సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1280వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీస్సులతో సమస్యల పరిష్కారం
2. జ్వరం తగ్గించడంలో, కోర్టు స్టే ఇవ్వడంలో బాబా చూపిన దయ
3. అపారమైన బాబా దయ

బాబా ఆశీస్సులతో సమస్యల పరిష్కారం

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మణిదీపిక. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. 2022, మే నెలలో నాకు పెళ్ళయింది. పెళ్లికి నేను మూడు వారాలు సెలవు తీసుకుని, ఆ మూడు వారాల తర్వాత మళ్లీ ఆఫీసులో జాయిన్ అయ్యాను. పదిరోజుల వరకు అన్నీ మామూలుగానే ఉన్నాయి. తర్వాత కంపెనీ అన్ని పోర్టల్స్ నుండి నన్ను సస్పెండ్ చేసింది. ఆ విషయమై నేను మెయిల్స్ పెట్టినా, కాల్స్ చేసినా ఎవరూ సరిగా స్పందించేవారు కాదు. అదీగాక, నేను రోజూ లాగిన్ అయి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా జూన్ నెల జీతం రాలేదు. నేను మొత్తం 40 రోజులు సెలవు తీసుకున్నట్టు వేశారు. నేను ఎంత ప్రయత్నించినా ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు. చివరికి ఒకరోజు నేను, "బాబా! నా సమస్య పరిష్కారమైతే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అదేరోజు సాయంత్రం కంపెనీ నుండి 'మీ జీతం సమస్య పరిష్కరించబడింది' అని నాకు మెయిల్ వచ్చింది. ఇది బాబా ఆశీస్సుల వల్లే జరిగిందని నేను చాలా సంతోషించాను. తరువాత జీతం నా అకౌంటులో జమ అయింది. కానీ, నాకు రావాల్సినంత జీతం రాలేదు, ఒక 20,000 తక్కువ వచ్చింది. ఇప్పుడు దాని పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంలో కూడా బాబా సహాయం చేస్తే, ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను.

పెళ్ళైన తరువాత నేను H4 వీసా ఇంటర్వ్యూకోసం చెన్నై వెళ్ళాను. ఇంటర్వ్యూ క్లియర్ అయ్యాక పాస్‌పోర్టు ఇంటికే పంపిస్తారని చెప్పారు. సరేనని నేను ఇంటికి వచ్చేశాను. అయితే నేను ఇంటికి వచ్చాక, 'రెండువారాల్లో చెన్నై వచ్చి, పాస్‌పోర్టు తీసుకెళ్లమ'ని మెయిల్ వచ్చింది. పాస్‌పోర్టు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెన్నై వెళదామంటే, నా ఆఫీసులో నేను నోటీసు పీరియడ్‍లో ఉన్నాను. కాబట్టి సెలవు దొరికే పరిస్థితి లేదు. అందువలన నేను, "బాబా! నాకొచ్చిన సమస్య పరిష్కారమయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, బాబా దయవల్ల వాళ్ళు నా పాస్‍పోర్టును హైదరాబాదులోని హెడ్ ఆఫీసుకి పంపించారు. ఇంక నేను ఎటువంటి సమస్యా లేకుండా హైదరాబాదు వెళ్లి, పాస్‌పోర్టు తెచ్చుకున్నాను. బాబా ఆశీస్సులతోనే నా సమస్య పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా".

ఇటీవల నేను ఏ కారణం లేకుండానే బాగా నీరసించిపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ, "పూర్తి బాడీ చెకప్ చేయించుకోమ"ని చెప్పారు. కానీ నాకు చెకప్ చేయించుకోవాలంటే చాలా భయంగా ఉండేది. చివరికి ఒకరోజు బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయవలన అన్ని రిపోర్టులు నార్మల్ వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుని టెస్టులు చేయించుకున్నాను. విటమిన్-డి ఒక్కటే తక్కువ ఉందని మందులు ఇచ్చారు. అది కాకుండా మిగిలిన అన్ని రిపోర్టులూ నార్మల్‍గా ఉన్నాయి. "ఎప్పుడూ నాతో ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా".

సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

జ్వరం తగ్గించడంలో, కోర్టు స్టే ఇవ్వడంలో బాబా చూపిన దయ

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తూ మనందరికీ బాబా మీద అపారమైన నమ్మకాన్ని కలిగిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు నాగలక్ష్మి. నేను టీచరుగా పనిచేస్తున్నాను. ఈమధ్య ఒకరోజు గుంటూరులోని హాస్టల్లో ఉంటున్న మా చిన్నమ్మాయి తనకి జ్వరంగా ఉందంటే, డోలో టాబ్లెట్ వేసుకోమని చెప్పాను. తను అలాగే చేస్తే జ్వరం తగ్గింది, కానీ మళ్లీ వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం తను నాకు ఫోన్ చేసి, "జ్వరం చాలా ఎక్కువగా ఉంది. చాలా నీరసంగా కూడా ఉంది. ఈ స్థితిలో నేను ఊరికి రాలేను" అని చెప్పింది. వెంటనే నేను, మా పెద్దపాప కారులో బయలుదేరి తన దగ్గరకి వెళ్ళాము. తనకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. వెంటనే తనకి ఒక డోలో టాబ్లెట్ వేసి, తనని తీసుకుని కారులో మా అమ్మావాళ్ళ ఇంటికి వెళదామని బయలుదేరాము. దారిలో బ్లాగులో జ్వరం గురించిన అనుభవమే చదివాను. అప్పుడు నేను, "బాబా! మా పాపకి రేపటికల్లా జ్వరం నార్మల్‍కి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆ రాత్రంతా నేను పాపకి టాబ్లెట్లు వేస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి బాబా అద్భుతం చేశారు. పాప టెంపరేచర్ 98.6F ఉంది. అది చూసి నాకెంతో ఆనందమేసి మనసులోనే బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మామూలుగా అయితే అంత తీవ్రమైన జ్వరం తగ్గి నార్మల్ అవ్వడానికి 2, 3 రోజులు పడుతుంది. అలాంటిది బాబా ఒక్క రాత్రిలోనే మా పాపకి జ్వరం తగ్గించి నా ఆందోళనని తీసివేశారు. "థాంక్యూ బాబా. ఇలానే మమ్మల్ని కాపాడుతూ ఉండండి బాబా. అలాగే మా పాపకున్న జలుబు కూడా తగ్గించండి బాబా". 

మావారు 'జెన్‍కో'లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇదివరకు బదిలీలు ఉండేవి కాదు. కానీ ఈమధ్య కొత్తగా ట్రాన్స్ఫర్ పాలసీ అని ప్రవేశపెట్టి మా వారిని బదిలీ చేసారు. మా పెద్దపాపకి పెళ్లి చేయాల్సిన సమయమైనందున మాకు ఆ బదిలీ నచ్చలేదు. అందువలన మేము మా బదిలీ ఆగిపోవాలని కోర్టుకి వెళ్లి, "బాబా! కోర్టు స్టే ఇస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల కోర్టు మాకు అనుకూలంగా బదిలీ మీద స్టే ఇచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే బదిలీ పూర్తిగా ఆగిపోయేటట్లు అనుగ్రహించండి"

అపారమైన బాబా దయ

"బాబా సాయీ! నమస్కారం తండ్రీ". నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో పనిచేసి పదవీవిరమణ చేశాను. 2022, ఆగస్టు 5, శుక్రవారం ఉదయం నా భార్య మా ఇంటి పైఅంతస్తులో తను నిర్వహిస్తున్న వస్త్రదుకాణానికి వెళ్లొచ్చి తన పని తాను చేసుకుంటుండగా సుమారు 10 గంటల ప్రాంతంలో తన మెడలోని మంగళసూత్రం పెరిగిపోయి ఒక సూత్రమే ఉండటం గమనించింది. ఇంకొక సూత్రం ఎక్కడ పడిపోయిందో తెలియలేదు. అందరమూ ఇల్లంతా వెతికాము. కానీ ఆ సూత్రం ఎక్కడా దొరకలేదు. శ్రావణ శుక్రవారం, శ్రీవరలక్ష్మీవ్రతం రోజున అలా జరగడంతో మేము చాలా బాధపడ్డాము. కొంతసేపటికి ఎందుకైనా మంచిదని నేను నా భార్యని, "ఒకసారి పైన చూసి రమ్మ"ని పంపించి, "బాబా! ఆ సూత్రం దొరకకపోతే ఇదేదో అమంగళమని మేము జీవితాంతం బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఆ సూత్రం తప్పకుండా దొరకాలి బాబా" అని బాబాకి మ్రొక్కుకుంటున్నాను. అంతలోనే, "సూత్రం దొరికింద"ని నా భార్య క్రిందికి వచ్చింది. ఆమె, "ఇది బట్టల షాపులో బట్టల మధ్యన పడిపోయింది. ఇన్ని బట్టల మధ్య సూత్రం దొరుకుతుందో, లేదోనని అనుకున్నాను. కానీ ఒక్కసారి చెయ్యి పెట్టి తడమగానే సూత్రం దొరికింద"ని చెప్పింది. ఆ క్షణంలో నేను పొందిన ఆనందానుభూతి మాటల్లో చెప్పరానిది. సూత్రం తొందరగా దొరికేలా చేసి ఎక్కువగా టెన్షన్‌కి గురికాకుండా బాబా కాపాడారు. బాబా తమ దయ నాపై అపారంగా ఉన్నట్టు ఈ సంఘటన ద్వారా తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయి బాబా ఈ రోజు నా భర్త పుట్టినరోజు. సాయి తండ్రి ఆయనకు సంపూర్ణంగా ఆయుష్షు ప్రసాదించు. నీ ఆశీస్సులు అందించు నాన్న. సాయి బాబా

    ReplyDelete
  3. Ma Bavagaru birthday ayana pi me ashishlu vundali thandri..vallaki oka bidda prasdinchandi baba please

    ReplyDelete
  4. Samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo