సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 891వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తున్న బాబా
2. బాబా పెట్టిన భిక్ష
3. బాబాను వేడుకుంటే చాలు

ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తున్న బాబా


ముందుగా, సాయిభక్తులకు మరియు భక్తి, శ్రద్ధలతో ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. మాకు సంవత్సరం పదకొండు నెలల వయసున్న చిన్న బాబు ఉన్నాడు. ఒకరోజు వాడు తలుపు దగ్గర ఆడుకుంటూ ఉంటే, నేను చూసుకోకుండా తలుపు వేసినందువల్ల తన చేతులకి గాయమైందనీ, బాబా దయతో తనకు ఆ బాధనుండి ఉపశమనం కలిగిందనీ నేను నా గత అనుభవంలో పంచుకున్నాను. మా దురదృష్టం కొద్దీ కొన్నిరోజుల తరువాత మళ్లీ అటువంటి ఘటనే జరిగింది. ఈసారి బాబు ఆడుకుంటూ తనంతట తానే తలుపు సందులో చేతులు పెట్టేశాడు. దాంతో వాడి లేలేత చేతులు కమిలిపోయాయి. బాబు బాధతో ఆ రాత్రి బాగా ఏడుస్తూ ఉంటే, మా ఇంటి క్రింద పోర్షన్‌లో అద్దెకు ఉన్నవాళ్లు ఇంటి యజమానికి ఫిర్యాదు చేశారు. చిన్న పిల్లాడు కావడం వల్ల మేము ఏమీ చేయలేకపోయాము. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబు త్వరగా ఏడుపు ఆపేసి పడుకోవాలి. ఇంకా, రేపటికల్లా తనకి నొప్పి తగ్గిపోతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబు కొద్దిసేపట్లో నిద్రపోయాడు. మరుసటిరోజుకి నొప్పి పూర్తిగా తగ్గలేదు గానీ, బాబుకి ఇబ్బంది లేకుండా అనుగ్రహించారు బాబా. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


ప్రతి ఆరు నెలలకొకసారి మేము మా బాబుని జనరల్ చెకప్ (హైట్, వెయిట్, హెడ్ చెకప్) కోసం హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలి. ఇటీవల మేము తనని సాధారణంగా ఎప్పుడూ తీసుకుని వెళ్లే హాస్పిటల్‌కి కాకుండా వేరే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ జనం ఎక్కువగా ఉంటారు. అదీకాక మేము రానూపోనూ ట్రామ్‌లో ప్రయాణించాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల చిన్న బాబుతో జనం మధ్య సంచరించడానికి భయమేసి, "ప్రయాణంలోనూ, అలాగే హాస్పిటల్లోనూ ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మనసులోనే బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా రాలేదు. "థాంక్యూ బాబా".


నాలుగు రోజుల తర్వాత నా భర్త వేరే ప్రాంతానికి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయనకి ఉద్యోగం లేని కారణంగా కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన పనిమీద ఆయన తప్పనిసరై చాలాదూరం వెళ్లారు. అప్పుడు నేను, "ప్రయాణంలో నా భర్తకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా భర్త ఎలాంటి సమస్యా లేకుండా ఇల్లు చేరారు. "థాంక్యూ బాబా! థాంక్యూ వెరీ మచ్".


బాబా పెట్టిన భిక్ష


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కళ్యాణి. మేము విజయవాడలో ఉంటాము. బాబా నా జీవితంలో చేసిన మేలును వర్ణించడానికి మాటలు లేవు. నాకు బాబా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుండి బాబా అంటే ఇష్టం ఉన్నా నేను బాబాను చేరుకోలేకపోయాను. నేను బాబాని తెలుసుకునేటప్పటికే చాలా సమయం పట్టింది. కానీ తక్కువ సమయంలోనే బాబా నన్ను ఎంతగానో దీవించారు. గత సంవత్సరం 2020లో దేశంలో కరోనా మొదటి దశ వ్యాపించి ఉన్నప్పుడు కరోనా సోకి మావారికి చాలా సీరియస్ అయింది. దాంతో నేను తనను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. మావారిని పరీక్షించిన డాక్టర్లు తన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందనీ, తనను ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనీ చెప్పారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను హాస్పిటల్లో. దిక్కుతోచని స్థితి. ఏం చేయాలో అర్థంకాక ఏడుస్తూ, బాబా నుండి వచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చుండిపోయాను. ఇంతలో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, “అమ్మా, మీవారికి ఏం కాదు. మీరు మీవారిని ఇంటికి తీసుకువెళ్ళండి. తనకు మందులతో తగ్గిపోతుంది” అని చెప్పారు. ఆ మాటను నేను బాబా మాటగా స్వీకరించి మావారిని ఇంటికి తీసుకొచ్చేశాను. ఆ తరువాత మా కుటుంబంలోని అందరికీ కరోనా ఎఫెక్ట్ అయింది. నేను, మావారు, మా అమ్మగారితో పాటు ఇద్దరు పెద్దవారు, నలుగురు పిల్లలతో సహా మొత్తం తొమ్మిదిమంది కుటుంబసభ్యులం కరోనా బారినపడ్డాము. నేను చాలా భయపడ్డాను. అసలు ఏం చేయాలో అర్థం కాలేని  స్థితి. అలాంటి స్థితిలో బాబా నాకు ధైర్యం చెప్పి నన్ను నిలబెట్టారు. బాబా దయవల్ల అందరి సహాయమూ మాకు లభించింది. మాకు కరోనా సోకిందని తెలిసి అందరూ మాకు ఫోన్ చేసి, “మీకోసం ఏం తీసుకురమ్మంటారు? మీకు ఏం కావాలో చెప్పండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేమున్నామ”ని మాకు ధైర్యం చెప్పినవారే. నిజంగా మాటల్లో చెప్పలేని అద్భుతం జరిగింది. మేము ఎవ్వరం హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి బాబా అనుగ్రహం వల్ల ఎలాంటి కీడూ లేకుండా కరోనా నుండి కోలుకున్నాము. ఇలా మా జీవితంలో బాబా చేసిన సహాయాలు ఒకటీ రెండూ కాదు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి బాబా నాకు ఇప్పుడు సమయాన్ని సందర్భాన్ని ఇచ్చారు.


బాబాను వేడుకుంటే చాలు


సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా నమస్కారాలు. ఇది నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న రెండవ అనుభవం. ఒకసారి నాకు కరోనా సోకితే బాబా నన్ను కాపాడారు. అలా కాపాడితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకుని, కోవిడ్ తగ్గగానే ఆ అనుభవాన్ని పంచుకున్నాను. మరుసటి వారం 2021, జులై నెల చివరిలో నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. "ఈసారి కూడా నన్ను కాపాడితే ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకుని, బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగి, బాబాను స్మరిస్తూ నిద్రపోయాను. బాబా కృపవలన తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది. కానీ, నేను నా అనుభవం పంచుకోవడంలో ఆలస్యం చేశాను. ఇంతలో నాకు వేరే ఆరోగ్య సమస్య తలెత్తింది. వెంటనే ఈ బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే, 'మ్రొక్కులు మ్రొక్కుకుని మర్చిపోతే కష్టాలు వస్తాయి' అనే అనుభవం ఓపెన్ అయింది. వెంటనే నా తప్పు తెలుసుకుని, అప్పటిదాకా బద్ధకించిన నేను నా అనుభవాన్ని బ్లాగువారికి పంపించాను. ఈ బ్లాగును స్వయంగా సాయిబాబానే నిర్వహిస్తున్నారని నాకనిపిస్తుంది. నా ప్రతీ సమస్యకు పరిష్కారాన్ని ఈ బ్లాగ్ ద్వారా బాబా సూచిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. దయచేసి నాకు త్వరగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. ప్లీజ్ బాబా, ప్లీజ్...".


11 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Baba I suffering family problems with my wife plz help me baba

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀🌸🌹🌼🌺❤😊

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Om sai ram baba ee gadda ni one week lo taggipovali thandri pleaseeee deva

    ReplyDelete
  6. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  7. Baba Santosh life bagundali thandri

    ReplyDelete
  8. Om sai ram baba helps all ways.lts wonder full god

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo