1. బాబా అనుగ్రహంతో సుళువుగా తప్పిపోతున్న చిన్న చిన్న ఇబ్బందులు ఎన్నో
2. బాబాని నమ్ముకుంటే, సమస్యలను తొందరగా తొలగిస్తారు
బాబా అనుగ్రహంతో సుళువుగా తప్పిపోతున్న చిన్న చిన్న ఇబ్బందులు ఎన్నో
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. గత కొన్నిరోజుల్లో నాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాని ప్రార్ధించి, ఈ బ్లాగులో పంచుకుంటానని చెప్పుకున్నంతనే నా సమస్యలెన్నో తొలిగిపోయాయి. నేను ఇదివరకు నాలుగుసార్లు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకున్నాను. 2022, జూలై నెల ఆరంభంలో మా ఇంటికి ఒక బంధువు వచ్చారు. ఆ బంధువు అంటే మా అన్నయకి పెద్దగా ఇష్టం లేదు. అంతకుముందు ఆ బంధువు మాటల వల్ల తను బాధపడ్డాడు. అందువల్ల ఇప్పుడు ఆ బంధువుని అన్నయ్య పలకరిస్తాడా, లేదా, ఒకవేళ పలకరించకపోతే, ఆ బంధువు అన్నయ్యని తప్పుగా ఏదైనా అంటాడేమో! పోనీ అన్నయ్యని అతన్ని పలకరించమమని చెపుదామంటే వింటాడో, వినడో అని పలురకాల ఆలోచనలతో నేను చాలా అందోళన చెందాను. నాకు ఏమి చెయ్యాలో తోచక మా ఇంటి హాల్లో ఉన్న బాబా ఫోటోకి దణ్ణం పెట్టుకుని, "బాబా! అన్న కిందకి వచ్చి, వచ్చిన బంధువుని పలకరించేలా ప్రేరణ కలిగించండి" అని బాబాను ప్రార్ధించాను. నేను అలా ప్రార్ధించిన 5 నిమిషాలకి అన్న తనంతటతానే వచ్చి, ఆ వ్యక్తిని పలకరించడమే కాకుండా అతనితో చాలాసేపు మాట్లాడాడు. అస్సలు పలకరిస్తాడో, లేదో అని అనుకుంటే, తను అంతసేపు మాట్లాడం చూసి చాలా ఆశ్చర్యమేసింది. కేవలం అది బాబా దయ. ఆయన నా ప్రార్ధనను మన్నించారు.
ఈమధ్య హఠాత్తుగా మా మామయ్య కొడుకుకి కళ్ళు తిరిగి ఆరోగ్యం బాగాలేకుండా పోతే హాస్పిటల్లో చేర్చారు. తను తలనొప్పిగా ఉంటుంది, తగ్గట్లేదు అంటే డాక్టర్ చాలా టెస్టులు చేయమని చెప్పారు. మావయ్య ఆ టెస్టులన్నీ చేయించారు. రిపోర్టులు ఎలా వస్తాయో అని మేమందరమూ టెన్షన్ పడ్డాము. నేను బాబాని ప్రార్ధించి, "అంత మామూలుగా వచ్చినట్లైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా కృపతో ఏ ఇబ్బంది లేదని వచ్చింది.
నేను సాధరణంగా 8వ తేదిన ఏ పని, ప్రయాణము చేయను. ఆ రోజు ఏం చేసినా కలిసి రాదని నా నమ్మకం. కానీ ఒకసారి 8వ తేదినే నేను ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు కాకుండా ఇంకోరోజు వెళ్లే అవకాశం అస్సలు లేదు. అందుచేత ఏమీ చేయలేక బాబాని ప్రార్ధించి, "నేను ఆ చోటుకి క్షేమంగా వెళ్లి, తిరిగి వచ్చినట్లైతే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా ఆశీర్వాదం వల్ల నేను ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను.
7 సంవత్సరాల ముందు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేనపుడు నేను శ్రీసత్యనారాయణస్వామికి, "అమ్మకి తగ్గితే, మీ దర్శనానికొచ్చి వ్రతం చేస్తాను" అని మ్రొక్కుకున్నాను. ఆ స్వామి దయతో అమ్మకి తగ్గి 7 సంవత్సరాలైనా నేను నా మ్రొక్కు మాత్రం తీర్చలేకపోయాను. ఒకసారి మ్రొక్కు తీర్చుకోవడానికి ప్రయాణమైన తర్వాత నాకు నెలసరి వచ్చి, ఆగిపోవాల్సి వచ్చింది. చివరికి ఈమధ్య ఎలాగైనా మ్రొక్కు తీర్చుకుని రావాలని టికెట్లు బుక్ చేసుకున్నాక నేను, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా మ్రొక్కు తీర్చుకోగలిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో మా ప్రయాణం బాగా జరిగి, చక్కగా వ్రతం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము.
2022, జూలై మూడోవారం చివరిలో ఒక పని మీద నేనొక ఊరు వెళ్లాల్సి ఉండగా ఆ ఊరు చాలా దూరమని రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అయితే ఆ రోజు రైలు 12 గంటలు ఆలస్యమవడంతో మేము కారులో బయలుదేరాము. కారులో అంత దూర ప్రయాణం నాకు చాలా కష్టంగా అనిపించి, "బాబా! మేము జాగ్రత్తగా వెళ్లి, అక్కడ పని చూసుకుని, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లైతే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో మేము క్షేమంగా అక్కడికి వెళ్లి, ఇంటికి తిరిగి వచ్చాము. ఇలా చిన్న చిన్న ఇబ్బందిలెన్నో బాబా అనుగ్రహంతో సుళువుగా తీరి పోతున్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
బాబాని నమ్ముకుంటే, సమస్యలను తొందరగా తొలగిస్తారు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సమస్త సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, మే 29న హఠాత్తుగా మావారి కుడిచేయి పని చేయలేదు. డాక్టరుని సంప్రదిస్తే, "బీపీ 174 ఉంది. దానివల్లే ఈ సమస్య అయుండొచ్చు" అని MS చేసిన మరో డాక్టరుని కలవమని వ్రాసారు. మేము అతని దగ్గరకు వెళ్తే ఈసీజీ తీసి, "అంతా నార్మల్‍గా ఉంది. ఏమీ కాదు. ఒక వారంలో మీకు తగ్గుతుంది" అని అన్నారు. అయితే, మావారికి తినడానికి చేతనయ్యేది కాదు. చేయి కిందికి దించితే విపరీతమైన నొప్పి. మావారు అస్సలు భరించలేకపోయారు. ఎప్పుడూ ఇంట్లో ఉండని ఆయన మూడు రోజులు షాపుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఒకటే టెన్షన్‍తో ఏం చేయడానికి మాకు తోచలేదు. అట్టి స్థితిలో మా వదినవాళ్ల అక్క డాక్టరని, ఆమెని అడగాలని నాకు అనిపించింది. బాబానే ఆ కష్ట సమయంలో ఆమెను నాకు గుర్తుచేసినట్టు అనిపించింది. వెంటనే ఆమెకి ఫోన్ చేసి, మావారికి వచ్చిన సమస్య గురించి చెప్పి, "ఏ డాక్టరుకి చూపించాలి" అని అడిగాను. అందుకామె, "నరాల స్పెషలిస్ట్ కి చూపించండి" అని చెప్పింది. మరుసటిరోజు నేను, "బాబా! మీ దయతో పెద్ద సమస్యేమీ లేదని చెప్పాలి. మంచి ట్రీట్మెంట్ మావారికి అందాలి. అలా జరిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకుని మావారిని, మా బాబుతో హాస్పిటల్‍కు పంపించాను. డాక్టరు టెస్టు చేస్తే, రిపోర్టులో స్పాండిలైటిస్ అని వచ్చింది. అప్పుడు డాక్టరు, "ఇది బీపీ సమస్య కాదు. మెడ నరాలకు సంబంధించింది. భయపడాల్సిన అవసరమేమీ లేదు. మెల్లగా తగ్గుతుంది" అని చెప్పారు. అప్పుడు మాకు చాలా ఉపశమనంగా అనిపించింది. 18 సంవత్సరాల క్రితం మా మామయ్యకి ఇలాగే నొప్పి వచ్చాక పక్షవాతం వచ్చింది. అందుకే మేము చాలా భయపడ్డాము. 4, 5 రోజులైతే మా మనసు అస్సలు బాగాలేదు. ఇప్పుడు బాబా దయవల్ల మావారికి చాలావరకు బాగుంది. కొంచెం పని ఎక్కువైతే నొప్పి వస్తుంది. కానీ మునపటికన్నా 99% బెటర్‍గా ఉంది. బాబాని నమ్ముకుంటే, మన సమస్యలను తొందరగా తొలగిస్తారు. బాబా అండ ఉండగా మనకి భయమెందుకు? అన్నీ బాబా చూసుంటారు. "ధన్యవాదాలు బాబా. నేను మీకు మ్రొక్కుకున్నట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి. కానీ ఆలస్యమైంది, క్షమించు తండ్రి. ఇంకా కొన్ని సమస్యలు గురించి మీకు మ్రొక్కుకున్నాను. అవి కూడా తొందరగా తీరేట్లు చూడండి బాబా. మాకు రావాల్సిన డబ్బు తొందరగా వచ్చేలా చేయండి తండ్రి. అవి వచ్చాక మళ్ళీ నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. నా తప్పులేవైనా ఉంటే క్షమించండి బాబా. అందరినీ చల్లగా చూడు తండ్రి. మా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి బాబా. శతకోటి వందనాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
One sri sai ram🙏🙏🙏🙏 🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI
ReplyDelete