వాట్సాప్ గ్రూపులోని ఒక సాయిబంధువు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
2018, జూన్ 18 నాటి ఒక కల మీతో పంచుకుంటాను.
కొన్నిరోజుల క్రితం నేను, ఒక సాయిబంధువు బాబా పేరు మీద జరుగుతున్న మోసాల గురించి చాలా బాధగా చర్చించుకున్నాం. "ఏదైనా ఈ విషయంలో బాబాయే చేయాలి, మనము చేయగలిగింది ఏమీ లేదు" అని అనుకున్నాము.
2018, జూన్ 16 శనివారం సాయంత్రం ఒక సాయిభక్తుడు ఇలా చెప్పారు: "రెండు సంవత్సరాల క్రితం ఒకతను విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నా వద్ద నుండి డబ్బు తీసుకొని మోసం చేసాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి 'గురువు'గా అవతారమెత్తి కనిపించాడు. ప్రజలు గుడ్డిగా అతనిని అనుసరిస్తున్నారు. అతను బాబా పేరు చెప్పుకొని ప్రజల వద్ద నుండి డబ్బు గుంజుతున్నాడు".
ఇటువంటి సంఘటనే 2015లో నాకు కూడా జరిగింది. ఢిల్లీలోని ఒకచోట సాయి మందిర నిర్మాణం చేస్తామంటే, నేను ఆ చోటుకు సమీపంలో ఉన్న రెండు కమ్యూనిటీల నుండి నిధులను సేకరించి ఇచ్చాను. ఆ వ్యక్తి కూడా డబ్బంతా తీసుకొని పారిపోయాడు. ఇప్పటివరకు అతని గురించి ఏ సమాచారం లేదు.
నిన్న రాత్రి నేను ఇటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేకపోయాను. నా మనస్సులో ఎన్నెన్నో ప్రశ్నలు. వేటికీ సమాధానాలు లేవు. చివరికి నేను బాబాని, "బాబా, ఏం జరుగుతుంది? వాళ్ళు అలా తప్పులు చేయడానికి మీ పేరును ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు మీరే కావాలని(ప్రతి ఒక్కళ్ళు బాబాలే అయిపోవాలని) ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్నే దోచుకుంటున్నారు. ఏమిటిదంతా?" అని అడిగాను.
తరువాత సుమారు 2 గంటల సమయంలో నేను నిద్రపోయాను, 4గంటలకి నా అలారం మ్రోగటం వలన మెలకువ వచ్చింది, కానీ మళ్ళీ నిద్రపోయాను. కాసేపటికి నాకు 1977లో వచ్చిన "షిర్డీ కే సాయిబాబా" చిత్రంలో బాబాగా నటించిన అతని మాటలు వినిపించాయి. అతను, "నీవు చింతించకు, ప్రతిదీ జాగ్రత్త తీసుకోబడుతుంది" అని చెప్పారు. తరువాత కొద్దిసెకన్లు అంతా నిశ్శబ్దంగా ఉంది. తరువాత, ఒక పేపర్ గాని, పెన్ను గాని, చేయి గాని ఏదీ కూడా కనిపించకుండా, "నా ఎముకలు మీతో మాట్లాడతాయి, మీకు ఆశను కలిగిస్తాయి" అని వాటంతట అవే వ్రాయబడ్డాయి. ఇదంతా ప్రాతఃకాలాన వచ్చిన కల. ఆ కల అక్కడితో ముగిసింది.
ఆరోజు తేదీ జూన్ 18 అంటే 1 + 8 = 9.
ఈ కల ద్వారా బాబా నన్ను ఆశీర్వదించారు. "నేను ఎక్కడికీ పోలేదు, ఇప్పటికీ మీతోనే ఉన్నాను, ప్రతిరోజూ మీతో మాట్లాడుతూనే ఉన్నాను" అని బాబా నిరూపించారు.
ధన్యవాదాలు బాబా.
🕉 సాయి ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me