సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 901వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా పర్ఫెక్ట్ టైమింగ్
2. సాయినాథుని కృపతో పెరిగిన ప్లేట్లెట్లు
3. బాబాకి చేసిన ప్రార్థనతో పరిష్కారమైన సమస్యలు

బాబా పర్ఫెక్ట్ టైమింగ్


నా పేరు దివ్య. నేను సాయిభక్తురాలిని. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. మీరు ఎంతో ఓపికతో మేము పంపే అనుభవాలను చక్కగా కూర్చి ప్రచురిస్తున్నారు. అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా నాన్నగారికి కోవిడ్ వచ్చి బాబా దయవల్ల నయమైన నెలరోజులకు జరిగిన అనుభవమిది. నాకు పెళ్ళై మూడు సంవత్సరాలవుతున్నా మాకు సంతానం లేదు. అయితే, నేను ఎప్పుడూ దానిగురించి బాధపడలేదు. ఇంట్లోవాళ్ళు మాత్రం మా ఇద్దరినీ "ఇంకా పిల్లలు ఎప్పుడు?" అని అడుగుతూ ఉండేవారు. నాకు ఒకటే ధైర్యం, 'బాబా నాకు అన్యాయం చేయరు. ఆయన టైమింగ్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉంటాయి' అని. అందువలన మా అమ్మతో ఎప్పుడూ "బాబా చూసుకుంటార"ని చెప్పేదాన్ని. ఇకపోతే, మా ఇంట్లో నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులం ఉన్నాము. నాకు తప్ప మిగతా అందరికీ ప్యాకేజీ(జీతం) ఎక్కువే. అందువలన నాకు కూడా జీతం ఎక్కువ అయితే బాగుండు అని మా అమ్మ కాస్త బాధపడుతుండేది. నేను తనతో, "జీవితంలో సంతోషం ముఖ్యం. డబ్బులు కాదు" అని చెప్పేదాన్ని. కానీ అమ్మ నేను కూడా వాళ్ళలా ఎక్కువ సంపాదించాలని బాధపడేది. ఎంతైనా అమ్మ కదా! అప్పుడు నేను బాబాతో, "నాకు ఎక్కువ సంపాదించాలని కోరిక ఏమీ లేదు బాబా. కానీ అమ్మ బాధపడకూడదు" అని చెప్పుకున్నాను. ఇక బాబా ఎలా అనుగ్రహించారో చూడండి.


ఆ సమయంలో నేను మూడేళ్లుగా ఒక సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్నాను. మా మేనేజరుకి నేను చాలా హార్డ్ వర్కర్‌నని నామీద చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆన్‌సైటులో ఉండే మా క్లయింట్ ఒకరు ఇండియాలో బ్రాంచ్ ఒకటి పెట్టాలని అనుకున్నారు. అప్పుడు మా మేనేజరు ఇది చాలా మంచి అవకాశమని నా ప్రొఫైల్ వాళ్ళకి పంపించి నా గురించి సిఫారసు చేశారు. మా క్లయింట్ కేవలం ఒక్క వారంలో ఇంటర్వ్యూ కూడా లేకుండా రెండింతల ప్యాకేజీతో నాకు ఉద్యోగ అవకాశమిచ్చారు. మా అమ్మ చాలా చాలా సంతోషించింది. అయితే ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే, ఆఫీసు చాలా దూరంలో పెట్టారు. రెండు నెలల తర్వాత ఖచ్చితంగా ఆఫీసుకి రావాలని కూడా చెప్పారు. అయితే నేను ఖచ్చితంగా అంత దూరం ప్రయాణం చేయలేనని నాకు తెలుసు. అదివరకు నేను పనిచేస్తున్న ఆఫీసు చాలా దగ్గరలో నాకు చాలా అనుకూలంగా ఉండేది. అందువలన ఆ విషయమై నేను నా భర్తతో చర్చించాను. ఆయన, "పర్లేదు, రెండు నెలల సమయం ఉంది కదా! ఆలోచిద్దాం" అన్నారు. అంతలో మరో అద్భుతం జరిగింది. హఠాత్తుగా నేను గర్భవతినని నిర్ధారణ అయ్యింది. అది కూడా నేను ఒక్క డాక్టరుని కూడా సంప్రదించకుండా పెళ్ళైన మూడేళ్ళలో జరగనిది అప్పుడు జరిగింది. "ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ బాబా మీది!" ఇక ఆ పరిస్థితుల్లో నేను ఆఫీసుకి వెళ్లడమంటే కష్టం. అదే విషయం నేను మా మేనేజరుతో చెప్పాను. "అవునా! అయితే నువ్వు ఎలా ఆఫీసుకి వస్తావు? నేను నీకు ఇంటినుండి వర్క్ చేసే అవకాశం ఇమ్మని క్లయింటుతో మాట్లాడతాను" అని అన్నారు. నా సంతోషానికి హద్దులు లేవు. మా అమ్మ కూడా చాలా ఆనందించింది.


పిల్లల గురించి ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఒకటే అనుకున్నాను, 'బాబా నాతోనే ఉన్నారు. అన్నీ ఆయన చూసుకుంటారు. నాకు అన్యాయం చేయరు' అని. నాకు ఇది కావాలని నేను బాబాని అడగలేదు కానీ, అన్నీ ఆయనే చూసుకుంటారని గట్టి నమ్మకంతో ఉన్నాను. చివరికి నేను విశ్వసించినట్లే అన్నీ సరైన సమయంలో అనుగ్రహించారు బాబా. "లవ్ యు సో మచ్ బాబా. నువ్వెప్పుడూ నాకు తోడుగా ఉండు తండ్రీ".


సాయినాథుని కృపతో పెరిగిన ప్లేట్లెట్లు


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై! 


నా పేరు శ్రీకాంత్. 2021, ఆగస్టు మూడవ వారంలో నేను మా చిన్నమ్మ వారింటి గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ నేను కొంచెం అనారోగ్యానికి గురయ్యాను. మా ఊరికి వచ్చాక డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకుంటే, అతను కొన్ని మందులిచ్చారు. వాటిని వాడుతూ మూడురోజుల తరువాత నేను మళ్లీ మరొక గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆరోజు ఉదయం నేను అనారోగ్యానికి గురయ్యాను. సాయిబాబా దయవల్ల మా ఫ్యామిలీ డాక్టరు హాస్పిటల్ అక్కడికి దగ్గరలోనే ఉంది. వెంటనే బాబాను మనసులో స్మరిస్తూ ఆ హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ నన్ను పరీక్షించి, "ఇదివరకు డాక్టర్ ఇచ్చిన మందులు సరైనవి కావు. వాటిని వాడటం వల్ల మీ ప్లేట్లెట్స్ పడిపోయాయి. అందుచేతనే అనారోగ్యం పాలయ్యారు" అని చెప్పారు. అది విని నాకు చాలా భయం వేసింది. వెంటనే సద్గురు సాయినాథుని మనసులో స్మరించుకుని అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. కొద్దిసేపటికి రిపోర్టులు వచ్చాయి. బాబా దయవల్ల అన్ని రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయి, ప్లేట్లెట్ల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. చాలా భయం వేసి డాక్టరుని అడిగితే, "ఐదు రోజులపాటు మందులు వాడాలి. అప్పటికీ ప్లేట్లెట్ల సంఖ్య పెరగకుండా ఉంటే వేరే మందులు ఇస్తాన"ని చెప్పారు. అప్పటినుంచి శ్రీసాయినాథుని మనస్సులో స్మరిస్తూ, "ప్లేట్లెట్ల సంఖ్య త్వరగా పెరిగి నా ఆరోగ్యం బాగుండాలి తండ్రీ" అని నా సాయికి చెప్పుకున్నాను. నేను హైదరాబాదు నుండి వచ్చిన మరుసటిరోజే మరోసారి ప్లేట్లెట్ల సంఖ్య చెక్ చేయించుకుని రిపోర్టు పంపమని డాక్టర్ సూచించారు. అయితే నేను అప్పటికి ఏ మందులూ వాడలేదు. అందువల్ల ప్లేట్లెట్ల సంఖ్య ఇంకా తగ్గిపోయి ఉంటుందేమోనని చాలా భయమేసి నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అయినా చేసేదేమీ లేక ఆ సాయినాథుని స్మరిస్తూ ల్యాబ్‌కు వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను. ఇంటికి వచ్చిన తరువాత కూడా సాయినాథుని స్మరిస్తూ కూర్చున్నాను. విచిత్రమేమంటే, 15 నిమిషాల లోపలే రిపోర్టు వచ్చింది. అందులో ప్లేట్లెట్ల సంఖ్య పూర్తి స్థాయిలో పెరిగి ఉన్నట్లు ఉంది. అది చూసి డాక్టరు చాలా ఆశ్చర్యపోయారు. డాక్టరు నాతో, "ఇక నీకు లాంటి ఇబ్బందీ లేదు" అని చెప్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. సాయినాథుని ఆశీర్వాదం వల్లనే నా ప్లేట్లెట్స్ అంత తొందరగా పెరిగాయి. నాకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను, నా శ్రీమతి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు తెలుపుకున్నాము.


సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబాకి చేసిన ప్రార్థనతో పరిష్కారమైన సమస్యలు

అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను నా పేరును తెలియజేయక 'సాయి' నామంతోనే మీకు పరిచయం అవుతున్నాను. ఎందుకంటే, మనం అనేది నిజం కాదు. సాయి మాత్రమే నిజం, శాశ్వతం. ఇటీవల నాకు జరిగిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను పనిచేసే చోట ఒకసారి ఒక ముఖ్యమైన ఫైల్ దొరకక నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఆ కారణంగా చాలా సమస్య అవుతుందని భయపడుతూనే, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని చెప్పుకుంటూ, "ఫైల్ దొరకల"ని బాబాకి మ్రొక్కుకున్నాను. నేను బాబాను ప్రార్థించి నిమిషం కూడా గడవలేదు, అంతలోనే ఫైల్ దొరికింది. సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


మరో అనుభవం:- ఇటీవల మా చుట్టాలు కరోనా బారినపడ్డారు. వాళ్లంతా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆ మహమ్మారి బారినుండి బయటపడితే సాయిభక్తుల అనుభవమాలికలో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన వాళ్లంతా స్వల్ప లక్షణాలతో బయటపడ్డారు. అంతేకాదు, వాళ్ళతో సన్నిహితంగా ఉండటం వలన నేను చాలా భయపడ్డాను. కానీ బాబా నాకు నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడారు. "ధన్యవాదాలు బాబా".


ఇంకో అనుభవం:- కొద్దిరోజులపాటు నా గుండెల్లో చిన్న దడగా ఉండేది. అది ఒత్తిడి వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో నాకు తెలియదుగానీ బాబా ఊదీని నీటిలో వేసుకుని త్రాగి, మరికొంత ఊదీని నా గుండెకు రాసుకుని "నాకు ఏ కష్టం లేకుండా ఉన్నట్లయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండురోజుల్లో బాబా నా సమస్యను పరిష్కరించారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!



10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  3. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  4. Baba santosh, karthik health bagundali thandri

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌺😊🌸😀🌹🥰🌼

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo