1. బాబాపై నమ్మకం
2. శ్రీసాయినాథుని అపార అనుగ్రహం
బాబాపై నమ్మకం
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను బాబా భక్తురాలిని. నేను కొన్ని రోజుల క్రితం పంచుకున్న నా గత అనుభవంలో నా తమ్ముడికి బాబు పుట్టాడనీ, తన శరీరంలో కొన్ని లెవెల్స్ అబ్‌నార్మల్‍గా ఉన్నాయనీ, 'వాటిని నార్మల్ చేస్తే, తమ్ముడిని తీసుకుని శిరిడీ వస్తాన'ని బాబాని ప్రార్థిస్తే, బాబా వాటిని నార్మల్ చేశారనీ మీతో పంచుకున్నాను. తరువాత బాబాకి మాటనిచ్చిన ప్రకారం నేను, నా తమ్ముడు వీలైనంత త్వరగా శిరిడీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే బాబా దయ లేనిదే శిరిడీ వెళ్లలేము కదా! అందువల్ల నేను, "బాబా! ఏ ఆటంకం లేకుండా శిరిడీ వచ్చి వెళ్లేలా చూడండి. అంతా మంచిగా జరిగితే, తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత శిరిడీలో ఉండటానికి రూమ్ బుక్ చేయాలని చూస్తే, అది వారాంతం రద్దీ వలన రూమ్స్ అందుబాటులో లేవు. అదివరకు మేము వెళ్లిన హోటల్లో కూడా రూమ్స్ బుక్ అయిపోయాయి. ఇప్పుడేం చేయాలి అనుకుంటుండగా మరో హోటల్ మా కంటపడింది. అందులో రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్లీ చూస్తే, ఆ హోటల్ కూడా ఫుల్ అయిపోయింది. నిజంగా ఇది బాబా అనుగ్రహమే. తరువాత మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ బస్సు నడుపుతున్న వేగానికి భయమేసి బాబాని, "ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా తీసుకెళ్లమ"ని కోరుకున్నాను. ఆరోజు రాత్రి తమ్ముడికి బాబా స్వప్నదర్శనమిచ్చారు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ స్వప్నం ద్వారా తమ్ముడికి తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచారు బాబా. ఆయన దయవలన మేము క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. దర్శనం కూడా బాగా జరిగింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
2022, జూలై నెలాఖరులో తమ్ముడి కొడుకుకి టెస్టు చేసినప్పుడు అన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టర్ ఆ రిపోర్టులు చూసి, "టాబ్లెట్ వేయడం మానేసి, ఈసారి కొంచెం ఎక్కువ వ్యవధి ఇచ్చి మళ్ళీ టెస్టు చేద్దాం" అని అన్నారు. అలాగేనని ఒక 15 రోజుల తర్వాత టెస్టు చేస్తే, బాబు శరీరంలో కొన్ని లెవల్స్ మళ్లీ కొంచెం పెరిగాయి. అది తెలిసి నేను, "బాబా! మీ మీదే నమ్మకముంచాను. నువ్వే బాబుని కాపాడాలి" అని దృఢంగా బాబాను కోరుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు వేరే డాక్టరుకి చూపిస్తే, "కొంచెం ఆ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ మిగతా అంతా బాగుంది. ఒకవేళ బాబుకి ఏదైనా సమస్య ఉంటే, మిగిలిన వాటిలో కూడా ఏదో ఒక సమస్య కనిపించేది. కేవలం ఆ లెవల్సే కాబట్టి సమస్యేమీ లేదు" అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
ఆన్లైన్లో టీవీ ఆర్డర్ చేస్తే, అది ఎలా వస్తుందో అన్న భయంతో నేనెప్పుడూ ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. కానీ ఈమధ్య నేను మా ఇంట్లోకి ఆన్లైన్లో టీవీ తీసుకుందామనుకుని బాబాని తలచుకుని, "ఎలాంటి డామేజ్ లేకుండా టీవీ వచ్చేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా టీవీ డెలివరీ అయింది. కానీ ఇన్స్టలేషన్‍లో ఒక చిన్న సమస్య వచ్చింది. అది సరిచేయాల్సిన అతను మళ్ళీ వచ్చి సెట్ చేస్తానన్నాడు. "ఏ సమస్యా లేకుండా అది సెట్ అయ్యేలా చూడండి బాబా. చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మా పిన్నివాళ్ళ అబ్బాయి ఎమ్మెస్ చేయడానికి యుఎస్ వెళ్లాలనుకున్నాడు. బాబా దయవల్ల తనకి వీసా కూడా వచ్చింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. కానీ కొంచెం సున్నితస్థుడు. అలాంటి తను ఒక్కడే అంతదూరం వెళుతుంటే ఎలా వెళ్తాడో, అక్కడ ఎలా ఉంటాడో అని నేను బాబాను, "తనకి ప్రయాణంలో ఏ సమస్యా లేకుండా చూసి, క్షేమంగా తనని యూఎస్ చేర్చండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా ఆ అబ్బాయి యుఎస్ వెళ్లి, అక్కడొక రూమ్ కూడా తీసుకున్నాడు. "చాలా థాంక్స్ బాబా. తను, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారు. ఎలాగైనా వాళ్ళకి మంచి పార్ట్ టైం జాబ్, అదికూడా ఇద్దరిద్దరికి ఒకేచోట దొరికేలా అనుగ్రహించండి బాబా".
నేను వారంలో మూడురోజులు ఆఫీసుకి వెళ్లాల్సి ఉండగా, ప్రయాణానికి భయపడి 2022, ఆగస్టులో వరుసగా రెండు వారాలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంటి నుండే వర్క్ చేశాను. నేను ఆఫీసుకి వెళ్లకపోయినా మా మేనేజర్ అడగలేదు. ఆమె అడగలేదని నేను కూడా ఏం చెప్పలేదు. అయితే రెండో వారం మధ్యలో ఆమె, "నువ్వు గతవారం ఆఫీసుకి వచ్చావా?" అని అడిగింది. అప్పుడు నేను, "ఈ వారమూ, గత వారమూ ఆఫీసుకి రాలేదు" అని చెప్పాను. అప్పుడు ఆమె, "కనీసం రావట్లేదని తెలియజేయాలి కదా" అని అంది. ఆ మాటలు ఆమె కొంచెం కోపంగా అన్నట్లు నాకనిపించింది. అయితే ఆ వారం మధ్యలో ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్న నేను, 'అసలే ఈమె కోపంగా ఉంది. ఈ స్థితిలో సెలవు గురించి చెప్తే ఆమె ఏమంటుందో?' అని చాలా టెన్షన్‍గా అనిపించింది. వెంటనే నేను బాబాని తలచుకుని, "సెలవు గురించి నా మేనేజరుకి మెసేజ్ చేస్తున్నాను బాబా. ఆమె ఏమీ అనకుండా ఒప్పుకుంటే, నా అనుభవాన్ని ఆలస్యం చేయకుండా తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకుని ఆమెకి మెసేజ్ పెట్టాను. ఆమె పెద్దగా ఏమీ అనకుండానే, 'సరే' అంది. "ఆమె కోపంగా నన్ను ఏమీ అనకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే తోడు ఉండండి. ఎందుకంటే, మీరు లేని నేను లేను. మీరు లేకుండా నేను ఈ ప్రపంచంలో దేన్నీ ఎదుర్కోలేను".
నేను ఈమధ్య ఒకసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీ జలుబుతో ఇబ్బందిపడుతున్నారు. అమ్మని అడిగితే, "దాదాపు 15 రోజులు నుంచి ఆయనకి గొంతులో తేడాగా ఉంది" అని చెప్పింది. అది విని నాకు చాలా భయమేసింది. కానీ, టాబ్లెట్స్, డాక్టర్స్ అన్నిటికంటే ముందు నాకు బాబా గుర్తొచ్చారు. వెంటనే బాబాని ప్రార్థించి, "నాన్నకి జలుబు తగ్గేలా చేయండి బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు నాన్నకి బాగానే ఉంది. "నాన్నకి పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా. ఈ విషయం, ఆ విషయం అని లేకుండా ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ప్రతి సమస్య నుంచి కాపాడుతున్న మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను బాబా? మీరు నా జీవితంలో ప్రతిక్షణం, ప్రతి విషయంలో తలచుకోగానే నాకు తోడుగా ఉంటున్నారన్నదానికి సాక్ష్యంగా నా అనుభవాలను పంచుకోవాలంటే నేను ఎప్పటికీ చెప్తూనే ఉండాలేమో! అంతలా మీరు నా జీవితంలో ఉన్నారు. వాటన్నిటికీ నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బాబా. ఏదైనా విషయంగానీ, అనుభవంగానీ మర్చిపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి, వాటిని గుర్తుచేయండి. ఆఫీసులో నాకు ఇంటినుండి పనిచేసుకునే సదుపాయం ఇచ్చేలా చేయండి, ప్లీజ్ బాబా. ప్రతీ వారం ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటోంది. అలాగే, నేను ఒక విషయంలో బాధపడుతున్నాను. ఆ బాధ కూడా మీరు తీర్చాలి. ఎందుకంటే, మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మీ మీదే నమ్మకం ఉంచుకున్నాను బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
శ్రీసాయినాథుని అపార అనుగ్రహం
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sai ram 🙏🏻
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to reduce her pain Jaisairam
ReplyDeleteఓం సాయి రామ్ నువ్వు భకుతులకి కనపడటం చాలా సంతోషంగా వుంది.నాకు కల లో అయి నా కనపడు సాయి రామ్.నా కోరిక తీర్చు తండ్రి
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
Sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteGood morning all. Today I would like to share my experience with Baba Leela. Since few days I couldn't find my gold jewellery as I kept somewhere and forgot. Iam searching since 2 days but I didn't find. I got tensed and prayed baba that I could find it. baba helpedme and finally I could find it Thank you so much Baba for being with me in many situations and supporting me. OM SAI RAM.
ReplyDelete