి రాత్రంతా సమాధి మందిరం లోపల ఉన్నందుకు మందిర అధికారులు అతనిని తీవ్రంగా తప్పుబట్టి మందలించారు. నిబంధనలు ఉల్లంఘించి రాత్రంతా సమాధి మందిరంలో ఉన్నందుకు అతని మీద చర్య తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు కూడా చేసారు. దొంగతనం చేయడానికే సమాధి మందిరం లోపల  ఉన్నట్లు ఆరోపణలు కూడా చేసి ఉద్యోగం నుండి తీసివేస్తామని బెదిరించారు. రాజు జరిగింది జరిగినట్లు చెప్పి ఎంతగా వేడుకున్నా ఎవరూ అతనిని నమ్మలేదు. చివరకు ముంబయి లోని సంస్థాన్ ముఖ్య కార్యాలయానికి మొత్తం విషయాన్ని రిపోర్ట్ చేసివారి నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకుంటామని సంస్థాన్ అధికారులు చెప్పారు.

            అదేరోజు రాత్రి ముంబయిలోని అధికారికి బాబా స్వప్నంలో కనిపించి రాజుని ఉద్యోగం నుండి తొలగించవద్దు. నేనే నాకు నివేదించిన శీరా పూరీలను అతనికి తినడానికి ఇచ్చాను. అతని తప్పు ఏమీ లేదు. రాజు నిజాయితీ గల కుర్రవాడు. ఈ క్షణం నుండే  సంస్థానంలో అతని ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయమని నువ్వు అధికారులకు సూచించు అని చెప్పి బాబా అదృశ్యులయ్యారు. ఆ అధికారి వెంటనే లేచి బాబా చెప్పిన విషయాన్ని షిరిడీలోని అధికారులకు ఉత్తరం ద్వారా తెలియచేసాడు. అంతే కాకుండాతాను రాజుని కలుసుకోవడానికి వెంటనే షిరిడీ బయలుదేరి వస్తానని తెలియజేసారు.
           జరుగుతున్న పరిణామాలను చూసి, షిరిడీలోని సంస్థాన్ కమిటీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ముంబాయి నుండి ఆ అధికారి షిరిడీ వచ్చి బాబా సమాధికి నమస్కరించిన తరువాత, రాజుని కలవాలని అడిగాడు. సమాధి మందిరం ఊడ్చే పనిలో నిమగ్నమయి ఉన్న రాజు దగ్గరకు ఆ అధికారి నేరుగా వెళ్ళి రాజుకి సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు చాలా అదృష్టవంతుడివి! బాబాయే స్వయంగా వచ్చిఆయనకు నివేదించిన శీరా పూరీలను నీకు తినిపించారు అని అన్నారు. తరువాత బాబా ప్రసాదించిన స్వప్నదర్శనాన్ని షిరిడీ సంస్థాన్ అధికారులతో సంతోషంగా పంచుకున్నారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo