సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా చేసిన ఫోన్ కాల్


నా స్వీయ అనుభవం

రీసెంట్ గా బాబా నాపై చూపిన ప్రేమని, ఆయన ఇచ్చిన ఆనందాన్ని మీ అందరితో ఇప్పుడు పంచుకుంటాను.

ఎవరైనా షిర్డీ వెళ్తున్నారన్నా, అక్కడినుండి ఎవరైనా ఫోన్ చేసినా నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. స్వయంగా బాబాతో కాంటాక్ట్ అవుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేను కూడా. అలాంటిది ఆ విషయంలో బాబా మిరాకిలే చేస్తే ఇంక ఎలా చెప్పగలను? అయినా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, సవ్యంగా ఈ లీలను వ్యక్తపరిచేలా బాబాయే అనుగ్రహించాలి. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే కనుక.

2018, మే 28న నాకు తెలిసిన కొందరు సాయి బంధువులు షిర్డీ బయలుదేరారు. వాళ్ళు షిర్డీ వెళ్ళేముందు, "షిర్డీ నుండి మీకు ఫోన్ చేస్తాను, కాస్త అందుబాటులో ఉండండి" అని చెప్పారు. నేను 'సరే' అన్నాను కాని, మంగళవారం నాడు పని ఉండి నేను మా తమ్ముడు వైజాగ్ వెళ్లాం. ఆ రాత్రి అక్కడే ఉండి, మరుసటి రోజు బుధవారం సాయంత్రం 5.40కి రిటర్న్ బయలుదేరాం. స్టార్ట్ అయిన కొద్ది క్షణాలలో రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా నా ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే షిర్డీ నుండి సాయి బంధువు చేస్తున్న కాల్ అది. నేను లిఫ్ట్ చేసే లోపల కాల్ కట్ అయ్యింది. సరే ట్రాఫిక్ లో కాల్ చేయడం ఎందుకని నేను వాళ్ళకు కాల్ చేయకుండా ఒక అరగంట తరువాత ఒకచోట ఆగినప్పుడు ఆ సాయి బంధువుకి కాల్ చేశాను. కాని అప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. "నేను వైజాగ్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాను, ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాను, అందుకే మాట్లాడలేను" అని వాళ్ళకి మెసేజ్ పెట్టాను. నేను ఇంటికి 9 గంటల తరువాత చేరుకొని, పడుకునే ముందు మొబైల్ చూసుకుంటే షిర్డీ నుండి సాయి బంధువు చేసిన 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు నా మెసేజ్ చూసుకోలేదు. ఆ మిస్డ్ కాల్స్ చూశాక, షిర్డీ నుండి వచ్చిన కాల్స్ మాట్లాడలేకపోయినందుకు బాధగా అనిపించింది. మరుసటిరోజు గురువారం(మే 31) కావడంతో, ఉదయం లేచి నేను స్నానం చేసిన తరువాత బాబాకి అభిషేకం చేశాను. తరువాత బాబాకి అలంకరణ చేస్తూ, "ఏమిటి బాబా ఇలా అయింది? షిర్డీ నుండి కాల్ వస్తే నాకు మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. నాకు ఆ ఆనందాన్ని మిస్ చేసారు. నేను మీకు దూరం అవుతున్నానా బాబా?" అని బాధగా బాబాతో మాట్లాడుకున్నాను. "వీలయితే ఈరోజు మళ్ళీ ఫోన్ వచ్చేలా చేయండి" అని బాబాకు చెప్పుకుంటూనే, "వాళ్ళు వెళ్ళిందే షిర్డీలో మీతో టైం స్పెండ్ చేయడానికి, మళ్ళీ వాళ్ళు నా మీద దృష్టి పెట్టి వాళ్ళ టైం వృధా చేసుకోవడం ఎందుకులెండి బాబా. మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత పారాయణ చేసుకొని, లంచ్ కూడా పూర్తి చేశాను. సరిగ్గా 2 గంటలకు నా ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే ఆశ్యర్యం! అది షిరిడీ నుండి వచ్చిన కాల్. నా ఆనందం ఇంకా చెప్పాలా? సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి రెండు, మూడు సార్లు 'హలో!' అని, 'సాయిరామ్!' అని పలకరించాను, కాని అవతల నుండి ఎటువంటి స్పందన లేదు. సరే నన్ను బాబాను ప్రార్థించుకోమని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని అనుకుని, నేను చక్కగా బాబాని ప్రార్థించుకున్నాను. మళ్ళీ 'హలో!' అని అన్నా, అవతల నుండి రెస్పాన్స్ లేదు. నేను నా కంప్యూటర్ లో షిర్డీ నుండి బాబా లైవ్ దర్శనం పెట్టుకొని బాబాని చూస్తూ ద్వారకామాయి, చావడి, గురుస్థాన్, సమాధి మందిరం అన్నీ తలుచుకొని బాబా ఉనికిని అనుభూతి చెందాను. చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 18 నిమిషాలు దాటిన తరువాత నేనే కాల్ కట్ చేశాను. అయితే, అవతల నుండి రెస్పాన్స్ లేదంటే అదేదో టెక్నికల్ ప్రోబ్లం అయి ఉండొచ్చు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ, ఆ 18 నిమిషాలలో నాకు ఫోన్ లో అవతల వైపు నుండి అక్కడ ఎవరో చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతూ ఉన్నాయి. అందువలన అది ఖచ్చితంగా బాబా నాకు ఇచ్చిన అవకాశమే. కాల్ కట్ చేసిన తరువాత నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. అవేమిటంటే, ఒకటి ఆ ఫోన్ కాల్ చేసి ఆ సాయి బంధువు మౌనంగా ఉండి ఉండాలి. లేదా అది బాబా మిరాకిల్ అయి ఉండాలి అని అనుమానం వచ్చింది. సరే వాళ్ళు షిర్డీ నుండి వచ్చిన తరవాత అది బాబా చేసిన అద్భుతమా! కాదా! అని తెలుసుకుందాం అనుకున్నాను.

షిర్డీ వెళ్ళిన ఆ సాయి బంధువులు హ్యాపీగా 5రోజులు సాయి సన్నిధిలో గడిపి మధుర స్మృతులతో ఆదివారం ఇంటికి చేరుకున్నారు. తరువాత నేను బుధవారం అంటే జూన్ 5 సాయంత్రం వాళ్ళ షిర్డీ విశేషాలు తెలుసుకోవడానికి వాళ్ళలో ఒక సాయి బంధువుకు ఫోన్ చేసి మాట్లాడాను. తాను చాలా హ్యాపీగా వాళ్ళకి అక్కడ కలిగిన అనుభవాల గురించి చెప్పగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అలా మాట్లాడుతూ చివరిలో తాను, "మీకు షిర్డీ నుండి ఫోన్ చేయాలని చాలాసార్లు కాల్ చేశాను కాని, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు" అన్నారు.


అప్పుడు నాకు గుర్తుకు వచ్చి, "మీరు ఎన్నిసార్లు చేసినా నేను కాల్ లిఫ్ట్ చేయలేదా!!!" అని రెండు మూడుసార్లు గుచ్చి గుచ్చి అడిగాను.

అందుకు తాను, 'లేదు' అంటూ, "షిర్డీలో సాధారణంగా మందిర ప్రాంగణంలోకి మొబైల్స్ అనుమతించరు కదా, అందుకే మేము మొబైల్స్ రూమ్ లోనే వదిలేసేవాళ్ళం. కానీ, మీకు ఫోన్ చేయాలని ప్రత్యేకించి ఫోన్ తీసుకువెళ్లి రెండు, మూడు గంటలపాటు మారుతి టెంపుల్ దగ్గర ఉండి, అక్కడి నుండి 6, 7సార్లు కాల్ చేశాను. కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో నేను మళ్ళీ మీకు కాల్ చేయలేదు" అన్నారు.

"అయితే బాబా మిరాకిల్ చేశారు" అన్నాను నేను.

దానికి తాను, 'ఏమి జరిగింది?' అని అడిగారు.

అప్పుడు నేను తన ఫోన్ నుండి నాకు వచ్చిన కాల్ గురించి చెప్పాను. 

తాను ఆశ్చర్యపోయి! "అదెలా సాధ్యం? అసలు నేను నా ఫోన్ కి ఫింగర్ ప్రింట్ తో లాక్ సెట్ చేసి పెట్టాను. అది కూడా రైట్ హ్యాండ్ అయితే ఎక్కువగా ఉపయోగిస్తామని, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్ సెట్ చేశాను. అందువలన నేను ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ చేస్తేనే నా ఫోన్ లాక్ ఓపెన్ అవుతుంది(కాని బాబాకు సాధ్యం కానిది ఏముంది?). నేను కాక వేరే ఎవరూ చేసే అవకాశం కూడా లేదు. అలాంటిది నా ఫోన్ నుండి మీకు కాల్ రావడమేమిటి? ఆశ్చర్యంగా ఉంది" అన్నారు తాను.

"అవును, నేను చెప్పేది నిజం. ఒక నిమిషం కాదు, 18 నిమిషాలు పైగా నేను కాల్ లో ఉన్నాను. బహుశా మీరు రూమ్ లో మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను, చిన్నగా ఏవో గుసగుసలు కూడా వినిపించాయి" అన్నాను.

అప్పుడు, "ఇది ఖచ్చితంగా బాబా చేసిన మిరాకిలే" అని ఇద్దరం నిర్ధారించుకున్నాం.

అప్పుడు తను "నేను మీకు ఫోన్ చేయలేదని చాలా బాధపడ్డాను. కాని నా ఫోన్ ద్వారానే మీకు కాల్ చేసి ఇంత మంచి మిరకిల్ బాబా చేయడంతో నా దిగులు పోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన ఈ మిరకిల్ లో నేను కూడా ఉపకరణాన్ని అయినందుకు నాకు కూడా పట్టలేని ఆనందంగా ఉంది. థాంక్యూ బాబా" అన్నారు.

ఇక అది బాబా మిరాకిల్ అని నిర్ధారణ అయ్యాక నా ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని ఎలా చెప్పగలను మాటలలో? వెంటనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, నాకు తెలిసిన కొందరు సాయి బంధువులకు కాల్ చేసి ఆ ఆనందాన్ని వాళ్లతో షేర్ చేసుకున్నాను. అలా షేర్ చేసుకుంటూ ఉంటే ఆ ఆనందం ఇంకా ఎన్నో రెట్లు అధికమై నా మనసంతా బాబా ప్రేమని ఆస్వాదిస్తూ పరవశించిపోయాను.

షిర్డీ నుండి వచ్చిన ఫోన్ కాల్ మిస్ అయ్యిందని బాధపడ్డ నాకు బాబా ఇంతటి ఆనందంతో నిండిన ఎంతో గొప్ప బహుమతి ఇచ్చారు.

మనం ఉన్న చోట కూడా బాబా ఉన్నారు, అందులో అనుమానం లేదు. కాని షిర్డీ ప్రత్యేకమైనది. సృష్టి అంతా బాబా శరీరమే, అందులో షిర్డీ అనేది బాబా హృదయస్థానం(శరీరంలో హృదయానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనదే కదా!). షిర్డీలో ప్రతి అణువు పరమ పవిత్రమైనది. బాబా పాదాలను ముద్దాడిన ఆ భూమి, ఆయనను స్పృశించే ఆ గాలి, ఒకటేమిటి, అన్నీ పవిత్రమైనవే. (ఇలా వ్రాస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతుంది. నా కన్నులనుండి ఆనందభాష్పాలు జాలువారుతున్నాయి) అందుకే షిర్డీలో బాబా మందిర ప్రాంగణమే కాదు, ఎక్కడి నుండి కాల్ వచ్చినా నాకు మహదానందం. ఆ కాల్ లో నేను వాయిస్ వినకపోయి ఉండొచ్చు. కాని, 'బాబాతో కనెక్ట్ అవుతున్నాను' అన్న ఫీలింగే చాలా మధురమైనది. అయినా, 'హృదయం నుండి అందేది మౌన ప్రబోధమే!' అన్నది మహాత్ముల మాట.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo