
ఈ భాగంలో అనుభవం:బాబా ఇచ్చిన మరుజన్మ
నా పేరు రాజి. నేను బాబా భక్తురాలిని. నేనిప్పుడు నా కథను మీతో పంచుకుంటున్నాను. కథ అంటే కల్పితం కాదు. నా జీవితంలో జరిగిన బాబా లీల, ఆయనపై నేను పెట్టుకున్న నమ్మకానికి ఆయన నన్ను కాపాడిన వైనం. కాపాడారు అనడం కంటే, పోయే నా ప్రాణాన్ని వెనక్కి లాగారు...