సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 743వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయతో తగ్గిన మంట, నొప్పి
  2. తోడునీడగా ఉంటూ కాపాడే సాయితండ్రి


బాబా దయతో తగ్గిన మంట, నొప్పి


నేను ఒక సాయి భక్తురాలిని. 2021, మార్చిలో ఒకరోజు అర్థరాత్రి నా చెంపపై విపరీతమైన దురద, మంట మొదలయ్యాయి. మొదట నేను అది మామూలు దురద, దానివల్ల వచ్చిన మంట అని అనుకున్నాను. కానీ కాసేపటికి మంట చాలా తీవ్రమైంది. వెంటనే నేను బాబాను తలచుకొని, "ఈ మంట తగ్గేలా దయ చూపండి" అని వేడుకున్నాను. బాబా దయవలన అలా అనుకున్న ఐదు నిమిషాలకు  మంట తగ్గిపోయింది. మళ్లీ అటువంటి మంట ఇప్పటివరకు రాలేదు.


2021, మార్చి 18న నేను, మావారు అమెరికాలో కరోనా మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాము. సహజంగా వ్యాక్సిన్ వేయించుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికీ తెలిసిందే. అలాగే నాకు తలనొప్పి, మావారికి చేయినొప్పి వచ్చాయి. రాత్రయ్యేసరికి నా తలనొప్పి చాలా ఎక్కువై భరించలేనిదిగా అయింది. ఆ నొప్పిని తట్టుకోలేక బాబాను ప్రార్థించి ఊదీని నుదుటన పెట్టుకొని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగి బాబా నామాన్ని స్మరించుకుంటూ పడుకున్నాను. బాబా దయతో ఊదీ మహిమ వలన కాసేపటికి తలనొప్పి తగ్గిపోయి హాయిగా నిద్రపోయాను. నిజానికి అంత తీవ్రమైన తలనొప్పి తగ్గడానికి కనీసం అరగంటైనా పడుతుంది అనుకున్నాను. కానీ, బాబా దయతో 10 నిమిషాల్లోనే తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః


తోడునీడగా ఉంటూ కాపాడే సాయితండ్రి


నా పేరు శ్రీలత. మాది వైజాగ్. మా ఇంట్లో అందరికీ బాబా అంటే పంచప్రాణాలు, ముఖ్యంగా నాకు. ఆరడుగుల సాయిబాబా ఫోటోను మా ఇంటి హాలులో పెట్టుకున్నాము. ఇంకా మా ఇంటినిండా చిన్న చిన్న బాబా విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు బాబాను చూస్తూ ఆయన స్మరణలోనే గడుపుతాము. బాబా అంటే మాకు అంత ఇష్టం. 


2020లో హఠాత్తుగా కరోనా మొదలవడంతో మా కోడలు, మనవడు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. డిసెంబరు వరకు సింగపూర్ వెళ్ళడానికి వాళ్ళకు అప్రూవల్ లభించలేదు. అప్రూవల్ లభించాక వాళ్ళు ఇండియా నుండి బయలుదేరి ముందుగా దుబాయి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు హోటల్లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న సమయంలో మా మనవడికి జ్వరం వచ్చింది. దాంతో మా కోడలు ఎంతో భయపడింది. అది తెలిసి ఇక్కడ మేము కూడా చాలా భయపడిపోయాము. దేశం కాని దేశంలో బాబుతో ఒంటరిగా ఉన్న మా కోడలి గురించి చాలా ఆందోళన చెందాము. అప్పుడు నేను, "ఉదయానికల్లా బాబుకి జ్వరం తగ్గేలా అనుగ్రహించమ"ని ఆ దయామయుడైన సాయిని వేడుకొన్నాను. సాయి నా మొర విన్నారు. మరుసటిరోజు ఉదయానికల్లా బాబుకి జ్వరం తగ్గి చక్కగా ఆడుకోసాగాడు. 14 రోజుల తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి సింగపూర్ వెళ్లారు. అక్కడ కూడా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి సాయి దయవలన క్షేమంగా వాళ్ళింటికి చేరుకున్నారు. "ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడునీడగా ఉంటూ మమ్ము కాపాడు తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయీ!".


మా చిన్నబ్బాయి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. "తనకు మంచి జీతంతో ఇంకా మంచి ఉద్యోగం రావాల"ని నేను సాయిని వేడుకున్నాను. సాయి అద్భుతం చేశారు. నేను అడిగినదానికంటే కూడా ఎక్కువ జీతంతో మంచి ఉద్యోగాన్ని ప్రసాదించి నా కోరిక తీర్చారు. నా సాయిదేవుడు ప్రసాదించిన అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయన స్మరణ చేయడం తప్ప ఆ ప్రేమమూర్తికి నేనేం ఇవ్వగలను? "సాయీ! మాతోనే ఉండు, మాలోనే ఉంటూ సర్వదా మమ్ము కాపాడు. మీకు నా శతకోటి నమస్కారాలు".


7 comments:

  1. Today is our wedding anniversary. Baba please bless my husband with long life.if we ask baba any desire to full fill.he fulfilles that desire and makes us happy. That is sai's power. Om sai baba❤❤❤❤

    ReplyDelete
  2. ఓం సాయిరాం 🌹🙏🌹

    ReplyDelete
  3. సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om sai ram sai nenne namukuna thandri rakshinchu thandri sainatha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  6. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo