1. కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబా
2. ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు సాయితండ్రి3. బాబా దయతో ఎటువంటి నిబంధనలూ లేవు
కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబా
అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. కష్టకాలంలో బాబా సదా నాకు తోడుగా ఎలా ఉన్నారో తోటి భక్తులతో పంచుకోవాలని నేనీరోజు మీ ముందుకు వచ్చాను. నేను యు.ఎస్.ఏ లో ఉంటున్నాను. నా భర్త ఉద్యోగరీత్యా ఇటీవలే మేము ఇక్కడికి వచ్చాము. 2021, జూలై 16 వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నాకు ఉన్నట్టుండి చాలా అసౌకర్యంగా అనిపించింది. నా శరీరంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. నా నాలుక మీద లాలాజలం అంటూ లేకుండా ఎండిపోయింది. దానివల్ల తిన్నది మింగడానికి కూడా కష్టపడుతూ నేను చాలా నరకం చూశాను. నాకు ఆ సమస్య రావడం అదే మొదటిసారి. ఇక్కడ హాస్పిటల్స్ అంతగా అందుబాటులో ఉండవు. రెండు రోజులు ఎలాగో తట్టుకున్నాను. కానీ నా నాలుక ఏ మాత్రం లాలాజలాన్ని స్రవించకపోవడం వల్ల, అనుభవిస్తున్న నరకాన్ని భరించలేక ఒకరోజు అర్థరాత్రి మేము ఎమర్జెన్సీకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా నాకు ఎటువంటి ఆశా కనిపించలేదు. అయినా కూడా వాళ్ళు ఎమర్జెన్సీ బిల్లు అని చాలా వేశారు. అప్పుడు నేను, "బిల్లులో సగం ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టి, మిగిలింది మాకు పడేలా చేయమ"ని బాబాని మ్రొక్కుకున్నాను. బాబా నా మొర విని, మాకు సగం బిల్లు వచ్చేలా చేశారు. నా సమస్యకు చికిత్స నిమిత్తం మేము మొత్తం ఐదుసార్లు హాస్పిటల్‌కి వెళ్ళాము. ప్రతిసారీ వాళ్ళు అన్ని టెస్టులూ చేస్తుండేవాళ్లు, నేను రిపోర్టుల విషయంలో చాలా భయపడుతూ ఉండేదాన్ని. కానీ బాబా దయవల్ల రిపోర్టులు సానుకూలంగా వచ్చేవి. కానీ నా సమస్య తీరలేదు. మూడు వారాలపాటు ఘనపదార్థాలు తీసుకోకుండా కేవలం ద్రవాహారమే తీసుకుంటూ బ్రతుకు సాగించాను. ఒకసారి బాబా ముందు, "తిండి కూడా తినలేని దుస్థితి నాకు పట్టింది. ఎందుకు నాకీ నరకాన్ని ఇచ్చావు?" అని చాలా ఏడ్చాను. ఈ కష్టకాలంలో, "నీ ఆరోగ్య సమస్య బాగవుతుంది" అని బాబా నాకు చాలాసార్లు మెసేజ్‌ల రూపంలో సమాధానమిచ్చారు. అది చూసినప్పుడు సంతోషంగా ఫీలయ్యేదాన్ని, కానీ ఆ నరకాన్ని భరించలేకపోయేదాన్ని. యు.ఎస్.ఏ వచ్చాక నేను అప్పుడప్పుడు వైన్ త్రాగేదాన్ని. ఒకరోజు బాబాతో, "వైన్ త్రాగటం మానేస్తాను, పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. అంతేకాదు, నేను ఏదో యూట్యూబ్ ఛానల్‌లో దత్త స్తవనం యొక్క గొప్పతనం గురించి విని 11 రోజులపాటు రోజుకు తొమ్మిదిసార్లు దత్త స్తవనం పారాయణ చేశాను. అది చదవడం మొదలుపెట్టాక ఘనపదార్థాలు తినే శక్తిని ఇచ్చాడు ఆ భగవంతుడు. దత్త స్తవనం చదివిన చివరిరోజు, అంటే 11వ రోజు నేను ఎలాంటి భయం లేకుండా ఆహారం తినగలిగాను. అయితే, ఆ సమయంలో నా మనసు నిలకడగా లేనందున నిశ్చలమైన మనస్సుతో పారాయణ చేయలేదు. అందుకు నా మనసులో ఉన్న బాధ భగవానునికి తెలుసు. 11 రోజులు చదివినదానికి మంచి జరుగుతుందని మనసులో ఏదో మూల ఉన్న నమ్మకంతో చదివాను. దాని ఫలితమే ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది. అందుకే అన్నారు 'స్మరణమాత్రేణ సంతుష్టయ' అని.
ఒకరోజు నేను బాధని భరించలేక బాబా ముందు తల బాదుకున్నాను. సరిగా అప్పుడే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో, "నేను తోడుగా లేకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది" అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు బాబా నా ప్రతి మాటి వింటున్నారని, నా కర్మఫలాన్ని నేను అనుభవించాలని నాకు అర్థమై నిత్యమూ బాబాని, దత్తదేవుని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 40 రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాను. అయితే, ఇప్పటికీ రాత్రిళ్ళు కొంచెం ఇబ్బందిపడుతున్నాను. దాన్ని కూడా బాబా, దత్తస్వామి తొలగిస్తారని భావిస్తున్నాను. "మనం అనుభవించాల్సింది అనుభవించక తప్పద"ని బాబా అంటారు కానీ, బాబా మనకు తోడుగా ఉండి, దానిని భరించగలిగే శక్తిని ఇస్తారు. అవసరమైతే మన బాధని ఆయన స్వీకరిస్తారు. నేను ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి మాటిచ్చాను. అలానే, ఇంతటి నరకాన్ని ఎవరికీ ఇవ్వొద్దని వేడుకున్నాను. ఎలా రాయాలో తెలియక నా మనసులో ఉన్నది రాశాను. తప్పులు ఉంటే మన్నించండి. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి’ని నడిపిస్తున్న అన్నయ్యకి సదా బాబా ఆశీస్సులు ఉంటాయి.
ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు సాయితండ్రి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!
ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను తెలియపరుస్తున్నాను. నా పేరు చక్రవర్తి. నేను రోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే తోటి సాయిభక్తుల అనుభవాలన్నీ చదువుతుంటాను. అలా చదువుతున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చి, 'ప్రతి సాయిబంధువూ ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని మనసులో అనుకోగానే బాబా వారి సమస్యను తీరుస్తున్నారు. అలా అనుకోకపోతే వారి సమస్య తీరదా బాబా?' అని అనుకున్నాను. తరువాత ఒకరోజు నేను 2004 సంవత్సరం మోడల్ బండి మీద వేరే ఊరికి వెళ్తున్నాను. దారిలో ఉన్నట్టుండి నా బండి ఆగిపోయింది. ఒకప్రక్క వర్షం పడుతోంది. పదినిమిషాల పాటు నేను ఎంత ప్రయత్నించినా బండి ఇంజన్ ఆన్ అవలేదు. వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చి, "బాబా! నా బండి స్టార్ట్ అయ్యేలా చూడు తండ్రీ. నా అనుభవాన్ని మీ బ్లాగ్ ద్వారా సాటి సాయి గురుబంధువులతో పంచుకుంటాను" అని అనుకుని, నా నుదుటన ఉన్న సాయిబాబా శిరిడీ ఊదీని(బాబా పాదధూళి) బండికి పెట్టాను. వెంటనే నా బండి స్టార్ట్ అయ్యింది. ఇది బాబా చేసిన అద్భుతం. నా మనసులో కలిగిన సందేహానికి బాబా ఈ విధంగా సమాధానమిచ్చారు. మీరు కూడా మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ బ్లాగ్ చాలా మహిమ గలది.
మరో అనుభవం: లాక్‌డౌన్ సమయంలో నా దగ్గర ఉండాల్సిన శిరిడీ నుండి తెచ్చుకున్న ఊదీ(బాబా పాదధూళి) అంతా అయిపోయింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! నా దగ్గర ఊదీ అయిపోయింది. నా పిల్లలకు ఏ ఆరోగ్య సమస్యలొచ్చినా నీ పాదధూళినే వాడుతాను. అలాంటిది ఇప్పుడు నా దగ్గర నీ పాదధూళి అయిపోయింది బాబా" అని అనుకున్నాను. తరువాత ఒకరోజు నేను బజారుకి వెళ్తుంటే, శిరిడీ ఊదీ పొట్లం ఒకటి రోడ్డు మీద నాకు దొరికింది. లాక్‌డౌన్ సమయంలో శిరిడీ ఊదీ రోడ్డు మీద దొరకడం ఒక్కసారిగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. బాబా భక్తులైన ప్రతి ఒక్కరికీ బాబా పాదధూళి యొక్క మహిమ తెలుసు. అది వెలకట్టలేనిది. అంతటి అమూల్యమైన దానిని ఎవరు నిర్లక్ష్యంగా పారవేసుకుంటారు? నా అవసరాన్ని, బాధను గుర్తించిన బాబానే స్వయంగా నాకోసం వచ్చి ఆ ఊదీ పొట్లాన్ని నాకు అందించారు. లేకపోతే, 'శిరిడీ ఊదీ' రోడ్డు మీద దొరకడం ఏమిటి? బాబా ఇవ్వలేనిది లేదు. ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు నా సాయితండ్రి. అవసరమైతే మన విధివ్రాతను కూడా మార్చగల సద్గురువు నా సాయితండ్రి. "సృష్టిలో అన్ని రూపాలూ నేనే" అని చెప్పిన పరబ్రహ్మ స్వరూపం నా సాయితండ్రి. 'సాయిబాబా' అనే నామాన్ని నిరంతరం జపించండి. ఎలాంటి ఆపదలూ మన దరిచేరవు.
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!
సాయిబాబా సాయిబాబా సాయిబాబా!!!
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🥰🌺😀🌼🤗🌹😊🌸
ReplyDeleteJaisairam bless amma for her eye operation. Bless me with my family and my health issues. Sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeletePlease provide me a permanent job in satyanarayana swamy temple @ Annavaram.
ReplyDeleteThen I will also share my experience in this blog.
Thank you.
Om Sairam.
Om sai Sri sai Jaya Jaya sai 🙏🙏🙏
ReplyDeleteEven though I don't often comment on blogs, I found your article convincing enough to make me want to write. Keep up the excellent work. Keto Strong
ReplyDeleteOm sai ram baba na samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete