1. కష్టమేదైనా సమయానికి బాబా రక్షణ అందుతుంది
2. సాయినాథుని వేడుకుంటే జరగనిదంటూ ఉండదు
3. కౌలుకి మంచి వ్యక్తిని చూపిన సాయి
కష్టమేదైనా సమయానికి బాబా రక్షణ అందుతుంది
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా దయతో నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2019లో అకస్మాత్తుగా నా చిన్న చెల్లెలికి స్టేజ్-2 క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యేసరికి మేమంతా విస్తుపోయాం. అప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకి అలా జరిగినందుకు నాకు బాబా మీద కోపమొచ్చి, "చెల్లికి క్యాన్సర్ లేకపోతే నేను కాలినడకన తిరుమల కొండెక్కుతాన"ని శ్రీవెంకటేశ్వరస్వామిని వేడుకున్నాను. కొంతకాలం తరువాత డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నేను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కొన్ని సాయిబాబా గ్రూపులలో జాయిన్ అయ్యాను. నేను ఎప్పుడు ఆ గ్రూపులు ఓపెన్ చేసినా శ్రీవెంకటేశ్వరస్వామి ఫోటోలు వస్తుండేవి. తరువాత మా చెల్లికి శస్త్రచికిత్స, తదుపరి పరీక్షలు జరిగిన మీదట తనకి క్యాన్సర్ లేదని వైద్యులు నిర్ధారించారు. ఇది ఒక అద్భుతం! ఈ అద్భుతాన్ని చేసి మా జీవితాల నుండి క్యాన్సర్‌ను తరిమేసింది బాలాజీ రూపంలో ఉన్న బాబా తప్ప మరెవరో కాదని కొన్ని ఫేస్‌బుక్ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా నేను గ్రహించాను. ఇంతటి సహాయం చేసిన బాబాకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇకపోతే, బాబా నా చెల్లెలి ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి చాలావరకు అప్పులు తీర్చడంలో సహాయం చేసారు. ఇకమీదట బాబా వాళ్ళకి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
2022, జూలై నెల రెండవ వారాంతంలో టీటీడీవాళ్ళు యు.ఎస్.ఏలోని మా బాలాజీ టెంపుల్లో కల్యాణం చేస్తుంటే మేము వర్షంలోనే ఆలయానికి వెళ్లి ఉదయమంతా అక్కడే ఉన్నాము. నేను తిరుపతి లడ్డు ప్రసాదం కోసం ఎంతగానో కష్టపడిన మీదట ప్రసాదం లభించింది. కానీ అది తిరుపతి లడ్డులా అనిపించలేదు, రుచి అస్సలు లేదు. నేను చాలా నిరాశతో ఇంటికి వచ్చాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేచి చూస్తే, వంటగదిలో చిన్న ప్యాకెట్‌లో ఒరిజినల్ తిరుపతి లడ్డు కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యమేసి, "ఎవరైనా ఇచ్చారా?" అని నా భర్తను అడిగాను. అందుకాయన, "లేద"ని చెప్పారు. 'మరి అదెలా వచ్చిందా?' అని ఆలోచిస్తుంటే ముందురోజు సాయంత్రం నా కుమార్తె తన స్నేహితురాలి అమ్మగారిని చూడటానికి వెళ్ళినప్పుడు, ఆవిడ ఆ లడ్డు ఇచ్చారని నాకు తరువాత తెలిసింది. నిజానికి వాళ్ళు ఇండియా నుండి వచ్చిన తర్వాత నా కూతురు వాళ్ళింటికి రెండుసార్లు వెళ్ళింది. కానీ అప్పుడు ఆవిడ ఆ తిరుపతి లడ్డు ఇవ్వలేదు. ఏదేమైనా కొన్నిసార్లు బాబా మన చిన్న చిన్న కోరికలను ఈవిధంగా తీరుస్తుంటారు. నేను ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపాను.
నేను నా ఆఫీసులో కొంత ఇబ్బందిపడుతుంటే బాబా ఒక ప్రాజెక్ట్ ద్వారా నాకు మంచి పేరు వచ్చేలా సహాయం చేసారు. అలాగే నా భర్త ఆరోగ్య విషయంలో సకాలంలో శస్త్రచికిత్సకు వెళ్లేలా బాబా సహాయం చేసారు. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా అనుభవాలను వివరంగా చెప్పలేకపోయాను కానీ, 'బ్లాగులో పంచుకుంటాన'ని బాబాకి మ్రొక్కుకున్నాకే నా ఈ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఏ కష్టమైనా బాబా మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. సమయానికి ఆయన రక్షణ మనకు అందుతుంది. కాబట్టి బాబాపై మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. 2022 డిసెంబరులో నా మొక్కులన్నీ తీర్చుకునేలా మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నా కూతురి జీవితం బాగుండేలా ఆశీర్వదించండి బాబా".
సాయినాథుని వేడుకుంటే జరగనిదంటూ ఉండదు
శ్రీసాయినాథునికి శతకోటి నమస్కారాలు. సాయిబంధువులందరికీ ఎల్లవేళలా శ్రీసాయి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు శ్రీరంజని. ఒకరోజు రాత్రి 12 గంటల వరకు నేను ఆఫ్‌లైన్ క్లాసులు విని అమ్మ పళ్లెంలో తెచ్చిపెట్టిన అన్నం తినకుండానే నిద్రపోయాను. శ్రీఅన్నపూర్ణాదేవి ఆగ్రహమో, నా ప్రారబ్ధమో తెలియదుకానీ, మరుసటిరోజు నుండి నాకు చాలా నీరసంగా ఉండేది. ఏ పనీ చేయలేక, చదువుకోలేక నేను నా చివరి సంవత్సరం పరీక్షలు కూడా సరిగా వ్రాయలేకపోయాను. రెండు నెలలు ఆ నీరసంతో బాగా ఇబ్బందిపడ్డాను. రక్తపరీక్షలు చేయించుకుంటే, బాబా దయవల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యా లేదని వచ్చింది. కానీ నీరసం మాత్రం తగ్గలేదు. అప్పుడు నేను, "నీరసం తగ్గితే, తోటి భక్తులతో నా అనుభవం పంచుకుంటాన"ని అనుకున్నాను. తరువాత ఒకరోజు బ్లాగులో ఒక భక్తురాలు ఐదు రోజులు, ఐదు దీపాలు పెట్టి సాయి పూజ చేశానని పంచుకున్నారు. అలా నేను కూడా ఐదు రోజులు సాయికి పూజ చేశాను. తరువాత బాబా మీద భారం వేసి ఉద్యోగం వెతుక్కొని హైదరాబాదుకి బయలుదేరాను. 'నీ కంటే ముందే నేను అక్కడ ఉన్నాను' అని బాబా నాకు సందేశం ఇచ్చారు. అలాగే, మా హాస్టల్లో, మా ఆఫీసులో, ఆఖరికి మా క్లయింట్ ఆఫీసులో కూడా ఫోటో రూపంలో బాబా నాకు దర్శనమిచ్చారు. మా హాస్టల్ నుండి మెట్రోస్టేషనుకి అర కిలోమీటరు దూరం. రోజూ హాస్టల్ నుండి ఆఫీసుకి వెళ్ళడానికి గంట సమయం పడుతుంది. అంత ప్రయాణం చేసి ఉద్యోగం చేసుకుంటున్న నాకు ఇప్పుడు ఎటువంటి నీరసం లేదు. ఖచ్చితంగా ఇది బాబా దయ. శ్రీసాయినాథుని వేడుకుంటే జరగని కార్యమంటూ ఉండదు. "థాంక్యూ సో మచ్ బాబా".
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
కౌలుకి మంచి వ్యక్తిని చూపిన సాయి
నేనొక సాయిభక్తురాలిని. మాకున్న పొలాన్ని కౌలుకి ఇచ్చాము. వాళ్ళు ఏ కారణాల చేతనో వ్యవసాయం చేయలేమని వదిలేసారు. దాంతో కొత్తవాళ్ళ కోసం చూస్తే ఈ సంవత్సరం(2022) కౌలుకి ఎవరూ కుదరలేదు. ఆ కారణంగా మా అమ్మ టెన్షన్ పడసాగింది. సమస్య చిన్నదే అయినా మా అమ్మ బాధని చూడలేక నేను, "సాయీ! నీవే పొలం విషయంలో మార్గం చూపించు" అని సాయిని వేడుకుని, 'ఓం శ్రీసాయి మార్గబాంధవాయ నమః', 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే సాయి నామాలను స్మరించాను. వారంలో సాయి మంచి వ్యక్తిని కౌలుకి చూపించారు. "ధన్యవాదాలు సాయీ. మీ వరప్రసాదంగా గురువారంనాడు పుట్టిన మా అమ్మాయి ఈ సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షలు వ్రాస్తుంది. తనకేది మంచిదో అది చేసి తన భవిష్యత్తుకి చక్కటి మార్గాన్ని చూపు తండ్రీ".
Om Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteSri sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram please bless my family.my sister _ in _law suffered from cancer.she suffered for 2 years.she went to u.s.a. in last stag.she expired in May 10th.This year.It is hell to her in health issue.she is very good woman.she lived for others.she is devotee of Lalitha ma
ReplyDeleteLalitha sahasra namaskaram she did parayana.listening that namaas she left this world.ilost my sister i feel sad.my
Brother's wife brother also expired due to cancer.Baba please remove pain full deadly disease