సాయిబాబా గొప్ప లీల.
కొన్ని నెలల క్రితం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ని కలుసుకున్నాను. ఆమె పేరు విక్కీ. నేను ఆమెని 'విక్కీదీదీ' (దీదీ అంటే అక్క) అని పిలుస్తుంటాను. ఆమె ఒక సంవత్సర కాలంగా టచ్‌లో లేరు. అనుకోకుండా ఆరోజు కలుసుకున్నాను. మేము తనని లంచ్‌కి రమ్మని ఆహ్వానించాము. ఆమె ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని సమస్యల కారణంగా ఆమె తన భర్తనుండి విడిగా ఉందని తెలిసింది. వారికి మంచి నడవడిగల చక్కటి అందమైన 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆమె ఇతర మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించడం కోసం ఆలోచించకుండా విడాకులకు ప్రయత్నిస్తోంది. ఆమె సమస్యలను విన్న తరువాత నేను ఆమెకు బాబా గురించి చెప్పాను. "బాబాను నమ్ము, ఏదైనా అద్భుతం జరగవచ్చు" అని పట్టుబట్టాను. ఆమెకు నేను బాబా లీలల గురించి, నేను అనుభూతి చెందిన కొన్ని అనుభవాల గురించి వివరంగా చెప్పాను. నాకు నా బాబా గురించి మాట్లాడటమంటే ఎంతో ఇష్టం. నేను ఇలా బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె అంత శ్రద్ధగా వినకపోయినప్పటికీ, ఆమె కొడుకు మాత్రం చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఆరోజు గురువారం, పైగా మధ్యాహ్న ఆరతి సమయం కావడంతో నేను వారిని కొంచెం వేచి ఉండమని, నేను బాబాకి ఆరతి ఇవ్వడం మొదలుపెట్టాను.
నేను పూజ మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ నా వెనుక నిలుచున్నారు. నేను దీపాలు వెలిగించి, బాబాకు చందనం పెట్టడం, నైవేద్యం పెట్టడం చేస్తూ ఉంటే బాబు పూజ అంతా శ్రద్ధగా గమనించి, "చికూదీదీ! దీపాలు, ధూపం ఎందుకు? ఆహారం ఎందుకు? ఈ విగ్రహం తింటుందా?" అని ప్రశ్నించాడు. తను అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలకు నేను చాలా తార్కికంగా వాడికి జవాబు చెప్పాను, ఎందుకంటే పిల్లవాడి యొక్క ఉత్సుకత నిజంగా అధికంగా ఉందని నాకు తెలుసు. "దీపం వలన విశ్వాసం పెరుగుతుంది, దీపం వెలుగులో మనం మన హృదయాలలో ఉండే దేవుని కాంతిని చూడగలుగుతాం. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని వాటిని నెరవేరుస్తాడు. మనం ప్రేమతో ఆహారం పెట్టినట్లయితే సాయిబాబా తప్పకుండా తింటారు. మనకు పళ్ళెం నిండుగా ఆహారం ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆయన ఖచ్చితంగా తింటారు" అని చెప్పాను. తరువాత నేను ఆమెను బాబా నుండి తన ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూడమని కూడా చెప్పాను. అదే వారం చివర్లో వచ్చిన ఆదివారంనాడు ఒక టీవీ సీరియల్‌లో, "పిల్లలు దేవుని దూతలు(ప్రతిరూపాలు)" అని బాబా చెప్పారు.

తరువాత జరిగిన బాబా లీల చూడండి.
తరువాత ఒక ఆదివారంనాడు సాయిమందిరంలో ఆమెను కలుసుకున్నాను. ఎవరైతే బాబాను నమ్మలేదో తను ఇప్పుడు బాబా మందిరంలో! పిల్లాడు తన తండ్రి చేతుల్లో ఉన్నాడు!!!
ఆమె మమ్మల్ని చూసి ఏడవటం ప్రారంభించింది. "బాబా దర్శనం చేసుకున్న తరువాత మీ ఇంటికే వద్దామని అనుకున్నాను" అని చెప్పింది. మా అమ్మ, "నీ కథలో ట్విస్ట్ గురించి చెప్పు" అని ఆమెని అడిగింది. "ఆరోజు మీ ఇంటినుండి తిరిగి వచ్చినపుడు బాబు చిన్న బాబా ఫోటోతోపాటు, దీపములు మరియు అగరుబత్తీలు తీసుకోమని పట్టుబట్టాడు. తర్వాత ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత ఎవరి సహాయం లేకుండా వాడే వాటిని వెలిగించి, "చికూదీదీ (యొక్క) సాయిబాబా! మీరు అందరి కోరికలు నెరవేరుస్తారు కదా! మా డాడీని మా ఇంటికి తీసుకొని రండి. ఈ కోరిక తీర్చండి బాబా!" అని ప్రార్థించేవాడు.
తరువాత ఒక గురువారంనాడు నా భర్త ఇంటికి వచ్చి తన కొడుకును తనకు ఇమ్మని అడిగాడు. "నాకు మమ్మీ కూడా కావాలి" అని బాబు అన్నాడు. దానితో అతను అన్నీ మర్చిపోయి మమ్మల్ని తనతో తీసుకు వెళ్ళడానికి అంగీకరించారు. మేము బయలుదేరి అతనితో వెళ్ళేటప్పుడు, "చికూదీదీ సాయిబాబాను మనతో తీసుకొని వెళ్దాం" అని బాబు అన్నాడు. తండ్రికి బాబా ఫోటో తన కొడుకుకి ఇష్టమైన ఒక ఆటబొమ్మలా అనిపిస్తున్నప్పటికీ, పిల్లవాడికి తెలుసు, తన సాయిబాబానే కష్టపడి తన తండ్రిని తెచ్చారని.
మేము నా భర్త ఇంటికి చేరుకున్న తరువాత బాబుకి మ్యాగీ తయారుచేసి ఇచ్చారు. వాడు సంతోషంగా దానిని తీసుకొని, ఎంతో ప్రేమగా ముందు దానిని బాబాకు పెట్టాడు. తన కొడుకు చేసినది చూసి అతను ఎంతో మురిసిపోయారు. ఇప్పుడు సాయి ఆలయానికి రావడం కూడా ఆయన కోరికే!" అని చెప్పింది.
ఇది అద్భుతమైన బాబా లీల కాదా! అమాయక భక్తులను సాయిబాబా ఎంతో ప్రేమిస్తారు.

Om Sai ram
ReplyDelete🕉 సాయి ram
ReplyDelete