స్వతహాగా నేను ఒక డాక్టర్ని. నేను నా రెండు కళ్ళ యువెటిస్ (Uveitis అనేది కంటికి సంబంధించి అనేక సమస్యలకు ఒక విస్తృత పదం. కంటి టిష్యూలను నాశనం చేస్తుంది. కంటి వాపు, నొప్పి ఉమ్మడిగా ఉంటాయి. ఇది దృష్టి మందగించడం లేదా పూర్తి అంధత్వానికి దారి తీస్తుంది)తో బాధపడుతున్నాను. 4 సంవత్సరాల పూర్వం కూడా ఒకసారి ఈ సమస్యతో బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు పునరావృతమయ్యింది. నా స్నేహితులలో ముగ్గురు ఉత్తమ కంటి నిపుణులు ఉన్నారు. అందులో ఇద్దరు చెన్నై లోని శంకర్ నేత్రాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందగా, మూడవ అతను అంతర్జాతీయ ఖ్యాతి పొందినవాడు. కాని మళ్ళీ మళ్ళీ యువెటిస్ పునరావృతం అవుతూ ఉంటే ఎదురయ్యే తుది ఫలితాల దుష్పరిణామాల గురించి నాకు తెలుసు కాబట్టి నేను చాలా భయపడ్డాను. ఇది మన శరీరంలో ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి(మనిషి తన కణజాలములతోనే పోరాడినప్పుడు కలుగు వ్యాధి). మన స్వంత కణజాలం ఒక బాహ్య ఇన్ఫెక్టివ్ ఏజెంట్ లా ప్రతిస్పందిస్తుంది. స్టెరాయిడ్లు వాడటం ఒకటే దీనికి ఉన్న చికిత్స. కానీ నేను మీకు చెప్పేది ఏమిటంటే, కేవలం బాబా ఆశీర్వాదంతో నాకున్న ఈ కంటి సమస్య నయం అయ్యింది. రోజూ ఊదీ నీటిలో కలిపి త్రాగేవాడిని. అంతేకాకుండా దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయానికి వెళ్లి, ద్వారకామయిలో ధుని ఎదుట నిలబడి ధునిలో కర్రలు వేసి, నా కళ్లు తెరిచే ఉంచి, "బాబా నా కళ్ళను రక్షించండి, మిమ్మల్ని చూడటానికి, మీ హారతులు మరియు మీ లీలలు చదవడానికి నా కంటి సమస్యను పూర్తిగా నయం చేయండి" అని ప్రార్ధించాను. బాబా కృప వలన పూర్తిగా నయం అయ్యింది.
ఇప్పుడు నేను రోజూ నా కళ్ళకి అలర్జీ ఏమీ రాకుండా రక్షణ కోసం కొన్ని eye డ్రాప్స్ వేసుకుంటాను, స్టెరాయిడ్స్ మాత్రం కాదు. ధన్యవాదాలు బాబా. లవ్ యు సాయిమా! (సాయి తల్లి).
100% నమ్మకం సాయిపై ఉంచండి. మీ డాక్టర్ చికిత్సని కొనసాగించండి. ఊదీ కలిపిన నీళ్ళు త్రాగండి. సాధ్యమైతే సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం వినండి లేక చదవండి.
-డాక్టర్. ఉజ్వల అగశే.
🕉 sai రామ్
ReplyDelete