1. బాబా చూపుతున్న కరుణ
2. ఎంతో క్రిటికల్ కండిషన్ నుండి ఊదీతో బాబా రక్షణ
3. శ్రీసాయి కరుణ
బాబా చూపుతున్న కరుణ
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నేను సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఈమధ్య బాబా నా మీద చూపిన కరుణను, ప్రేమను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2015 నుండి నా ప్రమోషన్ మరియు ట్రాన్స్‌ఫర్ విషయంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. పదేళ్లలో ఎన్నోసార్లు నేను నిజామాబాద్‍కి ట్రాన్స్‌ఫర్ కోసం ప్రయత్నించాను. నేను పది సంవత్సరాల నుండి హెచ్ఆర్ఏ, సీసీఏ(City Compensatory Allowance) క్లెయిమ్ చేయలేదు. అయినా నాకు న్యాయం జరగలేదు. పోనీ, నాకు ప్రమోషన్ అయినా ఇస్తారనుకుంటే, అది కూడా ఇవ్వలేదు. ఎన్నో సంవత్సరాలు ప్రమోషన్ పెండింగ్లో ఉండిపోయింది. నేను హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసింది కేవలం మూడు సంవత్సరాలే. అది కూడా డిప్యుటేషన్ మీద. నాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని బాబా ఎందుకలా చూస్తూ ఊరుకుండేవారో నాకు అర్థమయ్యేది కాదు. ఈసారి నేను రోజూ బాధతో నాకు జరుగుతున్న అన్యాయం గురించి బాబాతో చెప్పుకుని, "నాకు న్యాయం చేయమ"ని గట్టిగా ప్రార్థించాను. బాబా నాకు న్యాయం జరిగేలా చేశారు. ఆయన దయవల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. ఈసారి ప్రమోషన్ రాకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించుకోలేను. "ధన్యవాదాలు బాబా. నేను ఏమేమి జరగాలని మిమ్మల్ని ప్రార్థించానో అందులో కొన్ని జరిగాయి. కానీ నిజామాబాద్కి నా ట్రాన్స్‌ఫర్ మాత్రం కాలేదు. మీకు మాటిచ్చినట్లే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకున్నాను. కానీ కొంచెం ఆలస్యమైంది బాబా. అది ఎందుకో మీకు తెలుసు. ఇప్పటికీ ప్రమోషన్ విషయంలో గందరగోళం ఉంది. నా ప్రమోషన్ పోస్టుకి ఎలాంటి ఢోకా లేకుండా చూడు తండ్రీ".
ఈమధ్య మా తమ్ముడి ఉద్యోగం విషయంగా మా అమ్మ మనసులో ఏదో టెన్షన్ పెట్టుకుని రాత్రి నిద్రపోలేదు. మధ్యరాత్రిలో హఠాత్తుగా ఆమె నన్ను లేపి, "గుండె దడదడా కొట్టుకుంటోంది. కాళ్ళుచేతులు ఆడట్లేదు" అని చెప్పేసరికి నాకు చాలా భయమేసింది. వెంటనే బాబాకి చెప్పుకుని, అమ్మకి ఊదీ పెట్టి, ఊదీ కలిపిన నీళ్లు త్రాగించాను. తరువాత మనసులో 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ తెల్లవారేవరకు నేను నిద్రపోలేదు. ఉదయానికి అమ్మకి తగ్గింది. "ధన్యవాదాలు బాబా".
ఒకసారి మా పెద్దబాబు కాలుజారి పడిపోతే, తన నుదురుకి పెద్ద దెబ్బ తగిలి వాపు వచ్చింది. వెంటనే తనని హాస్పిటల్‍కి తీసుకెళ్తే డాక్టర్, "స్కానింగ్ చేయాలి. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే తరువాత సమస్య అవుతుంది" అని చెప్పడంతో, బాబుకి స్కానింగ్ తీయించి, "బాబా! బాబుకి పెద్దగా ఏమీ కాలేదు అని రిపోర్ట్ నార్మల్‍గా వస్తే నా అనుభవాన్ని వెంటనే అందరితో పంచుకునేందుకు బ్లాగుకి పంపుతాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో రిపోర్ట్ నార్మల్గా వచ్చింది. ఇలా ఎన్నో విషయాలలో బాబా తమ ప్రేమను నాకు చూపిస్తున్నారు. ఈమధ్య నేను ఏ పని చేయాలన్నా బాబా అనుమతి తీసుకుని చేస్తున్నాను. అనుకున్నట్టే పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తున్నా బాబాకి మ్రొక్కుకోగానే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం జరగట్లేదు. "థాంక్యూ సో మచ్ సాయీ. చిన్న చిన్న పిల్లలున్నారు బాబా. నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగాల వల్ల వాళ్లతో గడపలేకపోతున్నాము. ప్లీజ్ బాబా! ఈ విషయంలో నాకు మంచి జరిగేలా ఆశీర్వదించండి. మాకున్న పెద్దపెద్ద సమస్యలను పరిష్కరించి మాకేది మంచిదో అది చేయండి. వృత్తి జీవితంలో నాకు న్యాయం జరిగేలా చూడు. నా జీవితం మీ చేతిలో ఉంది. ఇక అంతా మీ దయ బాబా".
ఎంతో క్రిటికల్ కండిషన్ నుండి ఊదీతో బాబా రక్షణ
ముందుగా నా తండ్రి బాబాకి పాదాభివందనాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశాను. బాబా నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చూపించారు. వాటిని ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను. నేను నా ఉద్యోగరీత్యా మొట్టమొదటిసారి 1989లో శిరిడీ వెళ్ళాను. అప్పట్లో అంత రద్దీ ఉండేది కాదు. నేను ఒక స్టీలు పళ్ళెంలో పూజాద్రవ్యాలు తీసుకుని అందరితోపాటు సమాధిమందిరానికి వెళ్ళాను. మందిర ప్రవేశద్వారం దాటి లోపలికి వెళ్లి మొదటిసారి బాబాని చూడగానే తెల్లగా ఏదోలా అనిపించింది. నా మనసుకి, 'ఇక్కడ ఏముంది? ఈ బాబా కొరకు ఎందుకు వస్తున్నారు?' అని అనిపించింది. తర్వాత ఇంటికి వెళ్ళాను. ప్రమాణపూర్వకంగా చెపుతున్నాను, 'ఏమైందో తెలీదు, ఎలా జరిగిందో తెలీదుకానీ, రోజురోజుకీ అప్రయత్నంగా బాబా గుర్తుకురావడం, మళ్ళీ ఆయన్ని చూడాలనిపించడం జరుగుతూ నాకు తెలియకుండానే బాబాపైన ఎనలేని భక్తిభావం పెరుగుతూ వచ్చింది'. 1991లో మళ్ళీ శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా ఊదీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటినుండి బాబాని మనస్ఫూర్తిగా మ్రొక్కుతుండేవాడిని. ఇలా ఉండగా 1993, ఏప్రిల్ నెలలో ఒకరోజు రాత్రి 11 గంటలకు నేను చూస్తుండగానే మా నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన గుండె పట్టుకుని అరుస్తుంటే, నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాబా ఊదీ తెచ్చి నాన్న గుండెపై రుద్దాను. కొద్దిసేపటికి నాన్న నార్మల్ అవగానే ఆయన్ని మా ఊరులోని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఆ సమయంలో హాస్పిటల్లో గోల్డెన్ అవర్‌లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ లేదు. కేవలం ఈసీజీ చేసి, హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి, సోర్బిట్రేట్ టాబ్లెట్ ఇచ్చారు. మరుసటిరోజు ఉదయం నాన్నని నిజామాబాద్ తీసుకెళ్లి, అక్కడి హాస్పిటల్లో జాయిన్ చేశాము. అక్కడ అన్ని టెస్టులు చేసి, హార్ట్ స్ట్రోక్‍గా నిర్ధారించి ఒక వారం తర్వాత డిశ్చార్జ్ చేసి, హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్‍కి వెళ్ళమని చెప్పారు. అలాగే వెళితే, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి, "CAD 80%, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. కానీ సర్జరీ చేయడానికి లేద"ని మందులు రాసిచ్చారు. CAD 80%, మల్టిపుల్ బ్లాక్స్ అంటే చాలా క్రిటికల్ కండిషన్. పరిస్థితి అంత క్రిటికల్గా ఉన్నా కూడా ఆయనకి హర్ట్ ఎటాక్ వచ్చినప్పుడు నేను ఉపయోగించిన ఊదీ ప్రభావం వలన ఇప్పటివరకూ నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. అంతా బాబా దయ, కరుణాకటాక్షం.
శ్రీసాయి కరుణ
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తూ సాయిలీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తుడిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను పని మీద అర్జెంట్‍గా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అంత హఠాత్తుగా అంటే టికెట్ రిజర్వేషన్ కష్టం కాబట్టి, రాత్రి ఫాస్ట్ పాసెంజర్ ఎక్కుదామనుకున్నా జనరల్లో సీటు దొరకడం చాలా కష్టం. దురదృష్టంకొద్దీ సీటు దొరకకపోతే రాత్రంతా నిద్ర ఉండదు. ఇట్టి స్థితిలో నేను సాయిబాబా మీద నమ్మకముంచి, "బాబా! ఈరోజు ట్రైన్ ఖాళీగా ఉండి, నాకు సీటు దొరికితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. ట్రైన్ వచ్చాక చూస్తే, ఆశ్చర్యం! జనరల్లో చాలావరకు ఖాళీగా ఉంది. మొత్తం బోగీలో 10 మంది కూడా లేరు. అదే ట్రైన్‌లోని స్లీపర్‌లో వెయిటింగ్ లిస్టుతో కనీసం కూర్చోడానికి చోటు కూడా లేదు. నేను హాయిగా ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకుని నా భార్యని కలుసుకున్నాను. అంతా ఆ దయామయుడి కరుణ. "ధన్యవాదాలు బాబా. గర్భవతి అయిన నా భార్యకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. అవి తగ్గేలా చూసి, తనకి నార్మల్ డెలివరీ అయ్యేలా అనుగ్రహించు తండ్రీ. అలానే, నాకు రావాల్సిన ప్రమోషన్ వచ్చేలా, నా ప్రయత్నం సఫలీకృతం అయ్యేలా చూడు తండ్రీ. మీరు, 'జాతకాలు నమ్మవద్దని, మా జీవితాలలో మీ అనుగ్రహం తప్ప గ్రహాల ప్రభావం ఉండద'ని చెప్తారు కదా! దయచేసి నా రాశిఫలాలలో ఉన్నట్లుగా కాకుండా మీ అనుగ్రహంతో నా కష్ఠాలన్నీ తీరిపోయేలా చూడు తండ్రీ".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteOm sai ram 2nd experience is very nice.with sai's udi many health problems is solving.with many block ages sai udi cured him.please bless my husband also with health and wellness.keep children also with health and wellness.om sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sri Gurubhyo namaha🙏🙏🙏🙏🙏
ReplyDeleteSeat ravali thandri please baba
ReplyDelete