1. అడిగిన వెంటనే ఆపదను తొలగించిన సాయి
2. డెంగ్యూ నుండి కాపాడిన బాబా
3. అర్థించినంతనే సమాధానమిస్తారు బాబా4. బాబాకి చెప్పుకున్న కాసేపటికే నిద్రపోయిన బాబు
అడిగిన వెంటనే ఆపదను తొలగించిన సాయి
సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు రాజేశ్వరి. ఇంతకుముందు ఒకసారి నేను నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. 2021, మే 9న నాకు జ్వరం వచ్చి, రెండు రోజులైనా తగ్గలేదు. దాంతో, అది కరోనానేమో అని భయపడ్డాను. వెంటనే, "బాబా! మీరు తప్ప నాకు ఎవరూ సహాయం చేయరు. ఇది కరోనా కాకుండా చూడయ్యా" అని మా ఇంట్లో ఉన్న ద్వారకామాయి సాయి ఫోటోకి దణ్ణం పెట్టుకున్నాను. నేను మొత్తం పదిరోజులపాటు దగ్గుతో, ఆయాసంతో ఇబ్బందిపడ్డాను, కానీ బాబా దయవల్ల అది కరోనా కాదు. నిజానికి మా వీధిలో చాలా కరోనా కేసులున్నాయి. మా ఇంటి ప్రక్కన కూడా మూడు కేసులున్నాయి. అయినా నాకు మాత్రం కరోనా రాలేదు. ఇది సాయి దయకాక ఇంకేమిటి? "ధన్యవాదాలు బాబా".
ఇకపోతే, విజయవాడలో నాకు తెలిసిన ఒక సాయిబంధువు అనుభవాన్ని ఇప్పుడు తన మాటల్లోనే మీ ముందుంచుతాను.
డెంగ్యూ నుండి కాపాడిన బాబా
నేను విజయవాడలో నివాసముంటున్న ఒక సాయిభక్తురాలిని. ఇటీవల మా బాబు మూడురోజులపాటు 103.8 డిగ్రీల జ్వరంతో బాధపడ్డాడు. రక్తపరీక్ష చేయిస్తే, అది డెంగ్యూ అని రిపోర్టు వచ్చింది. 97 వేలు ఉన్న ప్లేట్‌లెట్లు రోజురోజుకీ తగ్గిపోసాగాయి. అప్పటివరకు ఆర్ఎంపి వైద్యుడైన మా బావగారి అబ్బాయే బాబుకి ఇంట్లో వైద్యం చేస్తుండేవాడు. అతను రోజూ డాక్టర్ సలహామేరకు సెలైన్ పెట్టడం, రక్తపరీక్ష చేయించడం అన్నీ తానే చూసుకుంటుండేవాడు. ‘ప్లేట్లెట్లు 20 వేలకి చేరుకుంటే గనక బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయమ’ని డాక్టర్ చెప్పారు. నేను రోజూ సాయినాథుని వేడుకుంటూ ఉండేదాన్ని. ప్లేట్లెట్లు 30 వేలకు వచ్చినప్పుడు నేను, "అయ్యా సాయీ! హాస్పిటల్లో ఎవరుంటారయ్యా? కాస్త నువ్వే ఆలోచించు. రోజురోజుకీ తగ్గుతున్న ప్లేట్లెట్లు రేపటికి కొంచెం పెరిగేలా చూడయ్యా" అని ఏడుస్తూ బాబాతో చెప్పుకున్నాను. మా బావగారి అబ్బాయి కూడా ప్లేట్లెట్లు ఎందుకు పెరగడం లేదని టెన్షన్ పడుతూ చాలా బాధపడి బాబుతో, "తినరా, లేకపోతే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది" అని చెప్పి వెళ్ళాడు. నేను బాబాను మనస్ఫూర్తిగా వేడుకుని, "బాబా! మీ దయతో ప్లేట్లెట్లు పెరిగితే ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. ఆశ్చర్యం! మరుసటిరోజుకి ప్లేట్లెట్లు 97 వేలకి పెరిగాయి. అంతా సాయి దయ. నమ్ముకున్నవాళ్ళకి సాయి అంతా మంచే చేస్తారు. "ధన్యవాదాలు సాయీ". ఇంకా కొన్ని సమస్యలున్నాయి. అవి తీరిన వెంటనే మీతో పంచుకుంటాను.
అర్థించినంతనే సమాధానమిస్తారు బాబా
నేనొక సాయిభక్తురాలిని. మేము విజయవాడలో నివాసం ఉంటున్నాము. మా అమ్మ కొన్నిరోజులపాటు ఆరోగ్యసమస్యలతో నిద్రలేక బాధపడుతుండేది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో అమ్మ ప్రశాంతంగా నిద్రపోతే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా కరుణ చూపించారు. బాబాను ప్రార్థించిన తర్వాత అమ్మ ప్రశాంతంగా నిద్రపోతోంది. "థాంక్యూ సో మచ్ బాబా. మిమ్మల్ని ఎప్పుడు అర్థించినా వెంటనే మీరు సమాధానమిస్తారు. నా మనస్సులోని కోరికలు కూడా మీకు తెలుసు. త్వరలో వాటిని కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నాను. నా పెళ్లి విషయంలో నాకు స్పష్టత రావట్లేదు. దయచేసి నాకు సహాయం చేయండి బాబా".
రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబాకి చెప్పుకున్న కాసేపటికే నిద్రపోయిన బాబు
ముందుగా, సాటి సాయిభక్తులకు మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. 2021, ఆగస్టు 21న మేమిద్దరం దూరప్రయాణం చేయాల్సివచ్చి, ఉదయం పదిగంటలకు బయలుదేరాం. బాబు తినడానికి అరటిపళ్ళు, బిస్కెట్లు, పాలు తీసుకెళ్ళాను. కానీ, అవి మధ్యదారిలోనే అయిపోయాయి. ఇంకా బాబుకి ఆకలిగా ఉంటే స్వీట్‌కార్న్ కొని తినిపించాను. మేము గమ్యం చేరుకునేసరికి రాత్రి 8 గంటలైంది. ఫ్రెష్ అయ్యి, తినేసి పడుకున్నాము. చక్కగా నిద్రపోయిన బాబు మధ్యలో ఉన్నట్టుండి లేచి ఏడవడం మొదలుపెట్టాడు. స్వీట్‌కార్న్ జీర్ణం కాలేదేమో, అందుకే ఏడుస్తున్నాడని నాకు అనిపించింది. అయితే, ఎప్పుడు ఊరు వెళ్ళినా కడుపునొప్పి సిరప్ తీసుకెళ్లే నేను ఈసారి తీసుకురావడం మర్చిపోయాను. అందువల్ల నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే నేను బాబాని తలుచుకుని, "బాబా! బాబుకి నొప్పి తగ్గి, హాయిగా నిద్రపోయేలా చూడు. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి బాబు నిద్రపోయాడు. "బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ. మీ బిడ్డలను ఇలాగే ఆపదల నుండి కాపాడండి బాబా".
shiridi sai ... sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai
ReplyDeleteJaisairam bless.my mother for her eye problem.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
864 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸😀🌹☺️🤗🌼
ReplyDeleteFrom 1997 to still now waiting for good job but ... I promise to Sri sai baba definitely I will share in this blog if I or my spouse get good job
ReplyDeleteOm sai ram baba ma andari arogyalu bagundali thandri pleaseeee
ReplyDelete