1. నా జీవితంలో బాబా అనుగ్రహం
2. ఏ కష్టమొచ్చినా దయతో పరిష్కరించే బాబా
3. సయాటికా నొప్పి నుండి ఉపశమనం కలిగించిన బాబా
నా జీవితంలో బాబా అనుగ్రహం
సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ముందుగా నా నమస్కారాలు. నా పేరు నీలిమ. మేము విజయనగరం వాస్తవ్యులం. సాయితో నా పరిచయం మరియు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తులతో పంచుకుంటున్నాను. ఊహ తెలిసే పసిప్రాయంలో నేను సాయిని ‘మా తాతగారు’ అనుకునేదాన్ని. అప్పటికి సాయి దైవస్వరూపులని నాకు తెలియదు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను సాయిని చూడలేదుగానీ, భక్తులు ఆనందోత్సాహాలతో చేస్తున్న రథోత్సవము చూశాను. బహుశా అది 'సాయిబాబా చావడి ఉత్సవం' అయివుంటుందని అనుకున్నాను. తర్వాత అనుకోకుండా శిరిడీ ప్రయాణమయ్యాను. శిరిడీ దర్శనంతో నా మనస్సులో ఆలోచనలు మారిపోయాయి. 'ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది, బాబా సేవ చేసుకుంటూ ఉండొచ్చు కదా!' అని అనిపించింది. ఆ విధంగా నేను బాబాకు దగ్గరయ్యాను. శిరిడీ నుండి వచ్చిన తర్వాత నెమ్మదిగా సాయిబాబాను పూజించడం, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. మనసులో 'సాయి, సాయి' అని సాయిని తలుచుకుంటూ ఉండేదాన్ని. ఇలా నా జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన నన్ను సాయికి ఇంకా ఇంకా చేరువయ్యేటట్లు చేశాయి.
నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకసారి అకస్మాత్తుగా మా పెద్దపాపకు ఫిట్స్ వచ్చాయి. అప్పుడు నేను, "పాప ఆరోగ్యం కుదుటపరచమ"ని బాబాను ఎంతో ఆర్తిగా వేడుకున్నాను. బాబా దయతో తనకు నయమైంది. మొదటి కాన్పు జరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అయినందువల్ల రెండవ కాన్పుకి ముందు ‘ఈసారి కాన్పు కూడా సీరియస్ అవుతుందేమో’నని నాకు భయం వేసింది. నిజానికి నేను ఆ సమయంలో చాలా మానసిక ఆందోళనలో ఉన్నాను. కాలేజీలో లెక్చరర్‌గా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ‘మీరు ఎలిజిబుల్ కాద’ని కాలేజీ యాజమాన్యం నాకు టర్మినేషన్ లెటర్ ఇచ్చింది. అన్ని సంవత్సరాలు పనిచేశాక ఉద్యోగానికి అనర్హురాలినని అనేసరికి నేను బాధపడ్డాను, మానసికంగా చాలా సంఘర్షణకు గురయ్యాను. అదేమైనా నా గర్భం మీద ప్రభావం చూపిస్తుందేమోనని భయాందోళనలకు గురయ్యాను. అందువలన ప్రతిక్షణమూ 'సాయి, సాయి' అని స్మరిస్తూ, "నువ్వే మార్గం చూపు తండ్రీ" అంటూ ఏడవని రోజు లేదు. నేను భయపడినట్లే కాన్పు సమయంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి చాలా ఇబ్బందికి గురయ్యాను. కానీ బాబా ఉన్నారని ధైర్యంగానే ఉన్నాను. బాబా కృపవల్ల డాక్టర్స్ వెంటనే ఆక్సిజన్ సిలెండర్ అమర్చడంతో క్షణాల్లో సమస్య పరిష్కారమైంది. సాయి పట్ల కృతజ్ఞతతో నాకు పుట్టిన పాపకు 'సాయిజోష్నిక' అని పేరు పెట్టుకున్నాను. "బాబా! నాకున్న ఒక కోరిక మనోవేదన రూపంలో నన్ను తినేస్తోంది. ఎన్నో కష్టాలుపడ్డాక నన్ను నేను నిరూపించుకోవాలని గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను. కానీ నేను చదువుతున్నా నాకు ఎక్కడం లేదు. పిల్లలతో కష్టంగా ఉంది బాబా. నేను అశక్తురాలిని తండ్రీ! మీ కృప లేనిదే ఏమీ జరగదు. నా బాధను ఈ బ్లాగ్ ద్వారా మీతో విన్నవించుకుంటూ భారమంతా మీ మీద వేస్తున్నాను. నా కోరిక నెరవేరేటట్టు చూడండి. మీ మీదే ఆధారపడి ఉన్న నన్ను మీరే ఆదుకోవాలి తండ్రీ".
ఏ కష్టమొచ్చినా దయతో పరిష్కరించే బాబా
ముందుగా సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.
మేము యూరప్‌లో నివసిస్తున్నాము. మాకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన పేరు సాయి. ఇండియాలో ఉన్నప్పుడు తను బాగా ఆటలాడుతూ, బాగా అల్లరి చేస్తూ అరుస్తూ ఉండేవాడు. ఇండియాలో తన ప్రవర్తన ఎలా ఉన్నా ఏ ఇబ్బందీ లేదు. కానీ ఇక్కడికి వచ్చాక మా పక్కింటివాళ్లు బాబు అల్లరి గురించి ఇంటి ఓనరుకి కంప్లైంట్ చేశారు. దాంతో మా ఇంటి ఓనరు మాతో, "మీ బాబుని అదుపు చేయండి. లేదంటే వేరే ఇల్లు చూసుకోండి" అని అన్నారు. నిజానికి ఈమధ్యనే మేము ఆ ఇంటికి వచ్చాము. మళ్లీ అంతలోనే వేరే ఇల్లు అంటే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా ఇక్కడ ఇల్లు దొరకడం అంత తేలిక కాదు. నా భర్తకి ఉద్యోగం లేని కారణంగా అది ఇంకా కష్టమవుతుంది. పోనీ బాబుకి ఏదైనా చెబుదామంటే, తను పసివాడు, ఏమీ తెలియని వయస్సు. ఏమి చెప్పి తనని అదుపులో పెట్టగలం? అందువల్ల నాకు చాలా భయం వేసింది. కానీ నేను బాబానే నమ్ముకున్నాను. నాకు ఆయనే సర్వస్వం. అందుకే నేను, "బాబా! దయతో బాబు అల్లరి, అరుపులు కొంచెం తగ్గించి ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబు కొంచెం అదుపులోకి వచ్చాడు. "ధన్యవాదాలు బాబా. నాకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది బాబా. అన్ని నువ్వే చూసుకోవాలయ్యా. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు. నాకు ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయో తెలియదు. నా తప్పులు నాకు తెలిసేలా చేసి పరిష్కారం చూపించండి సాయీ".
రెండు నెలల క్రితం నేను వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఇంటర్నెట్‌లో వ్యాక్సిన్‌కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి వెతుకుతున్నప్పుడు ‘వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత నెలసరికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ’ని చూశాను. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అలాంటివేమీ ఉండవని మెన్షన్ చేసింది. కాబట్టి నేను భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకున్నాను. కానీ, తరువాత రెండు నెలల వరకు నెలసరి విషయంలో నాకు సమస్య ఎదురైంది. దాంతో మేము కొంచెం భయపడి డాక్టరుని కలిశాము. నాకు బ్లడ్ టెస్ట్ చేసి, "బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఎదురైంది" అని చెప్పి, మళ్లీ రమ్మన్నారు. మళ్లీ వెళ్ళినప్పుడు ఏ ట్యాబ్లెట్లు ఇస్తారో అని నాకు భయం వేసింది. అంతేకాదు, ‘ట్యాబ్లెట్ల వలన కాస్త అసౌకర్యంగా ఉంటుంద’ని ఒక భక్తురాలు ఈ బ్లాగులో పంచుకున్నారు. అందువల్ల ట్యాబ్లెట్లు వాడటం ఇష్టం లేక బాబాకు నమస్కరించుకుని, “మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు నాకు నెలసరి రావాలనీ, అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”నీ అనుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ అపాయింట్‌మెంటుకి నాలుగు రోజుల ముందు నాకు నెలసరి వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నా పేరు వెంకటేశ్వర్లు. నేను 20 సంవత్సరాల నుంచి సాయిభక్తుడిని. సాయిబాబా అనుగ్రహంతో మాకు చాలా మంచి అనుభవాలు కలిగాయి. 10 సంవత్సరాల క్రితం నా భార్యకి సయాటికా నొప్పి వచ్చి నడవలేని పరిస్థితి ఏర్పడింది. 16 రోజులు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించినప్పటికీ ఆ బాధనుండి తనకి ఉపశమనం కలగలేదు. అలాంటి స్థితిలో, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలనిపించి మేము శిరిడీ వెళ్ళాము. నేను, నా కొడుకు కలిసి మా చేతులమీద నా భార్యని కూర్చుండబెట్టుకుని బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాం. బాబా మాకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. కొన్నాళ్ళకి మరోసారి శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అనుగ్రహంతో నా భార్య ఎవరి సహాయం లేకుండా తనంతట తానే బాబా దర్శనం చేసుకుంది. బాబాకి మేము చాలా ఋణపడివున్నాము. ఇలా మా జీవితాలలో ఎన్నో సమస్యలను పరిష్కరించారు బాబా. మా ఇంట్లో చాలావరకూ అన్ని పనులూ బాబా అనుగ్రహంతో గురువారంరోజే జరుగుతాయి. ఇటీవల బాబా అనుగ్రహంతో మా పాప ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. 2021, ఆగస్టు 12, గురువారంనాడు పాపకి 2021, ఆగస్టు 19న ఎంసెట్ పరీక్ష ఉందని మాకు తెలిసింది. పరీక్ష వ్రాయల్సినరోజు కూడా గురువారం కావడం విశేషం. పాపకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చి, మంచి కాలేజీలో సీటు వచ్చేలా కృపతో అనుగ్రహించమని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌹🥰😃🌸🌼🌺
ReplyDelete🌺🌼🙏🙏🙏🙏🙏🌺🌼 Om Sri Sairam
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh, karthik health bagundali thandri
ReplyDeleteBaba hospital anta bayanga vundhi baba
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteBaba, Babu exams results repu kani, marnadu kani publish chestaru. Dayachesi vadu pass ayyela karunichu thandri. Om Sri Sai Ram ��������
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete