సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1271వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన మేలు
2. అన్నివిధాలా కాపాడే బాబా
3. భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీసాయిబాబా

బాబా చేసిన మేలు


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లత. ఒకరోజు మావారు, 'నా ఉంగరం ఎక్కడో పోయింది, కనిపించటంలేద'ని చెప్పారు. దాంతో అన్నిచోట్లా ఉంగరం కోసం వెతికాము, కానీ ఉంగరం దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ కృపవలన ఉంగరం దొరకాలి" అని బాబాను వేడుకున్నాను. అంతే, ఆ ఉంగరం విచిత్రంగా మావారి జేబులోనే దొరికింది. మాకు చాలా సంతోషమేసింది.


కోవిడ్ సమయంలో మా మనవడి పుట్టినరోజు జరుపుకోవటానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అలా ఆ రెండు సంవత్సరాలూ మనవడి పుట్టినరోజు చేయలేకపోయాము. కాబట్టి మూడవ పుట్టినరోజైనా ఘనంగా జరిపించదలచి, "మా కోరికను నెరవేర్చమ"ని సాయితండ్రిని వేడుకుని బహిరంగప్రదేశంలో పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశాము. బాబా కరుణించి ఆరోజు వర్షం పడకుండా, ఇంకెలాంటి ఆటంకాలు లేకుండా చేసి వేడుకను చాలా ఘనంగా జరిపించి మా కోరిక నెరవేర్చారు. "ధన్యవాదాలు బాబా. మీ దయ మాపై ఎల్లప్పుడూ ఇలాగే ప్రసరించాలని వేడుకుంటున్నాను సాయితండ్రీ".


మావారికి కోవిడ్ వచ్చి తగ్గాక పోస్ట్ కోవిడ్ సమయంలో 'బైపోలార్ డిజార్డర్' అనే ప్రాబ్లెమ్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా అది కంట్రోల్ కాలేదు. మాకు చాలా భయమేసి, "బాబా! నీదే భారం తండ్రీ, మీ పాదాలనే నమ్ముకున్నాం. ఏమి చేసినా మీరే చేయాలి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు నుండి ఆ సమస్య క్రమేపీ తగ్గిపోతూ బ్యాలెన్స్ అయి మావారు మామూలు స్థితికి వచ్చారు. "థాంక్యూ బాబా. మీ పాదాల చెంత మాకు చోటు ఇవ్వమని అడగటం తప్ప ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం? మీరు చేసిన మేలు అంతా ఇంతా కాదు సాయితండ్రీ".


ఒకసారి మా ఇన్నోవా కారు రిపేర్ చేయించాల్సి వచ్చి ఎన్నిసార్లు షోరూంకి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అవలేదు. అప్పుడు నేను బాబాకి చెప్పుకున్నాను. తరువాత ఒక ప్రైవేట్ మెకానిక్‌కి కారుని చూపిస్తే, బాబా దయవల్ల సమస్య పరిష్కారమైంది. "థాంక్యూ బాబా".


ఒకసారి డాక్టరు నాతో థైరాయిడ్ టెస్టు చేయించుకోమని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! రిపోర్ట్ నార్మల్ వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. రిపోర్టులో థైరాయిడ్ బోర్డరులో ఉందని వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా బంగారం".


అన్నివిధాలా కాపాడే బాబా


నేనొక సాయిభక్తుడిని. సాయిబాబా తమ కరుణాకటాక్షాలతో నన్ను, నా కుటుంబాన్ని చాలాకాలం నుంచి కాపాడుతున్నారు. మేము ఒకప్పుడు మా అమ్మాయి ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నందున అమెరికా వెళదామని నిర్ణయించుకుని టికెట్లు మొదలుకుని అన్నీ సిద్ధం చేసుకున్నాం. తరువాత ప్రయాణమయ్యేలోపు నేను మెడికల్ చెకప్ చేయించుకుంటే, అందులో ట్రెడ్‌మిల్ టెస్టులో తేడా కనిపించింది. మా ఫ్యామిలీ డాక్టరు, "తప్పనిసరిగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి యాంజియోగ్రామ్ చేయించుకోండి" అని బలవంతం చేశారు. దాంతో నాకు ఏం చేయడానికీ తోచక బాబాకి విన్నవించుకున్నాను. అప్పుడు బాబా నుండి కూడా కార్డియాలజిస్టుని కలవమని సందేశమొచ్చింది. నేను బాగా భయపడిపోయి, "బాబా! ఏ ప్రాబ్లం లేకుండా చూడమ"ని బాబాను ప్రార్థించి డాక్టరు దగ్గరకి వెళ్ళాను. అక్కడ కొన్ని టెస్టులు చేసి, "అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు అమెరికా వెళ్లొచ్చిన తరువాత కావాలంటే యాంజియోగ్రామ్ చేయించుకోండి" అని చెప్పారు. అది విని నా మనసు కుదుటపడింది. బాబా మనల్ని అన్నివిధాలా కాచి కాపాడుతుంటారని తెలిసినా మనం భయపడుతుంటాం. "ధన్యవాదాలు బాబా". ఈ బ్లాగుని స్వయంగా బాబానే నిర్వహిస్తున్నారని, నిజంగా ఇది 'వర్తమానకాల సాయిసచ్చరిత్ర' అని నా భావన.


భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీసాయిబాబా


సాయిభక్తులకు నా నమస్కారాలు. 'ఆధునిక సచ్చరిత్ర' అయిన ఈ బ్లాగులో పంచుకుంటామని చెప్పుకుంటే ఎంతటి బాధైనా మాయం అయిపోతుంది. "ఈ బ్లాగు ద్వారా ఎన్నో కోరికలు తీరుస్తూ మీరు మాతోనే ఉన్నారు బాబా. మీ దివ్య పాదాలకి నా వందనాలు తండ్రీ". నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. కరోనా సమయం మళ్ళీ మొదలైన తరుణంలో జ్వరం అంటేనే భయం వేస్తుండేది. అలాంటిది మొదట మా ఇంట్లో మా బాబుకి జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. బాబుకి తగ్గకపోయేసరికి మేము తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. జ్వరం తగ్గింది కానీ, దగ్గు తగ్గలేదు. దాంతో నేను, "బాబా! బాబుకి దగ్గు తగ్గితే, సాయిభక్తుల అనుభవమాలికలో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల తరువాత బాబుకి దగ్గు తగ్గింది. కానీ మా ఇంట్లో అందరికీ కూడా ఒకరి తరువాత ఒకరికి జ్వరం వచ్చింది. బాబా ఉండగా మనకి భయమెందుకు? ఆయన కృపతో మా అందరికీ కూడా తగ్గింది. "బాబా! భక్తుల పాలిట కల్పవృక్షం మీరు". 


ఈమధ్య మా అక్క కూతురు EAPCET వ్రాసింది. తరువాత ఆ పరీక్ష తాలూకా 'కీ' చూసినప్పుడు, తనకి 38 మార్కులే వచ్చాయి. కానీ ఆ పరీక్షలో 40 మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అందువలన మేము చాలా టెన్షన్ పడ్డాము. మా టెన్షన్ బాబాకి తెలుసు. మేము ఆయనతో, "బాబా! మీ దయతో పాప పరీక్షలో క్వాలిఫై అవ్వాలి తండ్రీ" అని వేడుకున్నాము. నా బాబా ఏం కోరుకున్నా తీరుస్తారు కదా! ఆయన దయవల్ల అద్భుతం జరిగింది. ఆ అమ్మాయి 44 మార్కులతో క్వాలిఫై అయింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా.  లవ్ యు సో మచ్ సాయీ. మీ ప్రేమను కోరుకోవడం తప్ప, మీకు మేము ఏమీ ఇవ్వలేము".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo