1. సందేశాలతో సన్మార్గంలో నడిపిస్తున్న బాబా2. కంటి సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
3. అపారమైన బాబా కరుణ
సందేశాలతో సన్మార్గంలో నడిపిస్తున్న బాబా
మూడవసారి నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవడానికి అనుమతించిన శ్రీ సద్గురు సాయినాథునికి, ఈ సువర్ణ అవకాశం కల్పించిన సాయి అన్నయ్యకు, తన బృందానికి నా కృతజ్ఞతలు. నా పేరు దేవి. మేము గజపతినగరంలో ఉంటున్నాము. గత అనుభవంలో ఆర్థికంగా ఎదగడానికి బాబా నాకు అండగా ఎలా నిలిచారో తెలియజేశాను. ఇక ఈ అనుభవంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలా త్రోవ చూపించారో తెలియజేస్తాను.
2015లో, నేను ఉద్యోగంలో ప్రవేశించటానికి ముందు, దుర్గాదేవి భక్తురాలైన నా స్నేహితురాలు (పద్మ) నాకు బాబా అంటే బాగా ఇష్టమని తెలుసుకుని, ఒకరోజున "భక్తుల ప్రశ్నలకు బాబా సమాధానాలు" అనే పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకాన్ని చూడగానే నేను ఎంతో అపరిమితమైన ఆనందానికి లోనయ్యాను. బాబా నాకు ఏదో అనుగ్రహించటానికి ఈ రూపంలో మరలా వచ్చారనుకున్నాను. అప్పటినుండి ఆ పుస్తకంలో చెప్పిన ప్రకారం కేవలం గురువారం మాత్రం బాబా పూజ ముగించాక, 2 రూపాయల దక్షిణను బాబా పాదాల వద్ద ఉంచి, నాకు తోచిన సంఖ్యను మనసులో అనుకుని, బాబాను ధ్యానించి ఆ పుస్తకం తెరచి ఆ సంఖ్యలో ఉన్న బాబా మాటను చూసేదాన్ని. అలాగే, నాకు ఏదయినా సమస్య వచ్చినప్పుడు కూడా పరిష్కారం కోసం ఒక సంఖ్యను అనుకుని ఆ పుస్తకాన్ని తెరచి ఆ సంఖ్యలో ఉన్న బాబా వాక్యాన్ని చూసేదాన్ని. అప్పటి నా మనసుకు తగ్గట్టుగా నాకు బాబా నుండి సమాధానాలు వస్తుండేవి. వాటిని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించేదాన్ని. అయితే రెండు, మూడుసార్లు మాత్రం దేవుడి గూటిలో పెట్టిన ఈ పుస్తకం నాకు కావలసిన వేరే దేవుడి పుస్తకాలు తీయడంలో క్రిందికి పడడం గమనించాను. అలా గమనించినప్పుడల్లా ఆ పుస్తకాన్ని మరలా యథాస్థానంలో పెట్టేసేదాన్ని. ఒకరోజు (గురువారం కాని రోజు) పూజ అయ్యాక ‘ఆ పుస్తకంలో ఏదో ఒక సంఖ్యను తీయి’ అని బాబా నా మనసుకి ప్రేరణ ఇస్తున్నట్టుగా అనిపించింది. అలా అనిపించగానే, ‘బాబా ఇప్పుడు ఎందుకు ఇలా తీయమంటున్నారో?’ అని అనిపించి, ‘బాబా ఏం చెప్పబోతున్నారో’నని కొద్దిగా కంగారుపడ్డాను. కానీ తరువాత బాబాను ధ్యానించి నాకు తోచిన సంఖ్యను తీశాను. అందులో బాబా నాకు ఇచ్చిన సమాధానం: “నా పాదాలు ముదుసలివి, ఎంతో పవిత్రమైనవి. ఇక నీ కష్టాలు పోయినవి" అని. అప్పటివరకు ఆ పుస్తకంలో వేరే వేరే ప్రశ్నలు తీయించి, నా ప్రవర్తనలో ఇంకా ఇంకా మంచి మార్పులు తీసుకురావడానికి మంచి విషయాలను బోధిస్తూ వున్న బాబా ఒక్కసారిగా ఇలా అనుకోని సమాధానం ఇచ్చేసరికి నాకు మాటలు రాలేదు. నా కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. ‘బాబా నన్ను బాగా అనుగ్రహించారు’ అనుకున్నాను. ఇక అప్పటినుండి బాబా నన్ను ఆ పుస్తకంలో రోజుకి ఒక ప్రశ్న తీసేలా మలచుకున్నారు. మరికొన్నాళ్ళకి ఉదయం, సాయంత్రం బాబా పూజ, ఆరతి అయిన తరువాత రెండు పూటలా ప్రశ్నలు తీసేలా చేయిస్తూ బాబా తమ ఆదేశాలను ఇచ్చి, తద్వారా నన్ను మాత్రమే కాకుండా మా వదినని కూడా తమకు తగ్గట్టుగా మలచుకోవడం దాదాపు 6 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించుకోవాలి. అదేమిటంటే, ఏ ఆధ్యాత్మికపరమైన విషయాన్నయినా మా వదినతో కలిసి మరీ పంచుకునేలా చేశారు బాబా. అందుకే మా ఇద్దరికీ ఏ అనుభవాలు (బాబా లీలలు) కలిగినా ఒకరికొకరం ఆ లీలలను గూర్చి చెప్పుకుని, సాయి దివ్యలీలానుభూతులను ఆస్వాదిస్తూ, సంతృప్తి చెందుతూ ఉంటాము. ఆనాటినుండి ఈనాటివరకూ బాబా మాతో నిత్యమూ ఎన్నో సద్గ్రంథాల పఠనం, శ్రవణం (సాయిచాలీసా, నిత్య సాయి ఆరతులు 4, శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహాలు, స్తవనమంజరి, గురుచరిత్ర సప్తాహాలు, లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు, భగవద్గీత, భాగవతం, అష్టాదశ పురాణాలు, దేవీభాగవతం, భారతము మొదలైన గ్రంథాలలో కొన్ని పేజీల పఠనం, సాయి సంకీర్తనల శ్రవణం, మహా సాయి గ్రూపులో పారాయణలు మొదలైనవి..) చేయిస్తూ, ఆ గ్రంథాలలో జ్ఞానాన్ని మా నిత్యజీవితంలో ఆచరించమని సద్గురువుగా మాకు సూచనలిస్తూ, మమ్మల్ని ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి పయనింపజేస్తూ, ఒకప్రక్క కుటుంబబాధ్యతలకు, మరోప్రక్క ఉద్యోగబాధ్యతలకు ఎటువంటి ఆటంకాలూ రానివ్వకుండా, మా జీవితంలో ఎదురయిన ఎన్నో సమస్యలను మా వరకూ రానివ్వకుండా తన అభయహస్తంతో వాటిని పారద్రోలుతూ, మాకు అండగా నిలుస్తూ, ఒక క్రమబద్ధమైన జీవిత విధానాన్ని మాకు అలవాటు చేసిన "శ్రీసాయినాథునికి" వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
సత్సంగాల గురించి బాబా మనకు ఏమి బోధిస్తున్నారంటే...
బాబాకు సత్సంగం అంటే చాలా ఇష్టం. సత్సంగం అంటే మనం నేర్చుకున్న మంచి విషయాలను మనం ఆచరిస్తూ, మనలను కలిసినవారికి ఆ మంచి విషయాలను తెలియపరుస్తూ, ఒకప్రక్క మన భక్తిని వృద్ధిచేసుకుంటూ, ఎదుటివారిలో కూడా ఆ భక్తిని పెంపొందింపజేయడం. ఈ రకంగా మనకు భగవంతుడు ఇచ్చిన మానవజన్మను సార్ధకం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకు కలిగే ఆటంకాలైనటువంటి బద్ధకాన్ని, అలసత్వాన్ని సాయి నామస్మరణ చేయడం ద్వారా మనకు వచ్చే శక్తితో నిర్మూలించుకుంటూ అందరం ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలనీ, అలాగే సాయిభక్తులుగా మనం సన్మార్గంలో నడుస్తూ, మన చుట్టుప్రక్కలవారిని నడిపింపజేస్తూ, సాయికి నిజమైన భక్తులుగా ఉండేలా తమ అనుగ్రహకుసుమాలను మన అందరిపై ఎల్లవేళలా కురిపించాలనీ మనసారా సాయిని వేడుకుంటున్నాను.
సర్వేజనాః సుఖినో భవంతు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!
కంటి సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా, మనందరినీ నిత్యమూ తండ్రిలా కాపాడుతున్న బాబాకు పాదాభివందనం. "బాబా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలము తండ్రీ?" బాబా ప్రసాదించిన ఒక సంతోషాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా బాబు వయస్సు ఐదు సంవత్సరాలు. చిన్నప్పటినుండి తనకు ఎటువంటి కంటి సమస్యా లేదుగానీ, గత ఆరునెలల నుంచి మాత్రం అప్పుడప్పుడు తన ఎడమకన్ను మెల్లకన్నులా అనిపిస్తుండేది. అందువలన నాకు చాలా భయం వేసింది. బాధగా కూడా అనిపిస్తుండేది. అయితే నేను నా బాధని బాబాకు మాత్రమే చెప్పుకోగలను. ఆ సమస్య గురించి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే వాటిలో చాలా రకాలుగా చెప్పారు. అప్పుడు నేను విషయాన్ని మావారికి చెపితే, తను మా బాబు కళ్ళని గమనించి, తనకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్పారు. మేము వెంటనే ఐ-స్పెషలిస్ట్‌కు చూపించాలని నిర్ణయించుకున్నాము. హాస్పిటల్‌కి వెళ్ళే ముందురోజు రాత్రి నాకు నిద్ర సరిగా పట్టలేదు. నేను ఎంత టెన్షన్ పడ్డానో బాబాకే తెలుసు. "ఏదైనా మిరాకిల్ చేయండి బాబా" అని బాబాను కోరుకున్నాను. మెల్లకన్ను ఉన్నవారి కంటిచూపు మందగిస్తుందని విన్నందున కంటి అద్దాలు వాడాల్సివస్తుందేమోనని భయపడ్డాను. కానీ బాబా ఉండగా సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. మేము బాబుని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్లేదారిలో బాబా దర్శనమిస్తూ ఉన్నారు. నేను, "బాబా! బాబుకి కంటి సమస్య లేకుండా ఉంటే ఈ అనుభవాన్ని మీ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. హాస్పిటల్‌కి చేరుకున్నాక బాబుకి రీడింగ్ టెస్ట్, రెటీనా టెస్ట్ చేసిన డాక్టర్, "బాబుకి ఏ సమస్యా లేదు. తనకి అంతా బాగుంది. ఎప్పుడైనా కళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు అలా అనిపించవచ్చు. అంతేగానీ తనకి 100% ఏ సమస్యా లేదు" అని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. "బాబా! మీకు శతకోటి ధన్యవాదాలు తండ్రీ. నా మనసులో రెండు కోరికలున్నాయి. అవి తీరేలా అనుగ్రహించండి బాబా. ఏమైనా తప్పులుంటే క్షమించండి. లవ్ యు సో మచ్ బాబా".
నేనొక సాయిభక్తురాలిని. కొన్నిరోజుల క్రితం నాకు నోటిలో Lichen Planus (సెగ గుల్లలు) అనే సమస్య వచ్చింది. నన్ను పరీక్షించిన డాక్టర్, "ఇది నయం కావడానికి సమయం పడుతుంది. కొంతమందికి కొన్ని నెలలపాటు, కొంతమంది విషయంలో సంవత్సరాలపాటు ఈ సమస్య ఉంటుంది" అని చెప్పారు. దానిగురించి ఇంటర్నెట్‌లో చూస్తుంటే నాకు చాలా చాలా భయం వేసేది. అది నేను మాటల్లో వర్ణించలేను. అప్పుడు నేను నా సమస్య పరిష్కారం కోసం ‘సాయి నవగురువార వ్రతం’ ప్రారంభించాను. ఆరు వారాలు చక్కగా గడిచాయి. హఠాత్తుగా నా భర్త మరణంతో ఏడవ వారం పూజకి ఆటంకం వచ్చింది. అంతే, అక్కడితో వ్రతం ఆపేశాను. అలా వ్రతాన్ని మధ్యలో ఆపడం సెంటిమెంట్‌గా ఫీల్ అయి చాలా ఆందోళన చెంది, "బాబా! నా భర్త చనిపోయారు. ఉమ్మడి కుటుంబం, ఇంకా నలుగురు పిల్లల భవిష్యత్తు నా మీదే ఆధారపడి ఉంది. నాకొచ్చిన ఈ సమస్య గురించి నువ్వే చూసుకో సాయీ" అని బాబా మీదే భారం వేశాను. తరువాత 2021, జనవరి నుంచి నా సమస్య గురించి డాక్టర్ల చుట్టూ తిరిగాను. దానికి ట్రీట్మెంట్ జరుగుతుండగా నాకు కోవిడ్ రావడంతో ఆ చికిత్స కాస్తా ఆగిపోయింది. బాబా దయవల్ల కోవిడ్ నుండి బయటపడ్డాను. కానీ కోవిడ్ కోసం వాడిన మందుల వలన షుగర్ పెరిగింది. అయితే అది కూడా సాయి దయవలన తగ్గింది. కొన్నిరోజులకు మళ్లీ నోటి సమస్యకి చికిత్స అందించే విషయంలో షుగర్ తదితర టెస్టులు చేయించారు. బాబా దయవల్ల అన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టర్ ధైర్యంగా స్టెరాయిడ్ రాశారు. దాంతో బాబా దయవల్ల నోటి ప్రాబ్లం నార్మల్ అయింది. అయితే, జననేంద్రియ ప్రాంతంలో అదే సమస్య వచ్చింది. ఈ ప్రాంతంలో సమస్య తొమ్మిది నెలల నుండి సంవత్సరం వరకు ఉంటుందని డాక్టరు అన్నారు. కానీ బాబా నాపై అపారమైన కరుణ చూపారు. 2021, జూన్ 29న చికిత్స మొదలుపెడితే 2021, ఆగస్ట్ 3న డాక్టర్ నన్ను పరీక్షించి, ‘ఇక మందులు వాడక్కర్లేద’న్నారు. అది విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఇది సాయి దయే ఫ్రెండ్స్. ఇదొక అద్భుతం అనిపిస్తోంది నాకు. "బాబా! అంతులేని మీ ప్రేమకు చాలా చాలా ధన్యవాదాలు".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃🌺😊🌼🌹❤🌸
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteem kadu arogyam manchiga untundi tension padoddu ....
DeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete