సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 708వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. వేడుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
  2. కోవిడ్ భయాన్ని తొలగించిన బాబా
  3. ప్రార్థించినంతనే ఆటంకాలు తొలగించిన బాబా

వేడుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా


నా పేరు సునీత. బాబా ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదవనిదే నాకు ఆరోజు ముగియదు. ఒకరోజు మావారికి ఉన్నట్టుండి చలి, జ్వరం, ఒళ్ళునొప్పులు రావటంతో చాలా బాధపడ్డారు. జ్వరం, ఒళ్ళునొప్పులు తగ్గటానికి తనకు ఇంజక్షన్ కూడా చేయించాము. కానీ రెండు రోజులైనా తనకు జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మావారికి రెండు రోజుల నుండి జ్వరం తగ్గడం లేదు. త్వరగా తనకు జ్వరం తగ్గేలా అనుగ్రహించండి” అని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో మావారి జ్వరం వెంటనే తగ్గిపోయింది. “ధన్యవాదాలు బాబా! మా పిల్లలు వేరే వేరే ఊళ్ళలో ఉంటున్నారు. వారికి మీరు తోడుగా ఉండండి బాబా. అందరినీ కాపాడే దైవం మీరు. ప్రతి ఒక్కరికీ మీరు అండగా ఉండండి బాబా”


సాయినాథ్ మహరాజ్ కీ జై!


కోవిడ్ భయాన్ని తొలగించిన బాబా


అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. బాబా మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూనే ఉన్నారు, ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తూనే ఉన్నారు. 2021, ఫిబ్రవరి నెలలో ఒకరోజు మావారు మీటింగ్ ఉందని బయటకి వెళ్లారు. రెండు రోజుల తరువాత తనకు తీవ్రమైన గొంతునొప్పి, ఒళ్ళునొప్పులు వచ్చాయి. ఆ లక్షణాలను బట్టి తనకు కరోనా సోకిందేమోనని అందరం చాలా భయపడ్డాము. దాంతో మావారు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. మావారి వయస్సు 58 సంవత్సరాలు. పైగా తనకు థైరాయిడ్ సమస్య కూడా ఉంది. అందువల్ల టెస్ట్ రిజల్ట్ ఎలా వస్తుందోనని ఎంతో ఆందోళనపడుతూ, బాబాను ప్రార్థించి, క్వశ్చన్&ఆన్సర్స్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, “ఏమీ భయంలేదు, నన్నే తలచుకో, ఊదీ పెట్టు” అని బాబా సమాధానిచ్చారు. 'భయపడవద్ద'ని బాబా సమాధానమిచ్చినప్పటికీ నాకు చాలా భయంగానే ఉండింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “కోవిడ్ టెస్ట్ రిపోర్టులో మావారికి నెగిటివ్ రావాలి, ప్లీజ్ బాబా, మమ్మల్ని రక్షించు తండ్రీ!” అని వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు మావారికి కోవిడ్ నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. బాబా దయవల్ల మావారు ఆరోగ్యంగా ఉన్నారు. “బాబా! మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండు తండ్రీ!”


ప్రార్థించినంతనే ఆటంకాలు తొలగించిన బాబా

 

సాయి భక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు అరుణదేవి. నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా వుంది. మేము సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్న దగ్గరనుండి ఏదో ఒక ఆటంకం వస్తూ మా ప్రయత్నం ఆగిపోతుండేది. ఎవ్వరూ మాకు సహకరించలేదు. మేము చాలా బాధపడ్డాము. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, మా బాధను విన్నవించుకుని, “బాబా! మీరే మాకు సహాయం చేయాలి. మా భారాన్ని మీ మీదనే వేస్తున్నాం. మీరే ఈ పనిని ముందుకు నడిపించాలి బాబా” అని బాబాను మనసారా వేడుకున్నాను. బాబాను ప్రార్థించిన వెంటనే టౌన్ ప్లానింగ్ పర్మిషన్, కరెంట్, ఇసుక, నీళ్ళు అన్నీ ఒక్కరోజులోనే మాకు సమకూర్చారు బాబా. అడిగిన వెంటనే మాకు ఇంత సహాయం చేసిన బాబాకు కృతజ్ఞత నిండిన మనసుతో మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. “మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేము బాబా. మీరు మా వెంటనే ఉండి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు. ఏ జన్మ పుణ్యమో, మేము మీ పిల్లలుగా ఉన్నాము బాబా. మీ కరుణ ఎప్పటికీ మా పైన వుండాలని కోరుకుంటున్నాము సాయీ! మాకు రావలసిన ధనం కూడా సకాలంలో మాకు అందేలా అనుగ్రహించండి బాబా. మీ దయవల్ల ఎటువంటి అప్పూ లేకుండా మా ఇల్లు పూర్తయ్యేలా చూడు బాబా!”


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

సాయినాథ్ మహరాజ్ కీ జై!



7 comments:

  1. Kothakonda SrinivasMarch 9, 2021 at 10:23 AM

    జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Om sai ram we have house in our place we want to sell it but it is anchestral property it belongs to all. My brother-in-law is not willing to sell it. If we sell it we get money. He is creating lot of trouble. Please sai change him. Show your power and miracle.

    ReplyDelete
  3. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  4. Om sai ram baba pleaseeee amma arogyam bagundela chudu thandri please

    ReplyDelete
  5. సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  6. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo