సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 902వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నవారికి ఏ ఇబ్బందీ కలుగకుండా చూస్తారు బాబా
2. బాబా దయతో వ్యాక్సిన్
3. సాయి కృపతో కుదిరిన సంబంధం

నమ్ముకున్నవారికి ఏ ఇబ్బందీ కలుగకుండా చూస్తారు బాబా


నా పేరు శ్రీనివాసరావు. గతంలో నా అనుభవాలు కొన్నింటిని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇటీవల బాబా ప్రసాదించిన నా అనుభవాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. మా పెద్ద కుమారుడు యశ్వంత్‌ సాయికి సాయితండ్రి ఆశీస్సులతో జర్మనీలోని ఒక మంచి యూనివర్శిటీలో MS సీట్ వచ్చిన సంగతి నేను గత అనుభవాలలో తెలియజేశాను. అయితే, కరోనా కారణంగా విమానాలు తిరగటం లేనందున మా అబ్బాయి జర్మనీ వెళ్లడం కుదరలేదు, యూనివర్సిటీవారు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అందువలన మా అబ్బాయి ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూ ఉండేవాడు. తను 2021, మే నెలలో జర్మనీ వెళ్లేందుకు విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున విమానాలు తిరగక మా అబ్బాయి వెళ్లడం కుదరలేదు. దాంతో జూన్ నెలలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే అప్పుడు కూడా కరోనా వల్ల ప్రయాణం వాయిదా పడింది. ఆన్లైన్ క్లాసుల వల్ల తను కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నందున జర్మనీ వెళ్లేందుకు అనుమతి వస్తే బాగుంటుందని బాధపడేవాడు. ప్రయాణం ఆలస్యం అవడం వలన తనతోపాటు మేము కూడా చాలా నిరాశకు గురయ్యాము. ఈ పరిస్థితుల్లో నా భార్య పద్మావతి, "బాబా! మా అబ్బాయి ప్రయాణానికి ఏ ఆటంకాలూ లేకుండా చూడు తండ్రీ. నేను ఐదు వారాల సాయి దివ్యపూజ చేస్తాను. ఐదు వారాలు పూర్తయ్యేలోపు మా అబ్బాయి జర్మనీ ప్రయాణం అయ్యేటట్టు చూడమ"ని సాయితండ్రిని ప్రార్థించింది. తరువాతి గురువారంరోజు సాయి దివ్యపూజ ప్రారంభించింది. మూడవ గురువారం పూజ పూర్తయిన మరుసటిరోజు జర్మనీ ఎంబసీ వారు ఇతర దేశాలవారు తమ దేశం వచ్చేందుకు అనుమతినిస్తూ, ఆ సమాచారం మా అబ్బాయి మెయిల్‌కి పంపారు. 'పిలిస్తే పలికే నా సాయి తనను నమ్ముకున్నవారికి ఏ ఇబ్బందీ కలుగకుండా చూస్తార'ని చెప్పడానికి ఇంకా ఏం నిదర్శనం కావాలి? 


వెంటనే జులై 18వ తేదీన జర్మనీ వెళ్లేందుకు మా అబ్బాయి విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ అథారిటీవారు మా అబ్బాయి లగేజీ క్రింద 3 బ్యాగులకు (23kg ×3) మాత్రమే అనుమతి ఇచ్చారు. తదనుగుణంగా మేము 22kg, 22kg, 22.5కేజీలు ఉండేటట్లు మూడు బ్యాగులు ప్యాక్ చేశాము. తీరా మా అబ్బాయి వెళ్లేరోజు ఎయిర్‌పోర్టులో లగేజీ చెక్ చేయగా, అవి 24.5kg, 25kg, 25kg లుగా బరువు ఉన్నాయి. దాంతో సెక్యురిటీవాళ్ళు అదనంగా ఉన్న వస్తువులు తీయమని మా అబ్బాయితో చెప్పారు. అంతలోనే ఆ సెక్యురిటీ సిబ్బందిలోని ఒక పెద్దాయన తన తోటి సిబ్బందితో, "ఏం పర్వాలేదు. ఇతనిని ఇబ్బందిపెట్టకండి. తన లగేజీ ఎలావుందో అలాగే అనుమతించమ"ని చెప్పి, మా అబ్బాయితో, "నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నీకేమీ ఇబ్బంది కలుగదు" అని చెప్పి పంపారు. నిజానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అనుమతి ఇచ్చిన లగేజీకన్నా కనీసం 100గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా అనుమతించరని నేను విన్నాను. అటువంటిది ప్రతి బ్యాగులో సుమారు 2కేజీల బరువు అదనంగా ఉన్నా కూడా అనుమతించారు. నా సాయితండ్రే ఆ పెద్దాయన రూపంలో అక్కడుండి మా అబ్బాయికి ఏ ఇబ్బందీ కలుగకుండా సహాయం చేశారు. అంతేకాదు, ప్రయాణంలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తనను క్షేమంగా జర్మనీకి చేర్చారు బాబా. ప్రస్తుతం మా అబ్బాయి ఆ సాయినాథుని దయవల్ల మొదటి సెమిస్టర్ పరీక్షలు బాగా వ్రాశాడు. బాబా కృపవల్ల తను బాగున్నాడు. "బాబా! మీరు మా అబ్బాయికి తోడుగా ఉండి తనకు ఏ ఇబ్బందీ లేకుండా, ఏ ఆపదా రాకుండా చూసుకోండి తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా దయతో వ్యాక్సిన్


ముందుగా, ఈ బ్లాగును చాలా బాగా నడిపిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. మీ దయవల్ల ప్రతి ఒక్కరికీ బాబాపై ఎంతో విశ్వాసం, నమ్మకం కలుగుతున్నాయి. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం బాబా. నా జీవితంలో బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. 2021, ఆగస్టు 23న జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా అవసరం. అందువల్ల ఆగస్టు 23న నేను వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం హాస్పిటల్‌కి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి రిజిస్ట్రేషన్లు అయిపోయిన కారణంగా డాక్టర్లు నాతో, "ఈరోజు ఇంక వ్యాక్సిన్ వేయము" అన్నారు. దాంతో నేను నిరాశ చెంది బాబాను ప్రార్థించి, "బాబా! మీ దయతో ఈరోజు నాకు వ్యాక్సిన్ వేస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నాను. హాస్పిటల్ స్టాఫ్ అక్కడున్న అందరినీ వెళ్లిపోయి మరుసటి ఉదయం రమ్మని చెబుతున్నారు. అంతలో బాబా ఒక అద్భుతం చేశారు. హఠాత్తుగా ఒక లేడీ డాక్టర్ అక్కడికి వచ్చారు. ఆమెను మేము వ్యాక్సిన్ గురించి అడిగాము. వెంటనే ఆమె, "రిజిస్ట్రేషన్ అవకపోయినా ఇక్కడున్న అందరికీ వ్యాక్సిన్ వేసి, డిటెయిల్స్ తీసుకోమని" చెప్పారు. ఆ విధంగా బాబా దయవల్ల రిజిస్ట్రేషన్ అవకపోయినా నాకు వ్యాక్సిన్ వేశారు. ఇలా నా చిన్ని జీవితంలో బాబా చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమూ. "థాంక్యూ వెరీ మచ్ బాబా. మీ లీలలు తెలుసుకోవడం అసాధ్యం తండ్రీ. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు తల్లిలా, తండ్రిలా, స్నేహితునిలా, గురువులా, దైవంలా నాకు తోడుంటారు. మీ ఋణం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను తండ్రీ!”


సాయి కృపతో కుదిరిన సంబంధం

సాయిభక్తులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. గతంలో నేను కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. "బాబా! నా అనుభవాన్ని ఆలస్యంగా ప్రకటిస్తున్నందుకు నన్ను క్షమించండి". నా పేరు శ్రీనివాస్. నా భార్య పేరు శ్రీదేవి. మాది రాజమండ్రి. మా మేనకోడలికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఏ సంబంధమూ కుదరక మేము చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. సంబంధాలు చూసి చూసి ఏవీ కుదరక పాప తల్లిదండ్రులు ఆ భారాన్ని మాపై వేశారు. దాంతో మేము ఆ బాధ్యత తీసుకున్నాము. నేను సాయినాథునితో చెప్పుకుని, "మీ దయతో సంబంధం కుదిరితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. దోష నివారణకు సుబ్రహ్మణ్యస్వామి పూజలు కూడా చేయించాము. తరువాత చేసిన ప్రయత్నాలలో సాయినాథుని కృపవలన మా మేనకోడలికి మంచి సంబంధం కుదిరింది. ఆ విధంగా బాబానే సుబ్రహ్మణ్యస్వామి రూపంలో మా సమస్యను తీర్చారు. ఈ అనుభవం ద్వారా ‘సమస్యల పరిష్కారం విషయంలో కొంత సహనం కూడా అవసరమ’ని బాబా తెలియజేశారు. ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకుని సహనం వహిస్తే, అన్ని సమస్యలు తీరుస్తారు బాబా. అందుకు సాయికి శతకోటి నమస్కారాలు. "మీ నామమే మాకు రక్ష సాయీ".



9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌺😊🌸😀🌹🥰🌼

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba ee gadda ni medicine tho karginchu thandri sainatha please baba

    ReplyDelete
  5. Baba santosh Carrier bagundali tanaki koduku ni prasadinchu thandri

    ReplyDelete
  6. Baba karthik nikhil sai health bagundali thandri

    ReplyDelete
  7. Baba naa hair problem solve cheyandi tandri. Jai sairam

    ReplyDelete
  8. SAI:- Om Sri sai aarogya kshemadaya namaha 🙏🙏🙏

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo