1. దయతో సమస్యలను తొలగించిన బాబా
2. ప్రమోషన్ సమస్యను పరిష్కరించిన బాబా
3. ప్రేమతో సమస్యను పరిష్కరించిన బాబా
దయతో సమస్యలను తొలగించిన బాబా
ముందుగా బ్లాగును నిర్వహించే సాయికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు నాకు గొంతు సమస్య వచ్చి ఏది తిన్నా మంటగా ఉండేది. చివరికి నీళ్లు త్రాగినా మంట. అలా మంట ఎక్కువగా ఉండటం వల్ల ఏది తినాలన్నా భయంతో తినకపోయేదాన్ని.
అట్టి స్థితిలో నేను బాబాతో నా బాధ చెప్పుకుని, "ఈ గొంతు సమస్య తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. దయామయుడైన బాబా వారంరోజుల్లో సమస్య పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మా ఇంట్లోకి గండుచీమలు చాలా విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని రాకుండా నియంత్రించడం మా వల్ల కాదు. వర్షం పడినరోజు ఇంట్లో ఉన్న 6 గదుల్లో ఐదు గదుల నిండా చీమలే. కొన్నిసార్లు క్రింద ఉన్న బండలు అస్సలు కనిపించవు, అంతలా చీమలు చేరుతాయి. మేము క్రింద నిల్చోలేము, నడవలేము. ఒకవేళ కుటుంబంలోని వ్యక్తులందరూ ఇంట్లో ఉంటే గనక పడుకోవడం కూడా కష్టం. ఈమధ్య ఒకరోజు పడుకోవడానికి అస్సలు చోటు లేక అర్థరాత్రి వరకు కుర్చీలలో కూర్చుని ఉన్నాము. ఇక అప్పుడు నేను, "బాబా! చీమలు రావడం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కాసేపటికి చీమలు రావడం చాలావరకు తగ్గింది. బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. కొన్నిరోజుల వరకు బాగానే ఉంది. కానీ బహుశా బ్లాగులో పంచుకుంటానని చెప్పి పంచుకోవడం ఆలస్యమైనందువల్లనేమో ప్రస్తుతం చీమలు మళ్లీ వస్తున్నాయి. "బాబా! దయచేసి నా అనుభవం పంచుకోవడం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించి, మా బాధను తొలగించు తండ్రీ".
మా సిస్టర్‌కి ఒక పాప. పాప ఇంకా చిన్నగా ఉండగానే, అంటే తను పుట్టిన కొద్దిరోజులకే మా సిస్టర్ మళ్ళీ గర్భవతి అయ్యింది. పాప చాలా అల్లరి చేస్తుంది, అసలు మాట వినదు. అందువలన మా సిస్టర్ అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది. అందుకోసం హాస్పిటల్లో అడిగితే, మందులిచ్చారు. ఆ మందులు వేసుకున్నా కొన్నిరోజుల వరకు తనకి అబార్షన్ కాలేదు. అప్పుడు తను, "నాకు సర్జరీ ఏదీ అవసరం లేకుండానే మందులతో అబార్షన్ అవ్వాలి బాబా. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుంది. అయితే తనకి అబార్షన్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో మా సిస్టర్ చాలా కష్టాన్ని, బాధను అనుభవించింది. మందులతో అబార్షన్ అయితే తనకి అంత బాధ, కష్టం ఉండదని తను బాబాను చాలా వేడుకుంది. కానీ కొన్నిసార్లు ఏది చేస్తే మనకి మంచిదో బాబాకే తెలుసు. ఆయన దయవల్ల ఇప్పుడు మా సిస్టర్ బాగుంది. "బాబా! అనుకున్న ప్రకారం నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పటివరకు చాలా సమస్యలకి పరిష్కారం చూపావు బాబా. వాటినన్నిటినీ పరిష్కరించిన మీరు నాకున్న ఒక సమస్యను మాత్రం ఎందుకు పరిష్కరించట్లేదో అర్థం కావట్లేదు. ఆ విషయంలో మీపై నాకు ఎన్నిసార్లు కోపం వచ్చినా మళ్ళీ 'నా బాబానే కదా' అని సమాధానపరచుకుంటున్నాను. నాకున్న సమస్యని పరిష్కరించి మానసిక ధైర్యాన్ని ఇవ్వు తండ్రీ. ఇక మీ దయ, ఎలా నా జీవితానికి ఒక దారి చూపుతావో!"
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
ప్రమోషన్ సమస్యను పరిష్కరించిన బాబా
ముందుగా బాబాకు నమస్కారాలు. బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు రత్నాజీ. నా ఉద్యోగం, ప్రమోషన్, పెళ్లి, పిల్లలు అన్నీ బాబా నాకు ప్రసాదించిన భిక్ష. ఆయన దయతో నేను కోరుకున్నట్లు మొదట బాబుని(సాయి సుధన్వ్), రెండోసారి పాపను(సాయిశ్రీ అనఘ, నాలుగు నెలల వయసు) మాకు ప్రసాదించారు. బాబా దయవల్లే నాకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. కానీ ప్రమోషన్ విషయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పైస్థాయి జీతమిస్తూ డ్యూటీ మాత్రం పాతదే చేయించేవారు. కానీ ఉన్నత హోదాను ఎవరు వదులుకుంటారు? ఒక సంవత్సర కాలం గడిచాక నేను అవమానభారంతో, "బాబా! మీ దయతో నా సమస్య తీరి నాకు ప్రమోషన్ వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన కృపవలన ఒక హైకోర్టు జడ్జి జిల్లా జడ్జికి నా పేరు చెప్పడం, క్షణాల్లో సమస్య పరిష్కారమవడం జరిగిపోయాయి. నాకు మంచి హోదాతో కూడిన పోస్టు ఇచ్చి సమీపాన ఉన్న ఊరికి బదిలీ చేసారు. ఇది సాయి దయతోనే సాధ్యమైంది. బాబా కరుణతో కురిపించే అవ్యాజమైన ప్రేమకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి? ఇలా బ్లాగులో పంచుకోవడమైనా ఆయన ఇచ్చిన అవకాశమే కదా! "ధ్యన్యవాదాలు బాబా. ఇలాగే మీ కరుణాకటాక్షాలు ఎప్పటికీ నాపై, నా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. పిల్లలతో కొత్త ఇంటికి మారుతున్నాము. అన్నీ మీరే చూసుకోవాలి బాబా. సొంతింటి కలను నెరవేర్చు తండ్రి. అలాగే తదుపరి ప్రమోషన్ కోసం అప్పీల్‍కి వెళ్ళాను. అవి నెరవేరితే మరల నా అనుభవాలు మీ బ్లాగులో పంచుకుంటాను. మా జీవిత పగ్గాలు మీ చేతుల్లో పెడుతున్నాము, మీ దయ తండ్రి".
ప్రేమతో సమస్యను పరిష్కరించిన బాబా
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఎనిమిది సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నేను ఈరోజు ప్రాణాలతో ఉండటానికి కారణం బాబాయే. ఆయన నా జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రతి విషయంలో నా వెన్నంటే ఉండి, నన్ను ముందుకు నడిపిస్తూ ఎన్నో కష్టాలను గట్టెక్కించారు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈమధ్య కూడా ఒక సమస్యని తీర్చారు. అదేమిటంటే, ఈమధ్య నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు బంధువుల కారణంగా నాకు, నా భర్తకు మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో ఆయన నాతో రెండురోజులు మాట్లాడలేదు. సమస్య పెద్దది అవుతుందేమోనని భయమేసి బాబాను ప్రార్థించాను. ఆయన ప్రేమతో నా సమస్యను పరిష్కరించారు. మావారు తనంతట తానే నాకు ఫోన్ చేసి, నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. బాబానే నాకున్న బంధాన్ని నిలిపారు. "బాబా! ఈ బంధాన్ని కడవరకు తోడుగా ఉండేలా, నా సమస్యలను అర్థం చేసుకుని ముందుకు సాగేలా ఆశీర్వదించు తండ్రి. అదేవిధంగా మా బాబు భవిష్యత్తు కూడా బాగుండేలా చూడు స్వామి. మీ సచ్చరిత్ర నిత్య పారాయణ వల్ల ఎంత చెప్పినా తక్కువే అనిపించేలా ఎన్నో అనుభవాలు నేను పొందాను. ప్రస్తుతం నాకున్న సమస్య ఏమిటో మీకు తెలుసు బాబా. దాన్ని కూడా తీర్చి మరల ఈ బ్లాగు ద్వారా నా అనుభవాలను పంచుకునే అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. చివరిగా మా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. మీకు నా శతకోటి వందనాలు బాబా".
ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Bless supraja for her neck pain and shoulder pain and help her to cure health problems. Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba all says reading satcharitra they experienced baba miracles. But i could not experience anything baba. I want your love and affection. Om sai ram
ReplyDelete