సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి నామస్మరణ


నా పేరు సుజాత వలిగొండ. నా వయస్సు 52 సంవత్సరాలు. "నాన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని నిరంతరం  రక్షించుటయే నా కర్తవ్యం" అని బాబా చెప్పిన మాటలు అప్పటికి ఇప్పటికీ నిత్యసత్యాలు. ఆ మాటలను ఋజువు చేస్తూ మనల్ని రక్షించడానికి బాబా సదా సంసిద్ధులై ఉంటారు అనడానికి ఈ లీలనే సాక్ష్యం. 

బాబా దయవల్ల నా పిల్లలందరికీ వివాహలై సంతోషంగా ఉన్నారు. నాకు షుగర్ వ్యాది ఉంది. ఒకరోజు రాత్రి రెండు గంటలప్పుడు నాకు మెలుకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు, మంటలు. వాటిని తట్టుకునే స్థితిలో నేను అస్సలు లేను. నా భర్త మంచి నిద్రలో ఉన్నారు. నా ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉందని తనని లేపడానికి కూడా నాలో శక్తిలేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు. మనం మనుషులం. కేవలం బాధలో ఉన్నపుడే భగవంతుడు గుర్తొస్తాడుభగవంతుణ్ణి స్మరించు అని చెప్పే వాళ్ళు గుర్తొస్తారు. ఆ స్థితిలో నాకు నా రెండో కూతురు గుర్తు వచ్చింది. తను మంచి సాయి భక్తురాలు. ఎప్పుడూ బాబా నామస్మరణ చేస్తూ ఉంటుంది. తరుచూ నాతో, "అమ్మా! నీకు బాధ కలిగినా, సంతోషం కలిగినా బాబాని స్మరించు. బాబా నీకు సహాయం చేస్తారు" అని చెపుతుంది. "నేను రోజూ 'మా అమ్మనాన్నలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడు బాబా' అని నేను  బాబాకి చెప్పుకుంటాను. బాబా తన భక్తులనే కాకుండా తన భక్తుల కుటుంబ సభ్యుల బాధ్యతని కూడా భాధ్యత నిర్వర్తిస్తారు, వారి యోగక్షేమాలు చూస్తార"ని నా కూతురు అన్న మాటలు ఆ రాత్రి రెండు గంటలకు నాకు గుర్తుకు వచ్చాయి. అప్పుడు బాబాతో, "నా కూతురు చెప్పిందని మీ నామస్మరణ చేస్తున్నాను. నన్ను రక్షించండి" అని చెప్పుకొని "ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి" అనే మంత్ర జపం చేయడం మొదలుపెట్టాను. నాకు తెలిసి ఒక పది నిముషాలు శ్రద్దగా స్మరించి ఉంటాను. అంతలోనే మత్తుగా నిద్రపట్టింది. తెల్లవారాక నా బాధ అంతా బాబా స్మరణలో పోయిందని, బాబా నన్ను ఆ రాత్రి రక్షించారని అర్ధం అయింది. తోడుగా ఉండి నాకున్న బాధని దూరం చేసారు బాబా. ఆ రాత్రి బాబా నాతోనే ఉన్నారని నా నమ్మకం. నన్ను కాపాడటానికి తాను వచ్చారన్నది నిజం. పిలిస్తే పలికే దైవం అని తనని తాను నిరూపించుకున్నారు సాయిమహరాజ్.

1 comment:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo