1. ప్రతి చిన్న విషయంలో శాంతపరుస్తారు బాబా
2. బాబా ఊదీతో పనిచేసిన ల్యాప్‌టాప్ & ప్రింటర్
3. సాయినాథుని నమ్మితే కష్టాలు తీరిపోతాయి
ప్రతి చిన్న విషయంలో శాంతపరుస్తారు బాబా
కలియుగంలో వెలసిన ప్రత్యక్షదైవం బాబా. ఆనాడు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారితో సహజీవనం చేసి వారి ప్రేమను, స్నేహాన్ని పొందిన భక్తుల అదృష్టమేమని చెప్పగలం? వాళ్ళు ధన్యజీవులు. నేను రాత్రి పడుకునేటప్పుడు, మధ్యలో మెలకువ వచ్చినప్పుడు, ఉదయం లేచేటప్పుడు బాబా చాలీసా చదువుకుంటాను. ఆ విధంగా నాకు బాబాతో చాలా అనుబంధం ఉంది. నా అనుభవాలు కొన్నింటిని ఎంచుకుని వాటి ద్వారా బాబా నన్ను ఎలా సంతృప్తిపరచారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను నా గత అనుభవంలో మా క్రొత్త ఇంటిలో చెమ్మలా వస్తే, పెయింటర్ లప్పం (రంధ్రాలను పూడ్చటానికి ఉపయోగించే పదార్థం) పెట్టి సరిచేశాడని చెప్పాను. అయితే, పెయింట్ వేశాక మళ్లీ చెమ్మ వచ్చింది. ఎంతో ఇష్టంగా తనకి నచ్చినట్లు అమర్చుకున్న ఇంటికి కొద్దిగా చెమ్మ రావడంతో మా అబ్బాయి నిరాశ చెందాడు. తన బాధ చూడలేక పాపం ఆ పెయింటర్ మళ్ళీ వచ్చి రిస్క్ తీసుకుని మరోసారి లప్పం పెట్టి పెయింట్ వేశాడు. అప్పుడు నేను, "బాబా! మళ్ళీ చెమ్మ రానివ్వకండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన ఎక్కువగా చెమ్మ రాకుండా చాలా లైట్‌గా మాత్రమే వచ్చింది. మా బాబు కాస్త తృప్తిచెందాడు. అపార్ట్‌మెంట్‌కి వచ్చినవాళ్లంతా, "అన్నీ చాలా చక్కగా ఎంపిక చేశావు, గుడ్!" అని మా బాబుని ప్రశంసించారు.
మా అబ్బాయికి కాబోయే భార్య వాళ్ళ అమ్మమ్మ ఈమధ్య కడుపునొప్పితో అనారోగ్యం పాలైంది. పెద్ద వయస్కురాలైన ఆమె వల్ల దగ్గర్లో ఉన్న మా అబ్బాయి పెళ్లికి ఆటంకం వస్తుందేమోనన్న భయంతో నేను బాబాకు నమస్కరించుకుని, "ఏ సమస్యా లేకుండా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా కరుణించారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు, "ఆమె కడుపులో గడ్డ ఉంది. కానీ అది ఆపరేషన్ లేకుండా మందులతో నయమవుతుంద"ని చెప్పి, ఆమెను మూడు రోజులు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు.
మాది ఉమ్మడి కుటుంబం. ఆగస్టులో మా అబ్బాయి పెళ్లి ఉండగా అదే నెలలో నెలలు నిండిన మా మరిది కూతురుకి కాన్పు ఉంటుందని డాక్టరు చెప్పారు. పురిటి మైల ఉంటుందని కొందరు, ఉండదని కొందరు మమ్మల్ని టెన్షన్ పెట్టారు. పురోహితుడిని అడిగితే, "మీకు మైల ఉండదు. ఆ అమ్మాయి వాళ్ళ అత్తింటివాళ్ళకి ఉంటుంద"ని చెప్పారు. అయినా నేను, "బాబా! ఆ అమ్మాయికి జులైలోనే కాన్పు అయ్యేలా చూడండి" అని బాబాను కోరుకున్నాను. బాబా ఎలా కరుణించారో చూడండి! ఆ అమ్మాయికి జులై 27నే కాన్పు అయ్యింది. సాయిబాబా నాకు ఇలాంటి సహాయాలెన్నో చేశారు. నేను ప్రతి చిన్నదానికీ టెన్షన్ పడి బాబాకి చెప్పుకుంటాను, ఆయన నన్ను శాంతపరుస్తుంటారు. "థాంక్యూ సో మచ్ బాబా. మాపై ఎల్లప్పుడూ ఇలాగే దయ ఉంచండి. నాకు అన్నీ మీరే బాబా. మీ ఆశీస్సులతో మా అబ్బాయి పెళ్లి బాగా జరిగింది బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".
సాయి సాయి సాయి సాయి....
బాబా ఊదీతో పనిచేసిన ల్యాప్‌టాప్ & ప్రింటర్
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా బాబాకి నా శతకోటి పాదాభివందనాలు. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాద్ నివాసిని. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. అయితే, కాస్త ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే... 2021, జులై 21న నా ప్రింటర్ పనిచేయలేదు. టెక్నీషియన్‌ను పిలిచి ప్రింటర్‌ను బాగుచేయించాను. కానీ అది మళ్లీ పనిచేయలేదు. తరువాత 2021, జులై 23న నా ల్యాప్‌టాప్ కూడా పనిచేయలేదు. ఆరోజు ఉదయాన్నే నేను ఆఫీసుకి వెళ్ళాను. మా ఆఫీసు దగ్గరికి ఒక స్వామి వచ్చి, నన్ను పదిరూపాయలు ఇమ్మని అడిగారు. నేను ఇస్తే తీసుకుని, ఆ పదిరూపాయలను అలాగే పట్టుకుని ఒక పువ్వు తీసి, నన్ను ఇంకో పదిరూపాయలు ఇవ్వమన్నారు. నేను ఇచ్చాను. అతను తన చేతిలో ఉన్న పువ్వును నల్లటి విభూతిగా మార్చేసి ఇంకో పదిరూపాయలు ఇవ్వమన్నారు. నేను సరేనని ఇచ్చాను. తర్వాత వారు ఒక రుద్రాక్షను, నల్లని విభూతిని నాకు ఇచ్చారు. ఆరోజు నేను ఇంటికి వచ్చి ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తే అది ఆన్ కాలేదు. ప్రింటర్ కూడా పనిచేయలేదు. అప్పుడు నేను కొద్దిగా బాబా ఊదీని తీసుకుని ల్యాప్‌టాప్‌కి, ప్రింటర్‌కి పెట్టి, అరగంట తర్వాత ఆ రెండింటినీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే రెండూ పనిచేశాయి. ప్రింట్ తీస్తే బాగానే వచ్చింది. గురుపౌర్ణమి ముందురోజే నాకు ఈ అనుభవం జరగడం సంతోషంగా అనిపించింది. నేను ఎప్పటికీ సాయికి ఋణపడివుంటాను. సాయినామాన్ని ఎప్పటికీ మరువను. నాకో కోరిక ఉన్నది. అది నెరవేరితే ఆ అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను. ప్రతిరోజూ ఉదయం నేను ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ఉంటాను. సాటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే, నిజజీవితంలో బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ, మన కోరికలను నెరవేరుస్తూ, మనకన్నీ సమకూరుస్తున్న అనుభూతి కలుగుతుంది. మనందరిపై బాబా కృప ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ...
జై సాయి, జై జై సాయి.
సాయినాథుని నమ్మితే కష్టాలు తీరిపోతాయి
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా పేరు శ్రీకాంత్. ఇటీవల మా కుటుంబం కరోనా ప్రభావానికి గురైంది. సాయినాథుని కృపాకటాక్షాలు మరియు చల్లని చూపు వల్ల మా కుటుంబంలోని అందరం ఆయురారోగ్యాలతో ఉన్నాం. అయితే, ఈమధ్య ప్రతిరోజూ సాయంత్రం కాగానే మా పాపకి విపరీతమైన దగ్గు వస్తుండేది. నాకు చాలా భయమేసి, "పాపకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అనుగ్రహించమ"ని ఆ సాయినాథుని వేడుకున్నాను. తరువాత, గురువారం ఉదయం సాయినాథునికి పాలన్నం, పెరుగన్నం నైవేద్యం పెట్టిన తర్వాత నేను, నా కూతురు కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. డాక్టర్ పాపని పరీక్షించి, "దగ్గు కేవలం ఎలర్జీ వలన వస్తోంది. భయపడాల్సిన అవసరంలేదు" అని చెప్పారు. అది విన్న నా ఆనందానికి అవధులు లేవు. సాయినాథుని నమ్మి, వారిపై భారం వేస్తే మన కష్టాలన్నీ తీరిపోయి ఆరోగ్యంగా ఉంటామన్నది నా నమ్మకం. అదే నిజమైంది. "ధన్యవాదాలు బాబా".
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
844 days
ReplyDeletesairam
pillalaki daggu annadi common kadandi adi kuda anubhavam ante chadive vallaki intrest ekkada nunchi vastadi ... miracle ante miracle la unte appudu chadive vallaki chadavalani nammalani anipistadi ...
ReplyDeleteEvari nammakam valladhandi.. Adhi thalli prema
Deletepillalaki daggu annadi common ani pettina few weeks tarvata ma intlone ma father ki serious ayyi hospital lo admit chesam appudu ardam ayindi health issues vaste enta tension untada ani .. nenu ala okari situation mida comment cheyyakunda undalsindi ani ardam ayindi andi .... ma father ki thaggipovalani nenu kuda Baba ni korukunna alane situation normal ayindi ....
DeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🌺😀🌼🌹
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh, karthik ki health bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete