- ఎంతో పెద్ద సమస్యని నార్మల్ చేసేసిన బాబా
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా ప్రతి నిమిషం తన భక్తులకి తోడుగా ఉండి పిలవగానే పలికి, ఆపదల నుంచి కాపాడే బాబాకి శతకోటి నమస్కారాలు. అలాగే ప్రతి ఒక్కరికీ బాబా తమకు ప్రసాదించే అనుభవాలను పంచుకోవడానికి అనువుగా ఇలాంటి ఒక మంచి బ్లాగుని ఏర్పాటు చేసిన సాయికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగు వల్ల ఎంతోమందికి బాబా మీద నమ్మకం పెరుగుతుంది. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాల ద్వారా బాబా ఎంతోమందికి ఓదార్పుని, తామున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇకపోతే, ఏ సమస్య వచ్చినా, బాధ కలిగినా వెంటనే తీర్చడానికి 'నేనున్నాన'ని ఎప్పుడూ మనకు ధైర్యాన్నిస్తారు బాబా. ఎవరికీ చెప్పుకోలేనివి చెప్పుకోగలిగేది ఆయనతోనే. మన బాధని వినేది బాబా మాత్రమే. మనం కోరుకునే కోరిక న్యాయమైనదై ఉండి, భారం బాబా మీద వేస్తే, ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి, బాధ నుంచి మనల్ని కాపాడుతామన్న నమ్మకాన్ని బాబా ఎప్పుడూ మనకి ఇస్తూనే ఉన్నారు. ఇక నా అనుభవానికి వస్తే..
ఇటీవల నా తమ్ముడికి కొడుకు పుట్టాడు. డాక్టర్లు బాబు పుట్టినప్పుడు చేసిన కొన్ని టెస్టులను బట్టి బాబు శరీరంలో ఏవో కొన్ని లెవల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని, చిన్న సమస్య ఉందని డిశ్చార్జ్ చేసారు. మేము చిన్న సమస్యే కదా అనుకోని 21వ రోజున బాబుకి బారసాల చేయాలని అనుకున్నాం. అమ్మాయి తరపువాళ్ళు ఫంక్షన్‍కి ఎక్కువ మందిని పిలవొద్దని అన్నారు. మేము కనీసం మా బంధువులనైనా పిలుస్తామని చెప్తే వాళ్ళు ఏదో బలవంతంగా ఒప్పుకున్నారు. అయితే అందరినీ పిలిచి, ఫంక్షన్‍కి ఏర్పాట్లు జరుగుతుండగా బాబుకున్నది అంత చిన్న సమస్య కాదని, కొంచెం పెద్దదేనని మాకు తెలిసింది. అప్పుడు, 'అసలే బాబుకి ఆరోగ్యం బాగాలేదు. మేము ఫంక్షన్‍కి కొంచెం ఎక్కువమందిని పిలుస్తున్నాము. మళ్లీ ఏదైనా అయితే మావాళ్ళనే అంటారు. ఏమవుతుందో, ఏమిటో' అని నాకు చాలా భయమేసి, "బాబా! ఏ సమస్య లేకుండా చూడండి. ఫంక్షన్ అయ్యాక బాబుకి ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా నిద్రపోయేలా చేయండి" అని బాబాని కోరుకున్నాను.
ఇదిలా ఉంటే డాక్టరు, "బాబుకున్న ఆరోగ్య సమస్య ఏమిటో నిర్ధారించడానికి ఇంకో టెస్టు చేద్దాం. దాన్నిబట్టి తరువాత ఏం చేయాలో ఆలోచిద్దామ"ని అన్నారు. అంతేకాదు, "ఒకవేళ రిపోర్టులో పాజిటివ్ వస్తే, బాబు ఆరోగ్యానికి మంచిది కాదు. గుండెదడ, బిపిలో హెచ్చుతగ్గులు వంటివి ఉంటాయి. కాబట్టి జీవితాంతం ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పగలు, రాత్రి బాబుకి ఆవిరిపడుతూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పారు. మేము మాకు తెలిసిన వాళ్ళకి ఆ రిపోర్టులు పంపిస్తే, వాళ్లు కూడా అదే అని, "వచ్చే రిపోర్ట్ నెగిటివ్ రావాలని కోరుకుందామ"ని అన్నారు. నాకు చాలా బాధగా, భయంగా అనిపించింది. జీవితాన్ని మొదలు కూడా పెట్టని చిన్నబాబుకి ఎందుకు 'బాబా' ఇన్ని సమస్యలని బాగా ఏడుపొచ్చి, "బాబా! ఎలాగైనా బాబు రిపోర్ట్స్ నెగిటివ్ రావాలి, తను ఆరోగ్యంగా ఉండాలి" అని బాబాను ఎంతగానో ప్రార్థించాను. తరువాత బాబా మెసేజ్ కోసం చూస్తుంటే, "ఆరోగ్యసమస్యలు సమసిపోతాయి. అంతా బాగుంటుంది. నా మీద నమ్మకముంచు" అని ఏదో ఒక మెసేజ్ ద్వారా చెప్తుండేవారు బాబా. కానీ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల 'బాబా నన్ను మర్చిపోయారా? నన్ను వదిలేసారా?' అని నాకు అనిపిస్తుండేది. ఆ భయంతో, "బాబా! నా భక్తిలో ఏదైనా లోపం ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించి బాబు ఆరోగ్యం బాగుండేలా చేయండి. మీకు ఏదైనా సాధ్యమే. నాకు మీ మీద 100% నమ్మకం ఉంది. నమ్మకం లేనిది నా భక్తి మీదనే. ఆ కారణంగా నేను మిమ్మల్ని సరిగా అడగలేకపోయినా నన్ను మన్నించి బాబు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ సమయంలో బాబు ఇంట్లో లేనందున రోజూ బాబా ఊదీ బాబుకి పెడుతున్న భావనతో నా నుదుటన పెట్టుకుని, గుండెలకు రాసుకుని, మరికొంత ఊదీ నోట్లో వేసుకుని, "బాబుకి నయం చేయండి బాబా, బాబు రిపోర్ట్ నార్మల్ వస్తే, మీరు నా జీవితంలో చేసిన ఇతర అనుభవాలతో సహా ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని కోరుకుంటూ ఉండేదాన్ని.
నేను మా తమ్ముడితో, "బాబాని వేడుకో, ఖచ్చితంగా బాబుకి బాగుంటుంది" అని చెప్పాను. తను, "అంతా మంచిగా ఉంటే, బాబుని ఉయ్యాలలో వేసేటప్పుడు బాబా పేరు కలిసి వచ్చేలా పేరు పెడతాను" అని చెప్పాడు. అంతలో డాక్టరు 'బారసాల ముందురోజు రావాల్సిన రిపోర్టు మరుసటిరోజు వస్తుంద'ని చెప్పారు. అప్పుడు నాకు 'తమ్ముడు బాబాని టెస్ట్ చేయాలనుకుని అంతా బాగుంటే బాబా పేరు పెట్టుకుంటా' అని అన్నాడేమో! అందుకని బాబా నా తమ్ముడి భక్తిని టెస్ట్ చేయాలనుకున్నారేమో! అందుకే రిపోర్టు రావడం ఆలస్యం అవుతుంది' అనిపించి తమ్ముడితో, "నువ్వు నమ్మకంతో బాబా పేరు పెట్టు. అంతా మంచిగా అవుతుంది" అని చెప్పాను. తను సరేనన్నాడు.
రేపు ఫంక్షన్ అనగా ముందురోజు బాగా వర్షం పడే సూచనలు కనిపించాయి. నేను ఫంక్షన్‍కి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని, "బాబా! ఫంక్షన్‍కి ఏ ఆటంకం లేకుండా చూడండి. ఇంకా బాబు మంచిగా ఉండాలి. మీ దయతో ఫంక్షన్ మంచిగా జరిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు వర్షం పడలేదు. అయితే మా తమ్ముడితో ఎవరేమి చెప్పారో, ఏమన్నారో తెలియదుకానీ బాబుకి పేరు పెట్టే సమయానికి తను, "సాయి పేరు జతచేస్తే పేరు పెద్దదవుతుంది. అందువల్ల కేవలం నక్షత్రం ప్రకారం పేరు పెడదాము" అని అన్నాడు. నాకు చాలా బాధేసి, "నువ్వు బాబా పేరు వచ్చేలా కలిపి పెట్టు. బాబా అంటే ఏంటో నీకు చూపిస్తారు. నేను పంతంతో సాయి పేరు పెట్టించట్లేదు. బాబు మంచికోసం ఆలోచించే చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సాయి పేరు పెట్టు" అని బాగా గట్టిగా చెప్పాను. మా అమ్మ కూడా అదే చెప్పింది. అయితే అమ్మాయి తరపువాళ్ళకి అది ఇష్టం లేనట్టు అనిపించింది. అయినప్పటికీ నేను బాబు మంచికోసం బలవంతం చేశాను. ముందు తమ్ముడు ఏమీ చెప్పకున్నా సరిగా పేరు పెట్టే సమయానికి ఏమైందో తెలియదుగాని బాబా పేరు పెట్టి బాబుని పిలిచాడు. నాకు చాలా సంతోషంగా అనిపించి, "బాబా! నీ పేరు పెట్టుకోవడం వాడి అదృష్టం. వాడి అదృష్టం ఏమిటో అందరికీ తెలిసిలా చేయండి. నువ్వున్నావని నేను గట్టిగా నమ్ముతాను. మీరు నా నమ్మకం నిజమని ఋజువు చేయాలి. బాబుకి అంతా బాగుండాలి" అని దృఢంగా బాబాని కోరుకున్నాను. ఫంక్షన్ అయ్యాక బాబు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. అది చూసి నేను, మావాళ్ళ మీద మాట పడకుండా చేసినందుకు బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. తరువాత బాబా గుడికి వెళ్లి, 'నా తమ్ముడిని, పెద్దయ్యాక బాబుని శిరిడీ తీసుకొస్తాను. అంతా బాగుంటే, అన్నదానానికి కొంత డబ్బు ఇస్తాను' అని అనుకున్నాను. ఆ సమయంలో ఈ కింది వాక్యాలను బాబా నా కంటపడేలా చేసారు.
Sri Satchitaananda Samasta Sadguru Sainaath Maharaj Ki Jai 🙏🏼🙏🏼🙏🏼🌸
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి మంత్రం వుండగ ఆ మంత్రమే మనల్ని కాపాడుతుంది. సాయి తండ్రి ఆశీస్సులు మనకు వుంటే ఆపదలు తొలి గి పోతాయి. ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete