1. బాబా అనుగ్రహ చిహ్నాలు
2. బాబా దయ ఎంత అపారమైనదో!
3. ఆరోగ్యప్రదాత మన బాబా
బాబా అనుగ్రహ చిహ్నాలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా, సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నమస్కారం. నా పేరు పి.సి.శేఖర్. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
నేను ఈమధ్య నెలరోజులపాటు అన్నం తినేముందు ‘మానసిక పూజ’ చేశాను. భౌతికంగా పూజ చేయకుండా మనసుతో చేసే పూజనే ‘మానసిక పూజ’ అంటారు. 2021, జూలై 16 రాత్రి నేను అన్నం తినబోయే సమయంలో కరెంటు పోయి, మళ్ళీ వెంటనే వచ్చింది. దాంతో మానసికంగా నేను దీపాలు వెలిగించలేదని నాకు అర్థమైంది. వెంటనే నేను మానసికంగా దీపాలు వెలిగించి పూజ పూర్తిచేసి అన్నం తిన్నాను. నిజానికి నేను ఎప్పుడూ మానసిక పూజలో భాగంగా సాయిబాబా ముందు దీపాలు వెలిగించి, స్వీట్స్ పెట్టి, ఆపై అన్నం నివేదించేవాడిని. ఆరోజు నేను మర్చిపోవడం, వెంటనే బాబా ఆవిధంగా నాకు గుర్తుచేయడం జరిగింది. ఇలా నేను ఎప్పుడైనా మానసిక పూజ చేయకపోతే ఏదో ఒక రూపంలో సాయి నాకు సందేశమిచ్చి గుర్తు చేస్తుంటారు.
నేను వృత్తిరీత్యా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. 2021, జూలై 23న కస్టమర్లకి ఇచ్చిన డబ్బుల గురించి ఆలోచిస్తుంటే, "భయపడకు, పోగొట్టుకున్న సొమ్ము లభిస్తుంది" అని బాబా సందేశం వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది.
ఈమధ్య చిట్స్ వ్యాపారం చేయాలని నాకు అనిపించింది. మన బలం, బలహీనతలు మనకన్నా బాబాకే బాగా తెలుసు. అందువలన, నాకు ఏది మంచిదో నేను బాబానే అడిగి తెలుసుకుంటూ ఉంటాను. అందులో భాగంగా అప్పుడప్పుడు బొమ్మ-బొరుసు వేసి బాబా నిర్ణయాన్ని అడుగుతూ ఉంటాను. చిట్స్ విషయంలో కూడా నేను బాబాను ప్రార్థించి, బొమ్మ పడితే వ్యాపారం చేయాలనీ, బొరుసు పడితే వ్యాపారం చేయవద్దనీ నిర్ధారించుకుని నాణాన్ని ఎగరేశాను. బొరుసు పడింది. దాంతో నేను చిట్స్ వ్యాపారం చేయాలన్న నా ఆలోచనను మానుకున్నాను. "బాబా! నాపై కృప చూపండి".
అలాగే ఈమధ్య వ్యాక్సిన్ విషయంలో, బొమ్మ పడితే కో-వ్యాక్సిన్ అనీ, బొరుసు పడితే కోవిషీల్డ్ అనీ నిర్ధారించుకుని నాణాన్ని ఎగరేశాను. అప్పుడు బొమ్మపడింది. కానీ కో-వ్యాక్సిన్ వేసే ప్రదేశాలలో కేవలం ప్రెగ్నెంట్స్‌కి మాత్రమే వేస్తున్నారు. సచివాలయంలో కోవిషీల్డ్ మాత్రమే వేస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ బాబాపై విశ్వాసంతో సహనంగా ఎదురుచూడసాగాను. చివరికి 2021, ఆగష్టు 13న ఆరోగ్య కేంద్రంలో కో-వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకునేలా బాబా అనుగ్రహించారు. "థాంక్యూ సో మచ్ బాబా".
కొన్నిరోజుల క్రిందట నా ఎస్.బి.ఐ ఏటిఎమ్ కార్డు పోయింది. 2021, ఆగష్టు 9న కొత్త కార్డు కోసం అప్లై చేయడానికి బ్యాంకుకి వెళ్ళాను. ఆరోజు బ్యాంకులో చాలా రద్దీగా ఉంది. నాకు భయమేసి, "బాబా! నాకు కరోనా రాకుండా కాపాడు. నాకు కరోనా రాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత 2021, ఆగష్టు 16న బాబా కృపతో కొత్త ఏటిఎమ్ కార్డు ఇంటికి వచ్చింది. అలాగే, బాబా దయవల్ల నాకు కరోనా సోకలేదు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".
2021, జూలై 23న వార్తల్లో తుఫాన్ గురించి చెప్పారు. అదేరోజు రాత్రి హఠాత్తుగా పెద్దగా గాలి వీచి ఇంట్లోని వస్తువులు కదలసాగాయి. నేను శ్రీసాయిసచ్చరిత్రలోని 11వ అధ్యాయం గుర్తుచేసుకుని సాయిని ప్రార్థించాను. అంతే! కాసేపట్లో వాతావరణం ప్రశాంతమైంది. మీరంతా కూడా శ్రీసాయిసచ్చరిత్ర చదివి, బాబా అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. "బాబా! ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని రక్షించండి".
బాబా దయ ఎంత అపారమైనదో!
ముందుగా, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు రత్నాజీ. నేను మొదట కృష్ణభక్తుడిని. కానీ కృష్ణుడి గురించి ఆలోచించేటప్పుడు ఆయన స్థానంలో నాకు బాబా కనిపించేవారు. 'ఎందుకిలా జరుగుతోందా?' అని బాబా చరిత్ర పారాయణ చేస్తే, 'శ్రీకృష్ణుని ప్రతిష్ఠించాల్సిన చోటనే శ్రీసాయిని సమాధిచేశార'ని తెలిసింది. దాంతో బాబాను ప్రేమతో, శ్రద్ధాభక్తులతో కొలవడం ప్రారంభించాను. ఏ పని మొదలుపెట్టినా ముందుగా బాబా చరిత్రలో చెప్పినట్లు ‘ఫలితం నీదే’ అని బాబాపై భారం వేసి ముందుకెళ్ళేవాడిని. అలా వెళ్ళిన అన్ని పనులూ నూటికి నూరుశాతం సఫలమయ్యేవి. అలా ఒకటి కాదు, రెండు కాదు. అసమర్థుడిని సమర్థుడిగా చేసే ఆ సార్వభౌముని లీలలు నా జీవితంలో ఎన్నని చెప్పగలను? దానిలో మచ్చుకి కొన్ని లీలలను ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.
చిన్నప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం అన్నది నాకు ఒక కల. కానీ దాన్ని అందుకోవడం ఎంత కష్టమో మీకు తెలియనిది కాదు. అలాంటిది, బాబా ఎంతో కృపతో నన్ను న్యాయవిభాగంలో ఆఫీసు సబార్డినేట్‌గా చేర్చి, ఎక్జామినర్‌గా, జూనియర్ అసిస్టెంట్‌గా పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు రావలసిన పదోన్నతులను 10 సంవత్సరాల్లోనే ఇచ్చారు. ఇలా ఉద్యోగ జీవితాన్ని విజయపథంలో నిలిపి, జీవితంలో మరో ముఖ్య ఘట్టమైన పెళ్లి విషయంలో కూడా ఎంతగానో అనుగ్రహించారు. ముందు రెండు పెళ్ళి సంబంధాలొచ్చి తప్పిపోయాయి. అమ్మాయిలు కొరతగా ఉన్న ఆ సమయంలో నేను బాబానే నమ్ముకున్నాను. బాబానే దగ్గరుండి ప్రేమతో చూసుకునే కుటుంబంలోని సలక్షణమైన అమ్మాయితో నా పెళ్లి చేసి, ఒక చక్కటి బాబుని కూడా ఇచ్చారు. నా భార్య పేరు సాయి సింధూష, బాబు పేరు సాయి సుధన్వ్. ఉద్యోగం, పెళ్లి అందరి జీవితాలలోనూ ఉంటాయి, అదేం గొప్పకాదు అనుకోకండి. ఉద్యోగాలు లేని సమయంలో ఉద్యోగం ఇవ్వడం, అమ్మాయిలు తక్కువగా ఉన్న తరుణంలో పెళ్లి జరిపించడం బాబా గొప్పతనం తప్ప ఇంకోటి కాదు. నాకు ఏదైనా సమస్య వస్తే, సచ్చరిత్ర పారాయణ, ఆరతులే నాకు పరిష్కారం చూపేవి. అలా నేను ఎన్నో సమస్యలకి బాబా నుండి అవలీలగా పరిష్కారాలు పొందాను. ఈ సమయానికి ఇది కావాలి అంటే అది ఇచ్చారు బాబా. ఆయన దయ ఎంత అపారమైనదో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. "బాబా! కష్టకాలంలో దగ్గరుండి ఓర్పు, సహనాలతో నన్ను శాంతంగా ఉండనిచ్చి, దాని ఫలితాలను ఇచ్చావు. నీకు నేను, నా కుటుంబసభ్యులు ఈ బ్లాగ్ ద్వారా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే కంటికి రెప్పలా మమ్మల్ని ప్రతిక్షణం కనిపెట్టుకుని మీ నీడలో చల్లగా ఉండేలా చూడండి బాబా. మీ అనుగ్రహంతో మాకొక ఆడపిల్లను ప్రసాదించండి. అలాగే, మీ దయతో సొంత ఇంటి కల నెరవేరాలి, నెరవేరుతుంది. మీ దయ ఎప్పటికీ ఇలాగే ఉండాలి".
చివరిగా, ఈ బ్లాగు దైవసంకల్పిత ప్రేరణ మాత్రమే. ఈ బ్లాగు రూపంలో బాబా ఉన్నారు, నమ్మండి. ఓర్పు, సహనాలతో ఉండండి. కలి మాయలో పడి నమ్మకాన్ని కోల్పోకండి. సచ్చరిత్ర పారాయణ చేయండి. బాబా ఉన్నారు, నిజం.
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయి సకల సాధు స్వరూప పాహిమాం.
ఓం నమో శ్రీ సాయినాథాయ. నేను ఉద్యోగరీత్యా విజయవాడలో నివాసం ఉంటున్నాను. ఇటీవల మా ఆఫీసులో ఒకరికి కోవిడ్ వచ్చింది. ఆ విషయం తెలియక తను మామూలుగానే శుక్రవారం ఆఫీసుకు వచ్చారు. తను మాస్క్ కూడా సరిగా పెట్టుకోలేదు. నేను తనతో దగ్గరగా ఉండి మాట్లాడాను. రెండు రోజుల తరువాత సోమవారంనాడు వచ్చిన రిపోర్టులో తనకి కరోనా వచ్చిందని తెలిసింది. ఆ విషయం తెలిసి నాకు చాలా భయం వేసింది. ఆ మరుసటిరోజు నాకు కొంచెం జలుబు, ముక్కు దిబ్బడ వేసింది. నాకు టెన్షన్‌గా అనిపించి వెంటనే బాబాను తలచుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ నీళ్లలో ఊదీని కలుపుకుని త్రాగి, "బాబా! నాకు కరోనా రాకుండా కాపాడు తండ్రీ. జలుబు, ముక్కుదిబ్బడ గురువారంనాటికి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. అపార కరుణామూర్తి, ఆరోగ్యప్రదాత అయిన మన బాబా దయవలన గురువారంనాటికి నా జలుబు, ముక్కుదిబ్బడ రెండూ తగ్గిపోయి సాధారణ స్థితికి వచ్చాను. ఇదే సమయంలో ఆఫీసు పనిమీద నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే అవసరం ఏర్పడింది. అయితే, బాబా కృపవల్ల ఆ పనిని వేరే వ్యక్తికి అప్పగించారు. "ధన్యవాదాలు సాయీ. బాబా! మీ ప్రేమ సదా మీ బిడ్డలమైన మా అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తున్నాను".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba karthik, santosh health bagundali thandri
ReplyDeleteBaba naku e cold and headech thagginchi naku manchi arogyanni prasadinchandi saideva🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉❤😊🙏🌸🥰🌹😀🌼🌺😃
ReplyDeleteOm Sri sai arogya kshemadaya Nemaha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete