సాయి వచనం:-
'నువ్వెందుకు పారిపోతున్నావు? సరే, ఇలా నా దగ్గరకు రా! వచ్చి, నా వద్ద ప్రశాంతంగా కూర్చో!'

' 'నిరంతరం హరి(భగవంతుని) నామాన్ని స్మరించి సాక్షాత్తూ హరినయ్యాను' అన్న శ్రీసాయి, 'ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ, నా లీలలను మననం చేస్తారో, వారు నేనుగా మారిపోతారు' అని అభయాన్నిచ్చి, తన స్థితిని చేరుకోగలరని, ఆ స్థితిని చేరుకునే మార్గం ఉందని స్పష్టం చేశారు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1527వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలిస్తే పలికే దైవమని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్న బాబా
2. తలుచుకోగానే కష్టాన్ని తొలగించే బాబా

పిలిస్తే పలికే దైవమని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్న బాబా


నా పేరు సురేష్. చిన్నప్పుడు మేము ఒక ఆవును పెంచుకునేవాళ్ళం. దానికి ఒక ఆడ దూడ పుట్టింది. అది చాలా ముద్దుగా వుండేది. అయితే ఆవును మాకు తెలియకుండా మా కుటుంబంలోని ఓ వ్యక్తి అమ్మేసాడు. సరేలే అని వదిలేస్తే దాని దూడను మళ్ళీ మాకే 7000 రూపాయలకు తిరిగి ఇచ్చాడు. ఆ దూడను మా కుటుంబంలోని మరో వ్యక్తి పట్టుకుపోయి, అది పెద్దదయ్యాక తిరిగి మాకే ఇస్తానని హామీ ఇచ్చాడు. సరే అని మేము ఏమీ అనలేదు. మూడేళ్ల తర్వాత మేము వెళ్లి అడిగితే, దాన్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు సరికదా కనీసం సగం డబ్బులైనా ఇవ్వకుండా మా ముందే ఆ ఆవు పాలు అమ్ముకొంటూ మమ్మల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడు. అంతటితో ఆగకుండా చివరికి మాపై దాడి చేయటానికి సిద్ధమయ్యాడు. మేము తిన్నగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు, 'ఆవు లేదా సగం డబ్బులు మాకు ఇమ్మ'ని పదిరోజుల వ్యవధి ఇచ్చారు. అయినా అతను లొంగలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! నీవే మాకు దిక్కు. మాకు న్యాయం చేయి తండ్రి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా బాబాను ప్రార్థించినంతనే సదరు వ్యక్తి వేరే వ్యక్తి ద్వారా మాకు డబ్బులు పంపించాడు. అలా తాము పిలిస్తే పలికే దైవం అని బాబా మరోసారి నిరూపించారు.


ఈమద్య ఖర్చులు బాగా పెరిగి, సమయానికి జీతాలు అందక మేము విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాము. పదో తేదీ వస్తేగాని చేతికి డబ్బులు అందవు. షాపుకి వెళ్లి సామానులు అరువు అడగాలంటే భయం, సిగ్గు. ఇటువంటి స్థితిలో నేను, "బాబా! మీరే కాపాడాలి" అని బాబాతో చెప్పుకొని బాధపడ్డాను. అంతలో హఠాత్తుగా నా ఫోన్‌కి 'జీతాలు క్రెడిట్ అయ్యాయ'ని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఇంకా నెల పూర్తికాకుండానే 28వ తేదీనే మొత్తం 150 మంది జీతాలు వాళ్ళవాళ్ళ అకౌంటులలో పడ్డాయి. అందుకు మొత్తం సంస్థ ఆశ్చర్యపోయింది. అదీ బాబా మహిమ.


నేను ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాను. ఒక సంవత్సరం తరువాత ఆ డబ్బు తిరిగి ఇచ్చేద్దామని నేను అనుకున్నప్పటికీ అతను పదేపదే నాకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టడం చేస్తుండేవాడు. అది నన్ను అవమానించటానికి అతను వేసిన ప్లాన్ అని నాకు అర్ధమైంది కానీ, ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే, అతని డబ్బులు అతనికి ఇవ్వడానికి అప్పటికింకా నా దగ్గర డబ్బులు లేవు. బాబాని అడుగుదామంటే ఒకవేళ ఆ కోరిక తీరకపోతే బాబా మీద నమ్మకం పోతుంది అని మధనపడ్డాను. కానీ సమయం మించిపోతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ చివరికి, "బాబా! మీరు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరు" అని ఆయనతో చెప్పుకొని మౌనం వహించాను. అంతే, ఎక్కడినుండో ఒక వ్యక్తి వచ్చి, "బాబూ! ఈ పదివేల రూపాయలు మా నాన్నగారు మీకిమ్మన్నారు" అని ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యంలో మునిగిపోయి ఇంతవరకు తేరుకోలేదు.


జై శిరిడీ సాయిబాబా!!!


తలుచుకోగానే కష్టాన్ని తొలగించే బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. మా కుటుంబసభ్యులందరికీ బాబాపట్ల భక్తి, ప్రేమలు చాలా ఎక్కువ. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఎవరికీ ఏ బాధ కలిగినా ముందుగా మేము తలుచుకునేది బాబానే. ఎంత పెద్ద బాధైనా బాబాను తలుచుకోగానే ఆ కష్టం, బాధ తొలగిపోతుంది. ఇలాంటి సంఘటనలు మా జీవితాలలో ఎన్నో ఉన్నాయి. నా పెద్ద కూతురు అనూష కడుపుతో ఉన్నప్పుడు ఐదో నెలలో TIFFA స్కాన్ చేయిస్తే, బిడ్డ ముక్కు ఎముక పెరగలేదని వచ్చింది. దాంతో అమ్నియోసెంటెసిస్ టెస్టు చేయించాలని చెప్పారు. అది విని నా కూతురు, మా కుటుంబం చాలా బాధపడ్డాము. అప్పుడు నేను, "బాబా! ఈ టెస్టులో బిడ్డకు ఎలాంటి సమస్య లేదని వస్తే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆ టెస్ట్ చేసాక నెల తర్వాత రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టులో కడుపులో బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని వచ్చింది. అది తెలిసి మేము చాలా ఆనందపడ్డాం. ఇదంతా బాబా దయ. నా బిడ్డకు ప్రతి విషయంలోనూ ఆ బాబా అండగా ఉండాలని ప్రార్థిస్తూ.. ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. 


FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

12 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai Sri Sai jayajaya sai....

    ReplyDelete
  4. ఓం సాయిరాం

    ReplyDelete
  5. Om sri sai ram

    ReplyDelete
  6. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairamomsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe