సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 893వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన ప్రేమ
2. నిద్రలేచేసరికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. ప్రార్థించినంతనే శ్వాస సమస్యను తగ్గించిన సాయి

బాబా చూపిన ప్రేమ


ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. ఈ బ్లాగ్ ద్వారా మనకు ఎన్నో మంచి సందేశాలను ఇస్తూ మనందరినీ ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను చిన్నప్పటినుండి బాబా నామాన్ని వింటూ పెరిగాను. బాబా మాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలలో నుంచి ఇప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకోవడానికి నాకు సహాయం చేయమని బాబాను వేడుకుంటున్నాను.


మొదటి అనుభవం: ఎంతోకాలంగా మా అన్నయ్యకి మంచి ఉద్యోగం లేక మా అమ్మ, నాన్న, నేను చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చి తను జీవితంలో చక్కగా స్థిరపడాలని మేమంతా కోరుకుంటూనే ఉండేవాళ్ళం. నేను అయితే మా అన్నయ్య ఉద్యోగం గురించి బాబాను అనుక్షణం వేడుకుంటూనే ఉండేదాన్ని. అయినా ఎన్నిరోజులకీ తనకు సరైన ఉద్యోగం రాకపోయేసరికి ఒక్కోసారి చాలా నిరాశగా అనిపించి, “బాబా! ఎందుకయ్యా ఇంతగా పరీక్షిస్తున్నావు? మాపై దయచూపించి మమ్మల్ని ఈ కష్టాలనుండి గట్టెక్కించండి” అని బాబాను నిత్యమూ అడుగుతూ ఉండేదాన్ని. ఒక్కోసారి చాలా బాధ కలుగుతూ ఉండేది. కానీ మరుక్షణమే బాబా మాకు తప్పకుండా సహాయం చేస్తారనే విశ్వాసంతో, ‘బాబా తప్ప ఇంక వేరే ఎవ్వరూ ఈ సమస్య నుంచి మనల్ని కాపాడలేరు’ అని అమ్మావాళ్ళకి ధైర్యం చెబుతూ ఉండేదాన్ని. ఇంకా, “బాబా! ఈ సమస్యల నుంచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా బయటపడేస్తారని తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకునే శక్తిని, నీపైన పూర్తి నమ్మకాన్ని మాకు ప్రసాదించు బాబా. ఎటువంటి సమస్యలైనా సరే, నిన్ను శరణువేడితే వాటిని వెంటనే పరిష్కరిస్తావు కదా బాబా! అన్నయ్యకి కూడా ఒక మంచి ఉద్యోగం త్వరగా వచ్చేలా అనుగ్రహించు. భారమంతా నీ మీదే వేస్తున్నా తండ్రీ, మమ్మల్ని కాపాడు” అని బాబాను ఎల్లప్పుడూ వేడుకునేదాన్ని. చివరికి బాబా మా మొర ఆలకించి అన్నయ్యకి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేట్లు చేశారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. కరుణామయుడైన బాబాకు కోటి కోటి నమస్కారాలు. “బాబా! ఇలాగే ఎల్లప్పుడూ అందరిపైనా దయచూపించి అందరినీ అన్నివిధాలుగా కాపాడు తండ్రీ. వర్క్ విషయంలో అన్నయ్య కొంచెం టెన్షన్ పడుతున్నాడు కదా బాబా. తను ఏ టెన్షన్ లేకుండా వర్క్ బాగా చేసుకునేలా ఆశీర్వదించు తండ్రీ!”.

 

ఉద్యోగం వచ్చాక మొదటి నెల జీతం రావడంలో కొంచెం ఆలస్యం అయింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, మళ్ళీ మమ్మల్ని పరీక్షిస్తున్నావు తండ్రీ. నువ్వు పెట్టే పరీక్షలకు తట్టుకొని నీపైన నమ్మకం మరింత దృఢపడేలా మమ్మల్ని అనుగ్రహించు బాబా. ఏ ఇబ్బందీ లేకుండా అన్నయ్యకి జీతం వస్తే మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. ఆలస్యం అయినప్పటికీ బాబా దయతో అన్నయ్యకి జీతం వచ్చింది. ఆనందంగా బాబాకు నమస్కరించుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “బాబా! అమ్మ, నాన్న, అన్నయ్య ఎప్పుడూ నీ నామాన్ని స్మరిస్తూ సంతోషంగా ఉండేలా చూడు బాబా”.


రెండవ అనుభవం: 2021, ఆగస్టు 8వ తేదీ రాత్రి మా అమ్మ తనకు బాగా తలనొప్పి, ఒళ్ళునొప్పులతో పాటు జ్వరంగా కూడా ఉందని చెప్పింది. మొదట నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ వెంటనే బాబా నామస్మరణ చేసుకుంటూ, “బాబా! అమ్మకి ఏ సమస్యా లేకుండా అన్ని లక్షణాలు తగ్గిపోతే మీ బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను” అని వేడుకున్నాను. కరుణామయుడైన బాబా ఎంతో ప్రేమతో అమ్మకున్న ఆ లక్షణాలన్నిటినీ మరునాటి ఉదయానికల్లా తగ్గించేశారు


“బాబా! ఇలాగే నీ ప్రేమని, దయని ప్రతి ఒక్కరిపైనా ఎల్లవేళలా చూపుతూ అందరినీ కాపాడు తండ్రీ. నీ నామాన్ని ప్రతి ఒక్కరం ఎప్పటికీ స్మరించుకునే అదృష్టాన్ని ప్రసాదించు బాబా. ఈ కరోనా సమస్యని పూర్తిగా తొలగించు తండ్రీ”.


శ్రీసాయినాథార్పణమస్తు!

సమస్త లోకాః సుఖినో భవంతు.


నిద్రలేచేసరికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా


సోదరభావంతో తోటి సాయిభక్తులకు బాబా ప్రసాదించిన తమ అనుభవాలను పంచుకునేందుకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నా పేరు బాలాజీ. నేనొక సాయిభక్తుడిని. ఇంతకుముందు నేను నా అనుభవాలను కొన్నిటిని మీతో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, జూలై నెలలో ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నాకు ఒళ్లునొప్పులుగా అనిపించింది. అర్థరాత్రి సమయంలో జ్వరం ఉన్నట్లుగా కూడా అనిపించింది. వెంటనే నేను కొద్దిగా బాబా ఊదీని తీసుకుని నుదుటన పెట్టుకొని, మరికొంత ఊదీని నోటిలో వేసుకుని, "బాబా! నా విషయంలో జాగ్రత్త తీసుకోండి. నేను ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మన ప్రియమైన సాయినాథుని ప్రార్థించాను. అత్యంత ఆశ్యర్యమేమిటంటే, ఉదయం నిద్రలేచేసరికి నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఒళ్లునొప్పులుగానీ, జ్వరం లక్షణాలుగానీ లేవు. బాబాకు వాగ్దానం చేసినట్లు నా ఈ అనుభవాన్ని సోదరభావంతో ప్రియమైన మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ప్రణామాలు సాయీ".


ప్రార్థించినంతనే శ్వాస సమస్యను తగ్గించిన సాయి

సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నేను చాలా రోజులుగా మానసిక వ్యధని అనుభవిస్తున్నాను. దాని మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నాను. ఈమధ్యకాలంలో చాలా టెన్షన్ పడడం వలన నాకు శ్వాస తీసుకోవడం చాలా కష్టం అయింది. ఏ సమస్య వచ్చినా సాయితో చెప్పుకునే అలవాటున్న నేను సాయికి నమస్కరించుకుని, "సాయీ! నాకొచ్చిన ఈ కష్టం నుంచి కాస్త ఉపశమనం కలిగించండి. మీ అనుగ్రహంతో నాకు ఉపశమనం కలిగితే నా అనుభవాన్ని  బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. అలా సాయిని ప్రార్థించినంతనే నా శ్వాస సమస్య తగ్గిపోయింది. "శతకోటి వందనాలు సాయీ. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. మమ్మల్ని సదా కాపాడుతూ ఉండు సాయితండ్రీ. ఈ మానసిక వ్యధ నుంచి నువ్వే నన్ను కాపాడాలి తండ్రీ".


7 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺😃🌹🌸🌼🥰🌿

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba nannu enka pariksha pettaku sai thandri tattukolenu

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba karthik, santosh health bagundali thandri please

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo