1. సర్వస్యశరణాగతి వేడితే, అన్నీ అనుకూలంగా మార్చి ఆనందాన్నిస్తారు బాబా
2. ఇల్లు విడిచి వెళ్ళిన పెద్దాయన్ని తిరిగి ఇల్లు చేర్చిన బాబా
3. బాబా దయవుంటే ఏదైనా సాధ్యమే
సర్వస్యశరణాగతి వేడితే, అన్నీ అనుకూలంగా మార్చి ఆనందాన్నిస్తారు బాబా
సాయిభక్తులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సులు. నా పేరు మణి. నేనొక ఉపాధ్యాయురాలిని. సాయికృపతో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పడానికి నేను ఆనందిస్తూ ఒక రెండు అనుభవాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా ప్రాణస్నేహితుని కుమారుని మానసిక ఎదుగుదల కాస్త వెనుకబడి ఉన్నందున ఆ అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డ పదవ తరగతి ప్రధాన పరీక్షలు వ్రాస్తే పాస్ అవడేమోనని చాలా బాధపడుతుండేవాళ్లు. ఆ బాధను వారిరువురు నాతో చెప్పుకుంటుండేవాళ్లు. 2020-21 సంవత్సరంలో ఒకరోజు నేను ఆ అబ్బాయిని, వాళ్ల అమ్మను మా ఇంటికి పిలిచి, మా పూజగదిలో బాబా విగ్రహం ముందు ఆ అబ్బాయికి బాబా ఊదీ పెట్టి, బాబాను తీవ్రంగా ప్రార్థించాను. తరువాత వాళ్ళకి బాబా లీలలు ఎన్నో చెప్పాను. ఇంకా ఒక ఫ్రెండ్‍లా ఆ అబ్బాయితో ఊరట కలిగేలా నాలుగు మాటలు చెప్పి, తన తల్లిదండ్రులతో నమ్మకంతో ఓపికగా ఉండమని చెప్పాను. బాబాని మనస్ఫూర్తిగా అడిగితే జరగనిదంటూ ఉండదు కదా! కరోనా కారణంగా ఆ సంవత్సరం పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. అది బాబా చేసిన ఒక అద్భుతం! మా ఆనందానికి అవధులు లేవు. 2022లో ఆ అబ్బాయి ఇంటర్ 73%తో పాస్ అయ్యాడని తెలిసి సంతోషంతో సాయికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎల్లప్పుడూ ఆ అబ్బాయికి రక్షగా ఉండమని మనస్పూర్తిగా బాబాను వేడుకుంటున్నాను.
2009లో నా వెన్నుపూసకు సర్జరీ అయింది. సాయి దయతో నేను అప్పుడు ప్రాణహాని జరగకుండా తప్పించుకున్నాను. ఇకపోతే, ఈ మధ్యకాలంలో నేను నడుమునొప్పి, మెడనొప్పి మరియు చెయ్యినొప్పితో విపరీతంగా బాధపడుతున్నాను. ఒక్కోసారి ఆ బాధ తట్టుకోలేక 'ఇక జీవితం చాలు' అనిపిస్తుండేది. అటువంటి సమయంలో ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, 'ఈ నొప్పులు గురుపౌర్ణమి నాటికి తగ్గితే, నేను కూడా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాల'ని అనుకున్నాను. గురుపౌర్ణమికి రెండురోజుల ముందు నొప్పి భరించలేక హైదరాబాద్‍లోని హాస్పిటల్‍కి వెళ్లాలని అనుకున్నాను. తరువాత జులై 12, అంటే గురుపౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం బాబా ఊదీ రాసుకుని ఆయన విగ్రహం ముందు కన్నీటితో, "నొప్పులు తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. చాలా విచిత్రంగా నొప్పి తగ్గుతున్నట్టుగా నా మనస్సుకి ఏదో తెలియని అనుభూతి కలిగింది. అంతేకాదు, నొప్పి పూర్తిగా తగ్గిపోయింది కూడా. శ్రద్ధ, సబూరీలతో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని సాయి ఋజువు చేశారు. మరుసటిరోజు గురుపౌర్ణమినాడు మేము ఎప్పటిలాగే గుడికి వెళ్ళి, సాయికి అభిషేకం చేసుకున్నాము. వరంగల్ శ్రీభద్రకాళిమాత సాయిమందిరంలో అయ్యగారు, "మీరు పిలిస్తే సాయి లేచి వస్తారు" అని అన్న మాట నా మనసుకి ఎంతో ఆనందం కలిగించింది. ఎంత అదృష్టమో అనిపించి ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను ఈ గురుపౌర్ణమినాడు మూడు సాయిమందిరాలలో అభిషేకం, పల్లకీ సేవ, అన్నదానాలలో పాల్గొని ఆనందంగా ఇంటికి చేరి ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపుతున్నాను. సాయిని సర్వస్యశరణాగతి వేడితే, ఆయన అన్నీ మనకు అనుకూలంగా మార్చి ఆనందాన్ని ఇస్తారు. మనలోనేకాక అందరి హృదయాల్లో కొలువై ఉన్న సాయికి జయమగుగాక!
ఇల్లు విడిచి వెళ్ళిన పెద్దాయన్ని తిరిగి ఇల్లు చేర్చిన బాబా
ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేశారు. నేను ఇదివరకు రెండుసార్లు నా అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి మా అల్లుడి ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో ఆపరేషన్ బాగా జరిగితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన మా అల్లుడికి ఆపరేషన్ బాగా జరిగి, కోలుకున్నారు. "ధన్యవాదాలు బాబా".
మా చుట్టాల్లో ఒక పెద్దాయన తన తమ్మునికి కొంచెం ఆస్తి ఇచ్చి, వారితో వడ్డీ తీసుకుని జీవనం సాగిస్తుండేవాడు. కొన్నేళ్ళ తర్వాత తమ్ముడు డబ్బులు ఇవ్వడం మానేశాడు. దాంతో వీళ్ళకి ఇల్లు గడవడం కొంచెం కష్టమైంది. 'నేను సంపాదించి ఇంటి అవసరాలు చూసుకుంటాన'ని కూతురు చెప్పినా ఆ పెద్దాయన వినిపించుకోలేదు. ఆయన మనసుకు చాలా కష్టమై ఇల్లు విడిచి వెళ్లిపోయారు. నాకు ఈ విషయం తెలిసి, "బాబా! ఆ పెద్దాయనని తిరిగి ఇంటికి తీసుకుని వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ పెద్దాయన పాపం ఎక్కడెక్కడో తిరిగి శిరిడీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఆర్యవైశ్య సత్రానికి వెళ్లి పని అడిగితే, వాళ్ళు ఈయన్ని ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అడిగారు. అందుకు ఈయన వాటిని రైలులో పోగొట్టుకున్నానని చెప్పారు. కానీ వాళ్ళకు ఏదో అనుమానం వచ్చి, ఏదైనా ఫోన్ నెంబర్ ఇమ్మని అడిగారు. ఈయన పొరపాటున తన భార్య నెంబరు ఇచ్చారు. ఆ సత్రంవాళ్ళు ఆయన భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆవిడ, "మీరు ఆయన్ని అక్కడే ఉండేలా చేయండి. మేము ఇప్పుడే బయలుదేరి వస్తామ"ని చెప్పింది. వెంటనే ఆవిడ, ఆ పెద్దాయన తమ్ముడు, తండ్రి ముగ్గురూ కలిసి శిరిడీ వెళ్లి ఆయన్ని తీసుకుని వచ్చారు. ఇది జరిగి మూడు నెలలు అయింది. రోజూ బాబా అనుగ్రహాన్ని పంచుకుందామని మర్చిపోతున్నాను. "దయచేసి నన్ను క్షమించండి బాబా!"
బాబా దయవుంటే ఏదైనా సాధ్యమే
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!
నేను సాయిభక్తురాలిని. నా ప్రతి విషయంలో బాబా, గురువుగారు(శరత్‌బాబూజీ) తోడుగా ఉంటారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే వారిరువురే కారణం. ఒక్కోసారి అనుకున్న పని ఎలా జరుగుతుందా అని టెన్షన్ పడతాను. కానీ బాబా దయవల్ల ఆ పని ఎంతో బాగా, సుళువుగా జరిగిపోతుంది. మావారు ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్‍లో పని నిమిత్తం మనిషి అవసరం. అందువలన మా చుట్టాలబ్బాయి మా దగ్గర ఉంటున్నాడు. ఒకసారి తను ఏదో పని ఉందని ఊరు వెళ్లి, 'నేను ఇంక రాను' అన్నాడు. తను రాకపోతే ఇక్కడ పని ఆగిపోయే పరిస్థితి. అంతలో నేను ఈ బ్లాగులో తోటి భక్తులు పంచుకునే అనుభవాలు చూసి, "బాబా! ఆ అబ్బాయి తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతే, నాలుగో రోజుకి ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు. మాకు ఎంతో సంతోషమేసింది. ఇలా బాబా దయవల్లే మా ఆయన బిజినెస్, పిల్లల చదువులు అన్నీ బాగున్నాయి. ఒకప్పుడు నాకు శ్రీఅరుణాచలం గిరిప్రదక్షిణ చేయాలని కోరిక ఉండేది. కానీ అంత దూరం నడవలేనని భయపడ్డాను. అయితే బాబా అనుగ్రహం వల్ల నా కోరిక నెరవేరింది. పిల్లలు కూడా ఆ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను బాబా, గురువుగారూ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteEapcet web options lo seat ravali thadri.please baba
ReplyDeleteసమర్ధ sadgru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDelete