సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మంచి నడవడి కలిగి ఉండండి


పేరు తెలియజేయని ఒక శిరిడీ సాయిభక్తుడు ఇలా చెప్తున్నారు:


ఒక పెద్ద అనుభవాన్ని నేను అందరితో షేర్ చేసుకోవాలన్న కోరికతో వ్రాస్తున్నాను. 2018, ఫిబ్రవరి 4న నేను, నా స్నేహితులు మొత్తం 150 మంది భక్తులం శిరిడీ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమనేర్ నుండి శిరిడీకి పల్లకీయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాము. అదేరోజు ఉదయం మా ఇంటిలో మా అతిథి ఒకరు మా నాన్నగారి జేబు నుండి 25,000 రూపాయలు దొంగిలించాడు. దానితో మా కుటుంబసభ్యులంతా కలవరపడుతూ నాకు ఫోన్ చేసి ఏమి జరిగిందో చెప్పారు. "సరే, జరిగిందేదో జరిగిపోయింది. బాబా ఏమి చేయాలో అది చేస్తారు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. నేను భక్తులందరికీ శిరిడీలో అనేక ఏర్పాట్లు చేయవలసి ఉంది" అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

మరుసటిరోజు నేను శిరిడీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత మా నాన్నగారు ఆ విషయం గురించి చర్చించారు. అప్పుడు నేను మా నాన్నని శిరిడీ వెళ్ళి, బాబా దర్శనం చేసుకొని, "నేను ఏదైనా తప్పు చేసివుంటే నన్ను క్షమించండి బాబా!" అని వేడుకోమని చెప్పాను. వాళ్ళు వెళ్లి ద్వారకామాయిలో ఉండగా, నేను ఇంట్లో బాబా పటం ముందు కూర్చొని, "బాబా! నిన్న ఇంట్లో ఏమి తప్పు జరిగింది? ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడూ ఒక పిన్ను కూడా దొంగిలించబడలేదు" అని చెప్పుకున్నాను. తరువాత కుటుంబసభ్యులంతా పోగొట్టుకున్న డబ్బు కోసం చుట్టుప్రక్కల అంతా వెతికారు. సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఇటుక క్రింద ఉంచిన 25,000 నోట్ల కట్ట కనిపించింది (ఎవరో తీసి ఒక రంధ్రంలా చేసి, దొంగిలించిన డబ్బు అక్కడ పెట్టి, ఎవరికీ కనపడకుండా పైన ఇటుక పెట్టి ఉంచారు). అక్కడ అలా డబ్బులు ఉండటం చూసి అందరం షాక్ అయ్యాం. బాబా ఎప్పుడూ మాతో ఉన్నారు, పోగొట్టుకున్న మా డబ్బు మాకు దొరికేలా చేశారు. ఆ తరువాత ఏమి జరిగిందో, బాబా ఏ మాయ చేశారో తెలియదుగానీ, దొంగిలించిన ఆ అతిథి తనంతట తానే వచ్చి, 'ఆరాత్రి మా నాన్నగారి జేబు నుండి డబ్బును దొంగిలించి అక్కడ దాచిపెట్టాన'ని చెప్పాడు. నేను, "మీరు ఇలా చేయడం మంచి పని కాదు. దయచేసి బాబా దర్బారుకి వెళ్లండి. మీ సమస్యలన్నింటికీ బాబా పరిష్కారం చూపుతారు. ఇలాంటి నేరాలకు మాత్రం మళ్ళీ పాల్పడకుండా ఉండండి" అని చెప్పాను.

"మంచి నడవడి కలిగి ఉండండి" అని బాబా సదా చెప్తూ ఉంటారు.

1 comment:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo