సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కష్టాల్లో బాబా గుర్తు వస్తే మార్గం అదే తెలుస్తుంది


ఎక్కడ చూసినా ముందు, వెనుక అన్నిచోట్లా సాయినే.

అది 1987వ సంవత్సరం, నాకు మొదటిసారి బాబాను చూసే అదృష్టం కలిగింది. అప్పటినుంచి సాయి దయవలన మా పనులు అన్నీ చక్కగా నిర్వర్తించబడుతున్నాయి. 5 సంవత్సరాల క్రితం నేను “శ్రీ సాయిలీల” బుక్ కు లైఫ్ మెంబర్ షిప్ తీసుకున్నాను. ఆగష్టు 2011 అనగా శ్రావణమాసం మొదటి సోమవారం మా ఇంట్లో లఘు రుద్రయాగం చెయ్యాలని సంకల్పించుకున్నాము. దానికి అనుగుణంగా ప్రొద్దున 7.30 గంటలకు మా గురువుగారు వచ్చేసారు. నేను స్వయంగా పురోహితుడిని కావున బాబాగారి ఆశీర్వాదంతో అన్నీ తయారుచేసి పెట్టుకున్నాను. పూజ ప్రారంభం అయింది. ముందు కులదేవత పూజ చేసుకున్నాను. తరువాత మా ఆరాధ్యదైవం సాయిబాబా పాదాల వద్ద శ్రీఫలం వుంచాము. పూజ అవుతూ వుంది, బాబాకు నైవేద్యం  పెట్టాలి, అంతే. అంతలో 8.30కి ఎప్పుడూ రాని పోస్ట్ మాన్ దూతలాగా వచ్చాడు. “శ్రీసాయిలీల” మే - జూన్ 2011 మాసం పుస్తకం తీసుకుని దత్తాత్రేయుడి రూపంలో మా ఇంటి ముందు నిలబడ్డాడు. మా ఇంటి దైవం దత్తుడు, మా ఇష్ట దైవం సాయిబాబా. ఇద్దరూ ఒకరై వచ్చారా? అనిపించింది. ఇప్పటికీ నాకు గుర్తుచేసుకుంటే రోమాంచితమౌతుంది. 

2011 జులై 28 ప్రొద్దున మేము కెలషీ నుంచి హరిహరేశ్వర్ దర్శనం చేసుకుని ముంబయి వస్తామనుకున్నాం. ఆరోజు బాగా వాన పడుతూ వుంది. కష్టం మీద అందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపాను. నేను చెంబూర్ రాత్రి 10.50 గంటలకు చేరాను. చూస్తూ ఉండగానే నా ముందర మూడు అడుగులు నీళ్ళు. అంతా పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది వాన వలన. ముందర చాలా వాహనాలు ఉన్నాయి. అపుడు నా కాళ్ళ కింద భూమి కంపించిందా? అనిపించింది. నా ముందరే ఒక పెద్ద ట్రక్ వెళ్ళింది. నా మారుతి ఆల్టో బురదతో నిండిపోయింది. దారి అసలు కనపడటం లేదు. అప్పుడు మనసులో అనుకున్నా, “బాబా! 300 కిలోమీటర్లు నన్ను క్షేమంగా చేర్చావు, ఇప్పుడు ఈ పరీక్ష ఏమిటి స్వామీ?” అని. బాబాని ఎప్పుడైతే స్మరించానో అప్పుడే నా మనసు పనిచేయడం మొదలుపెట్టింది. నాముందు ఇంత పెద్ద ట్రక్ వెళ్ళింది, నేను ఎలా ఉండిపోయాను? ముందు దారి బాగుందేమో? అంతే! 10 నిమిషాలలో మాఇల్లు(బాంద్రా తూర్పు) చేరుకున్నాను. అలా ఉంటాయి బాబా లీలలు. కష్టాల్లో ఆయన గుర్తు వస్తే మార్గం అదే తెలుస్తుంది. అప్పుడు బాబా అన్న మాటలు గుర్తువచ్చాయి, “నువ్వు పాలు కావాలంటే ప్రయత్నం చేయి, నేను గిన్నె పట్టుకొని నీతోనే ఉన్నాను”. ఇలాంటి విశ్వాసాన్ని బాబా తన భక్తులకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. నమ్మకం ఉంచుకోవడం మన వంతు. బాబా ఎప్పుడూ శ్యామాతో అనేవారు, “శ్యామా, ఎవరైతే ప్రేమతో నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళ కోరికలు అన్నీ తీరుస్తాను. మరియు వాళ్ళకి నామీద భక్తి-విశ్వాసాలు ఎక్కువ చేస్తాను. నా చరిత్రను ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళని అన్ని దిక్కుల నుండి నేను సంరక్షిస్తాను”.

ఇప్పుడు బాబా మాకు చేసింది అదేగా! మీరే చెప్పండి.

నితిన్ కుమార్ మాహస్ కర్.
మహారాష్ట్ర.

తెలుగు అనువాదం : శ్రీమతి మాధవి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo