1. సాయి మహరాజు ప్రేమ
2. బాబాను తలిస్తే చాలు - నీడలా ఉంటూ కాపాడుతారు
సాయి మహరాజు ప్రేమ
సాయిబంధువులందరికీ నా ప్రణామాలు. నా పేరు వాణి. నేను పదవ తరగతిలో ఉండగా ఒక సినిమా ద్వారా సాయినాథుని గురించి తెలుసుకున్నాను. అప్పటినుండి సాయినే నమ్ముకుని నాకు తెలిసినంతలో ఆయనని పూజిస్తున్నాను. ఇరవై ఏళ్ళ తరువాత అనుకోకుండా ఫోన్ ద్వారా నా ఫ్రెండుని కలుసుకున్నాను. తన ద్వారా ఈ బ్లాగ్ గురించి, అందులో విషయాల గురించి తెలిశాయి. నేను ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలన్నీ చదివి పడుకుంటాను. ముందుగా, చాలాకాలం క్రితమే నా అనుభవాలను వ్రాయాలనుకుని ఆలస్యం చేసినందుకు సాయినాథునికి క్షమాపణలు చెప్పుకుని నా అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను.
2020 అందరికీ చాలా భయానకంగా గడించింది. అందులో నేనూ ఒకదాన్ని. ఎంతోమందిపై తన ప్రభావాన్ని చూపిన కరోనా మహమ్మారి మావారిని కూడా వదలలేదు. అయితే చాలా స్వల్పంగా ఎటాక్ అయింది. మేము చాలా భయపడ్డాము. మేము ప్రతిరోజూ మావారి నుదుటన బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఆ తీర్థాన్ని మూడుపూటలా ఇస్తుండేవాళ్ళం. మందులన్నీ కూడా ఊదీ తీర్థంతోనే ఇచ్చేవాళ్ళం. ఊదీ మహాత్మ్యం వల్ల మావారికి తొందరగానే కరోనా తగ్గిపోయింది, పెద్దగా ఇబ్బందిపెట్టలేదు.
2021లో మా పాపకి జ్వరం వచ్చింది. దానికి తోడు తను రాత్రంతా కడుపునొప్పితో బాధపడింది. అది కరోనా సమయం అయినందున మాకు చాలా భయం వేసింది. సాయినాథుని తలచుకుని ఊదీ కలిపిన తీర్థాన్ని తనకు ఇచ్చాను. అంతేకాదు, "ఈ జ్వరం మామూలు జ్వరమే అయుండాలి బాబా" అని అనుకున్నాను. అయితే, మరుసటిరోజు అది టైఫాయిడ్ జ్వరం అని తెలిసింది. కానీ మీరు నమ్మరుగానీ, ఒక్కరోజు డోసుతోనే జ్వరం తగ్గిపోయింది. మాములుగా అయితే టైఫాయిడ్ తగ్గడానికి వారం రోజులు పడుతుంది. అలాంటిది సాయినాథుని తలచుకోగానే ఆయన మా పాపని ఎక్కువ ఇబ్బందిపడనీయకుండా కాపాడారు. ఆ సాయినాథుని చల్లని చూపు అందరిమీదా ఇలానే ప్రసరించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఒకరోజు నేను పూజ చేస్తూ అమ్మవారి ఫోటో వంక దీక్షగా చూశాను. ఆ ఫోటోలో ప్రతిబింబిస్తున్న దీపం వెలుగులో సాయి రూపం కనిపిస్తున్నట్లు అనిపించింది. చాలా పరీక్షగా గమనించాక స్పష్టంగా బాబా రూపు కనిపించడంతో నన్ను నేను నమ్మలేకపోయాను. ఆరోజు ఆనందించినంతగా నేనెప్పుడూ ఆనందించలేదు. ఆ ఫోటోను ఇక్కడ జతపరుస్తున్నాను. సాయిని తలచుకుని పరీక్షగా చూడండి. "ధన్యవాదాలు బాబా".
సర్వేజనాః సుఖినోభవంతు
లోకాః సమస్తాః సుఖినోభవంతు.
బాబాను తలిస్తే చాలు - నీడలా ఉంటూ కాపాడుతారు
నా పేరు చంద్రకళ. నేను తెలంగాణలోని కరీంనగర్ నివాసిని. ముందుగా సద్గురు సాయినాథునికి నా ప్రణామాలు. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా తండ్రి ద్వారా నాకు సాయిబాబా పరిచయం. అయితే, మొదట్లో నేను మామూలుగా బాబాకు నమస్కరించేదాన్ని, అంతే. కానీ ఇప్పుడు ప్రతి విషయంలోనూ బాబా నన్ను కాపాడుతున్నారని అర్థం అయింది. రెండు సంవత్సరాల క్రితం నా భర్త కడుపునొప్పితో చాలా బాధపడ్డారు. డాక్టర్ల దగ్గరకు వెళితే, "కిడ్నీలో రెండు రాళ్లున్నాయి. అవి చాలా పెద్దగా ఉన్నందున సర్జరీ తప్పద"ని చెప్పారు. నేను చాలా భయపడి మనస్ఫూర్తిగా బాబాకు మ్రొక్కుకున్నాను. ఒకరోజు రాత్రి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, "రెండు రాళ్ళున్నాయి కదా, నేను తీసేస్తాను" అని చెప్పారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది. ముందు నాకేమీ అర్థం కాలేదుగానీ, కొంతసేపటికి అర్థమై చాలా సంతోషించాను. కానీ ఈ సంగతి ఎవరికి చెప్పినా నమ్మరని మౌనంగా ఉండిపోయాను. తరువాత ఇంకో డాక్టర్ వద్దకు నా భర్తను తీసుకుని వెళ్ళాను. ఆ డాక్టర్ టెస్టులన్నీ చేసి, 10 రోజులకు మందులిచ్చి, "ఈ మందులతో తగ్గకపోతే సర్జరీ తప్పద"ని అన్నారు. నేను మావారికి ఆ మందులతోపాటు బాబా ఊదీతీర్థాన్ని ఇవ్వసాగాను. 10 రోజుల తరువాత మావారికి మళ్ళీ టెస్టులు చేయించి, ఆ రిపోర్టులను డాక్టరుకి చూపిస్తే, అతను సంతోషంగా నవ్వుతూ, "రెండు రాళ్ళూ కరిగిపోయాయి" అని చెప్పారు. ఆ విధంగా బాబా కృపవలన నా భర్త ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🌺🥰🌹😀🌸😊🌼
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni medicine tho tondarga karginchu thandri pleaseeee
ReplyDeleteBaba ma brother interview lo select ayina kani promotion vere vallaki vachindi dayachesi vadiki epichandi baba
ReplyDeleteBaba naku menalludu ni prasadinchu thandri
ReplyDeleteBaba pillalu health bagundali thandri
ReplyDeleteSai mammalani challaga Kapaadu thandri .Om sai Sri sai Jaya Jaya sai 🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteSai thandri maa babuku thondaraga job vachetattu chudu thandri
ReplyDelete